News
News
X

Woman's Health: ‘పోషకాహార మాసం’ అంటే ఏమిటీ? ఎందుకు నిర్వహిస్తున్నారు? మహిళలకు కలిగే ప్రయోజనాలేమిటీ?

భారతీయ గృహిణిలు తమ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించరు. అందుకే వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకే ఈ పోషణ్ మాసం తీసుకొచ్చారు.

FOLLOW US: 

మహిళలు ఇంటి పనుల్లో పడి తమ ఆరోగ్యాన్ని పట్టించుకోరు. ఇంట్లో భర్త, పిల్లలకి మాత్రం ఏదైనా అయ్యిందంటే రాత్రి పగలు అనే తేడా లేకుండా నిద్రాహారాలు మానుకుని వాళ్ళకి సేవలు చేస్తూ ఉంటారు. అందుకే స్త్రీ ని భూదేవితో పోలుస్తారు. భూదేవికి ఉన్నంత ఓర్పు, సహనం స్త్రీకి మాత్రమే సొంతం. వారి ఆరోగ్యాన్ని సంరక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏటా సెప్టెంబర్ నెలని 'పోషణ మాహ్' లేదా 'పోషకాహార మాసం'గా పాటిస్తుంది. 2018 మార్చి 8న ప్రధాని నరేంద్ర మోదీ ఈ పోషణ్ అభియాన్ ని ప్రారంభించారు. దీన్నే జాతీయ పోషకాహార మిషన్ అని కూడా పిలుస్తారు. ఈ ఏడాది ప్రభుత్వం మహిళా ఆరోగ్యం, శిశు, విద్యపై దృష్టి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. జాతీయ పోషకాహార మాసం 2022 థీమ్ ‘మహిళా ఔర్ స్వస్త్య’, ‘బచా ఔర్ శిక్ష’.

వయస్సు పెరిగే కొద్ది స్త్రీల ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. కానీ భారతీయ మహిళలు మాత్రం తమ ఆరోగ్యం గురించి చాలా తక్కువ శ్రద్ధ చూపిస్తారు. తల్లిగా, భార్యగా, కూతురుగా ఎప్పుడు ఇతరుల ఆరోగ్యం గురించి ఆలోచిస్తారే తప్ప తమ స్వంత ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తారు. 40 ఏళ్ళకు చేరుకున్న తర్వాత మహిళల్లో అనేక అనారోగ్య సమస్యలు బయటపడతాయి. వృద్ధాప్యం శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపడం మొదలు పెడుతుంది. 10  మందిలో 7మంది మహిళలు తల నొప్పి, నిద్ర లేమి, అలసట, జుట్టు రాలడం వంటి సమస్యలను ఎదుర్కొంటు తమ వద్దకి వస్తున్నారని అపోలో హాస్పిటల్ కి చెందిన డైటీషియన్ ఒకరు చెప్పుకొచ్చారు.

నలభై ఏళ్లు దాటిన తర్వాత మహిళల్లో వచ్చే సమస్యలు

మహిళలు 40 ఏళ్లు దాటిన తర్వాత పెరిమెనోపాజ్ దశకి చేరుకుంటారు. ఈ సమయంలో శరీరంలో హార్మోన్ స్థాయిలో భారీ మార్పు ఉంటుంది. దాని వల్ల ఆందోళన, నిరాశ వంటి సమస్యలకు లోనవుతారు. 40 ఏళ్లు దాటిన తర్వాత మహిళలు అండాశయం, ఎముకల ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలకు గురవుతారు. స్త్రీలకు స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ. మహిళలు ఈ వయస్సులో రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆటో ఇమ్యూన్ పరిస్థితికి కూడా గురవుతారు. ఇవే కాకుండా మూత్రాశయంలో సమస్యలు, మూత్రపిండాల్లో రాళ్ళు, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్స్, ఆస్టియో ఆర్థరైటిస్, అధిక రక్తపోటు సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది.

అధిగమించడం ఎలా

మనం తినే ఆహరం సంపూర్ణంగా ఉండాలి. అన్నీ పోషకాలు అందె విధంగా సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఇవే కాదు శారీరక శ్రమ, వ్యాయామం అవసరం చాలా ఉంది. ఎందుకంటే మంది ప్రోటీన్స్ తో పాటు వ్యాయామం కూడా కండరాలను బలోపేతం చెయ్యడానికి సహాయపడుతుంది. అలసటని అధిగమించడంలో సహకరిస్తుంది. మహిళలు పనుల్లో పడి సకాలంలో తినడం మానేస్తారు. అలా చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదం. శరీరానికి 2200 నుంచి 2500 కేలరీలు అవసరమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. శరీర బరువు శారీరక విధుల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆలస్యంగా తినడం వల్ల గ్యాస్ సమస్యలు వస్తే, అధికంగా తినడం వల్ల బరువు పెరుగుతారు. అందుకే సమతుల్య, సమయానుకూల ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

పోషకాహర మాసం లక్ష్యం

పంచాయతీ స్థాయిలో అవగాహన కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. "పోషన్ పంచాయతీ కమిటీలు అంగన్‌వాడీ కేంద్రాలు(AWC), గ్రామ ఆరోగ్యం, పోషకాహార దినోత్సవం ఇతర సంబంధిత ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సమస్యల పరిష్కారానికి, సేవలను అందించడంలో సహాయపడటానికి క్షేత్ర స్థాయి కార్యకర్తలతో కలిసి పని చేస్తుంది. రక్తహీనత పరీక్షల కోసం ప్రత్యేకంగా AWCలలో ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తారు.

గిరిజన ప్రాంతాల్లో తల్లి, బిడ్డల ఆరోగ్యం కోసం సాంప్రదాయ ఆహారాలపై ప్రత్యేక దృష్టి సారించేందుకు 'అమ్మా కి రసోయి' అనే కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇదే కాకుండా సాంప్రదాయ పోషకమైన వంటకాల ప్రాముఖ్యతని తెలిపేందుకు ‘అమ్మమ్మ వంటగది’ వంటి కార్యకలాపాలను పెంపొందిస్తోంది. 

Also Read: ఈ ‘టీ’లు మిమ్మల్ని బ్యూటీఫుల్‌గా మార్చేస్తాయ్, ట్రై చేసి చూడండి

Also read: ఇంట్లోనే వేడి వేడి మొక్కజొన్న గారెలు, తింటే ఎంతో బలం

Published at : 07 Sep 2022 03:59 PM (IST) Tags: Woman Health POSHAN Abhiyan Woman Health Care Poshan Maah National Nutrition Month

సంబంధిత కథనాలు

Women's Health: మహిళలూ, మీరు ఈ వయస్సుకు వస్తే ఈ ఐదు పరీక్షలు తప్పనిసరి! లేకపోతే..

Women's Health: మహిళలూ, మీరు ఈ వయస్సుకు వస్తే ఈ ఐదు పరీక్షలు తప్పనిసరి! లేకపోతే..

Coronavirus: గొంతు నొప్పిగా ఉందా? జలుబు అనుకుంటే పొరబడినట్లే - ఎందుకో తెలుసా?

Coronavirus: గొంతు నొప్పిగా ఉందా? జలుబు అనుకుంటే పొరబడినట్లే - ఎందుకో తెలుసా?

Gut Health: ఇలా చేశారంటే మీ పేగులు చెడిపోతాయ్ - ఈ అలవాట్లకు దూరంగా ఉండండి

Gut Health: ఇలా చేశారంటే మీ పేగులు చెడిపోతాయ్ - ఈ అలవాట్లకు దూరంగా ఉండండి

Hair Care: నిగనిగలాడే జుట్టు కోసం కరివేపాకు - ఈ చిట్కాలు పాటిస్తే పొడవైన జుట్టు మీ సొంతం

Hair Care: నిగనిగలాడే జుట్టు కోసం కరివేపాకు - ఈ చిట్కాలు పాటిస్తే పొడవైన జుట్టు మీ సొంతం

వీటిని అతిగా తింటే శరీరంలో విషంగా మారిపోతాయి

వీటిని అతిగా తింటే శరీరంలో విషంగా మారిపోతాయి

టాప్ స్టోరీస్

Amaravati Vs Three Capitals : అమరావతికి పోటీగా మూడు రాజధానులపై విస్తృత ప్రచారం - వైఎస్ఆర్‌సీపీ స్ట్రాటజీ ప్రజల్లోకి వెళ్తుందా ? ప్రజల్ని కన్విన్స్ చేయగలుగుతారా ?

Amaravati Vs Three Capitals :  అమరావతికి పోటీగా మూడు రాజధానులపై విస్తృత ప్రచారం - వైఎస్ఆర్‌సీపీ స్ట్రాటజీ ప్రజల్లోకి వెళ్తుందా ? ప్రజల్ని కన్విన్స్ చేయగలుగుతారా ?

KCR National Party : జాతీయ పార్టీ ప్రకటనకు సర్వం సిద్ధం, హైదరాబాద్ చేరుకుంటున్న నేతలు

KCR National Party : జాతీయ పార్టీ ప్రకటనకు సర్వం సిద్ధం, హైదరాబాద్ చేరుకుంటున్న నేతలు

Sri Rajarajeshwari Ashtakam: సకల విజయాలను అందించే అష్టకం, దసరా రోజు చదువుకుంటే మంచిది

Sri Rajarajeshwari Ashtakam: సకల విజయాలను అందించే అష్టకం, దసరా రోజు చదువుకుంటే మంచిది

Weather Updates: అల్పపీడనం ఎఫెక్ట్ - ఏపీ, తెలంగాణలో 3 రోజులపాటు వర్షాలు: IMD

Weather Updates: అల్పపీడనం ఎఫెక్ట్ - ఏపీ, తెలంగాణలో 3 రోజులపాటు  వర్షాలు: IMD