Cow Dung Car: కారును ఆవు పేడతో అలికేసిన యజమాని, ఎందుకో తెలిస్తే ఔరా అంటారు!
ఓ వ్యక్తి తన కారును ఆవు పేడతో అలికేశాడు. అలా ఎందుకు చేశాడో తెలుసుకోవాలని ఉందా?
కారుపై చిన్న గీతపడినా ప్రాణం విలవిల్లాడుతుంది. అలాంటిది ఆ కారు యజమాని ఏకంగా తన కారు మొత్తాన్ని పేడతో అలికేశాడు. ఛీ, కారంత పేడ కంపు కొడుతుందని కదా అనేగా మీరంటారు. అయితే, అతడికి ఆ కంపే ఇంపు. అయితే, అతడు ఆ కంపు కోసమే కారును పేడతో అలికాడని మాత్రం అనుకోవద్దు. అందుకు వేరే కారణం ఉంది.
పూణెకు చెందిన ఓ వ్యక్తి వచ్చిన ఐడియా ఇది. వేసవిలో ఎండలు ఏ స్థాయిలో ఉంటాయో తెలిసిందే. అలాంటి సమయంలో ఏసీ లేని కారులో ప్రయాణించడమేంటే.. కుక్కర్లో కూర్చొని ప్రయాణిస్తున్నట్లే ఉంటుంది. మారుతీ ఓమిని కారు యజమానికి కూడా అదే అనిపించింది. ఎండ వేడిని తట్టుకోడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. చివరికి.. అతడికి కత్తిలాంటి ఐడియా వచ్చింది.
Also Read: మహిళలకు భర్తను అద్దెకిస్తున్న భార్య, రోజుకు రూ.3 వేలు ఆదాయం!
ఆవు పేడ చల్లదనం ఇస్తుందని తెలియడంతో ఆ కారు యజమాని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వెంటనే రెండు గంపల పేడ తెచ్చి కారుకు పామేశాడు. కేవలం లైట్లు, విండ్‌షీల్డ్స్ మినహా కారు మొత్తాన్ని పేడతో ముంచేశాడు. ఆ తర్వాత జాలీగా ఆ ‘పేడ’ కారులో చక్కర్లు కొట్టాడు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి. మీ కారు కూడా చల్లగా ఉండాలి అనుకుంటే.. ఈ హ్యక్‌ను ట్రై చేయండి.
Also Read: ప్రియుడి తండ్రిని పెళ్లి చేసుకున్న యువతి, ఇద్దరికీ 24 ఏళ్లు గ్యాప్!