By: ABP Desam | Updated at : 20 Aug 2021 08:48 AM (IST)
Image Credit: Pixabay
రాఖీ వస్తోంది.. మరి మీ సోదరికి ఇష్టమైన గిఫ్టును సిద్ధం చేశారా? ఇంకా లేదా? అయితే.. ఈ రోజే గిఫ్టును కొనుగోలు చేసి రెడీగా ఉంచండి. మరి ఏ గిఫ్ట్ ఇస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నారా? రూ.2 వేలు నుంచి రూ.5 వేలు లోపు ఉత్పత్తుల కోసం వెతుకుతున్నారా? అయితే.. ఇవి ప్రయత్నించండి. ఈ వస్తువులు మీకు తప్పకుండా నచ్చుతాయని భావిస్తున్నాం.
బ్లూటూత్ స్పీకర్: మీ సోదరికి మ్యూజిక్ వినడం ఇష్టమైతే ఇది కొనుగోలు చేయండి. సుమారు 5 గంటలు ప్లే టైమ్ దీని ప్రత్యేకత. నాయిస్ క్యాన్సలింగ్ ఆడియోతోపాటు ఆడియో కేబుల్ పోర్ట్ ఇందులో ఉంది. దీని ధర సుమారు రూ.1700 వరకు ఉంటుంది.
ఫొటో ఫ్రేమ్: జీవితంలో ఆనంద క్షణాలను బందించే ఫొటో ఎప్పటికీ నిలిచిపోతుంది. మీ సోదరి.. మీరు కలిసి ఉన్న ఫొటోలను కలెక్ట్ చేసి.. వాటిని ఒక ఫొటో ఫ్రేమ్‌లో పెట్టి అందిస్తే.. ఆమె తప్పకుండా ఆనందపడుతుంది. అయితే, ఎక్కువ ఫొటోలు పట్టే ఫోటోగ్రాఫ్ కోల్లెజ్‌ను ఆమెకు కానుకగా ఇవ్వండి. వీటి ధరలు రూ.వెయ్యి లోపే ఉంటుంది.
స్కిన్ కేర్ కిట్: అమ్మాయిలకు అలంకరణ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. కాబట్టి.. మీ సోదరికి మంచి స్కిన్ కేర్ కిట్‌ను కానుకగా అందించండి. లేదా మేకప్ కిట్ ఇచ్చినా చాలు.. చాలా ఆనందపడుతుంది.
చేతి గడియారం: అమ్మాయిల అలంకరణలో మరో ముఖ్యమైనది చేతి గడియారం. దీన్ని మీరు కానుకగా ఇస్తే.. దాన్ని చూసినప్పుడల్లా మీరే గుర్తుకు వస్తారు. ఎల్లప్పుడు అది చేతికి ఉండటం వల్ల మీరు తోడుగా ఉన్నారనే భావన కలుగుతుంది. ఇటీవల, ఫిట్‌నెస్, జీపీఎస్ వాచ్‌లు కూడా ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే, ఇవి రూ.5 వేలు కంటే ఎక్కువ ధరే ఉండవచ్చు. ఆన్‌లైన్‌లో ఆఫర్లు ఉంటే తక్కువ ధరకే వీటిని కొనుగోలు చేయొచ్చు.
ఇన్స్‌టంట్ పిక్చర్ కెమేరా: ఇటీవల మార్కెట్లో ఇన్స్‌టంట్ పిక్చర్ కెమేరాలు వస్తున్నాయి. అయితే, మొబైల్ ఉండగా కెమేరాతో పనేంటి అనేగా మీ సందేహం. ఈ కెమేరా వెంట ఉంటే ఫొటోలు ప్రత్యేకంగా ప్రింట్ చేయించుకోక్కర్లేదు. క్లిక్ చేసిన వెంటనే ఫొటోలు వాటికవే కెమేరాలో ప్రింటై వచ్చేస్తాయి. ఇన్‌స్టాక్స్ మినీ 11 అనే కెమేరాలో సుమారు 20 ఇన్‌స్టంట్ ఫొటోలు తీయొచ్చు. దీని ధర సుమారు రూ.6 వేలు వరకు ఉంటుంది.
హ్యాండ్ బాడీ మసాజర్: మసాజ్ వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. ఇటీవల మార్కెట్లో హ్యాండ్ బాడీ మసాజర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ మసాజర్లతో కండరాల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. దీని ధర రూ.వెయ్యి లోపే ఉంటుంది.
హ్యాండ్ బ్యాగ్: అమ్మాయిలకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. ఇప్పటికే మీరు ఆమె ఎలాంటి హ్యాండ్ ఇష్టపడుతుందో తెలుసుకొనే ఉంటారు. కాబట్టి.. మంచి నాణ్యమైన హ్యాండ్ బ్యాగ్‌ను ఆమెకు కానుకగా ఇచ్చి సర్‌ప్రైజ్ చేయండి. క్వాలిటీని బట్టి వీటి ధరలు ఉంటాయి.
ల్యాప్‌టాప్ బ్యాగ్: మీ సోదరికి ల్యాప్‌టాప్ ఉన్నట్లయితే మంచి బ్యాగ్‌ను కొనివ్వండి. బ్యాక్ ప్యాక్ టైపు కాకుండా.. హ్యాండ్ బ్యాగ్ తరహాలో ఉండే లేడీస్ ల్యాప్‌టాప్‌లు ఆన్‌లైన్‌లో కేవలం రూ.1500 లోపే అందుబాటులో ఉంటున్నాయి.
హెడ్‌ఫోన్స్: ఇటీవల వైర్‌లెస్, బ్లూటూత్ హెడ్ ఫోన్స్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. రూ.వెయ్యి లోపే వీటి ధరలు ఉన్నాయి. బ్రాండెడ్ హెడ్ ఫోన్స్ కావాలంటే మరో రూ.వెయ్యి ఖర్చుపెడితే చాలు.
కప్పులపై ఫొటోలు: ఇటీవల కప్స్ మీద ఫొటోలు ప్రింట్ చేసి ఇస్తున్నారు. మీ సోదరితో కలిసి ఉన్న అరుదైన ఫొటో లేదా ఆమె చిన్ననాటి ఫొటో ఏదైనా అందుబాటులో కప్ మీద ప్రింట్ చేయించి ఇవ్వండి. ఆమె చాలా సంతోషిస్తుంది.
Sleeping Disorder: నిద్రలో కేకలు వేస్తూ గట్టిగా అరుస్తున్నారా? ఇది కూడా ప్రమాదకరమైన నిద్ర రుగ్మతే
ఈ జీవులతో జాగ్రత్త - కరవడమే కాదు, చర్మంలో గుడ్లు కూడా పెట్టేస్తాయ్!
Dreams Meaning: మీకు ఇలాంటి కలలు వస్తున్నాయా? త్వరలో మీకు పెళ్లికాబోతుందని అర్థం!
Diabetes: డయాబెటిస్ బాధితులకు వేసవి చాలా డేంజర్ - ఇలా అదుపులో ఉంచుకోండి
ఆర్టిఫిషియల్ ఇంటలెజెన్స్‌తో హార్ట్ ఫెయిల్యూర్ ముప్పును ముందే తెలుసుకోవచ్చట!
Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!
CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు
YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !