అన్వేషించండి

Phenyl for Floor Cleaning : ఫినాయిల్‌తో ఫ్లోర్ తుడుస్తున్నారా? వారానికి ఎన్నిసార్లు, ఎంత ఫినాయిల్, ఎలా వాడాలో తెలుసా?

Phenyl Cleaning Tips : ఇంటిని, ఆఫీస్​ ఇతర ప్రదేశాల్లో ఫ్లోర్ క్లీనింగ్ కోసం చాలామంది ఫినాయిల్ వాడతారు. అయితే దీనిని వారంలో ఎన్నిసార్లు ఉపయోగించాలి? బకెట్ నీటిలో ఎంత ఫినాయిల్ కలపాలో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఒక లీటరు నీటిలో సుమారు 30-50 ml ఫినాయిల్ కలపాలి.
  • కిచెన్, బాత్‌రూమ్‌లు ప్రతిరోజు లేదా రోజువిడిచి రోజు తుడవాలి.
  • బెడ్‌రూమ్, హాల్‌లను వారానికి రెండు, మూడుసార్లు శుభ్రం చేయవచ్చు.
  • ఫినాయిల్ నేరుగా నేలపై వేయకుండా నీటిలో కలపాలి.

Floor Cleaning With Phenyl : ఇంటిని ఊడ్చి, తడిపెట్టడం అనేది రోజువారీ ఇంటి పనుల్లో ముఖ్యమైన పనిగా చెప్పవచ్చు. హాల్, వంటగది, బాత్రూం వంటి ఎక్కువగా తిరిగే ప్రదేశాలు త్వరగా మురికిగా అవుతాయి. అందుకే వీటిని శుభ్రంగా ఉంచేందుకు చాలా మంది ఫినాయిల్‌ను ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది నేలను శుభ్రపరచడమే కాకుండా దుర్వాసనను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.  

ఫినాయిల్ ఎన్నిసార్లు వాడాలి?

ఫినాయిల్ వినియోగం అనేది.. మీరు శుభ్రం చేసే ప్రాంతం, పేరుకుపోయే మురికి పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. వంటగది, బాత్రూమ్, బెడ్​రూమ్​, గెస్ట్​ రూమ్​ వంటివి ఎన్నిసార్లు, ఎలా క్లీన్ చేస్తే మంచిదో చూద్దాం. అలాగే వారానికి ఎన్నిసార్లు ఫినాయిల్​తో నేలను తుడవాలి? ప్రతిరోజూ తుడవడం అవసరమా? బకెట్ నీళ్లలో ఎంత ఫినాయిల్ వేయాలో వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read : మంచం కింద పేరుకుపోయిన దుమ్ము, చెత్తను ఈజీగా శుభ్రం చేయాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

బకెట్ నీటికి ఎంత ఫినాయిల్ కలపాలి?

ఫినాయిల్ గాఢత, అందులోని పదార్థాలను బట్టి ఎంత ఫినాయిల్ కలపాలో నిర్ణయించుకోవాలి. నేలను శుభ్రపరచడానికి ఒక లీటరు నీటికి సుమారుగా 30 నుంచి 50 మిల్లీలీటర్ల ఫినాయిల్ కలపవచ్చు. బాత్రూమ్‌లు లేదా ఎక్కువ రద్దీ ఉండే ప్రదేశాలు, బాగా మురికిగా ఉన్న ప్రదేశాలకు.. ఒక లీటరుకు 60 నుంచి 80 మిల్లీలీటర్లు ఉపయోగించవచ్చని సిఫార్సు చేస్తున్నారు. అయితే ప్రొడెక్ట్ బట్టి ఈ మోతాదు మారవచ్చు. అందుకే మీరు వినియోగించే ఫినాయిల్ లేబుల్‌పై ఉన్న పద్ధతి ఫాలో అవ్వండి. 

ఫినాయిల్​తో తుడిచే పద్ధతి..

ముందుగా ఒక బకెట్‌లో నీళ్లు నింపి.. అవసరమైనంత ఫినాయిల్ కలపండి. నీటిలో కలిసేలా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు శుభ్రమైన మాప్‌ను తీసుకుని.. ఆ నీటిలో ముంచి.. బాగా పిండేయండి. మాప్‌లో నీరు మరీ ఎక్కువగా ఉండకూడదు. ఇప్పుడు.. నేలను సమానంగా తుడవండి. శుభ్రం చేసిన తర్వాత.. నేల పూర్తిగా ఆరిపోయేలా గదికి గాలి తగిలేలా డోర్స్ తీయడం, ఫ్యాన్స్ వేయడం చేయాలి. అలాగే నేల తడిగా ఉన్నప్పుడు పిల్లలు, పెంపుడు జంతువులను దూరంగా ఉంచాలి.

Also Read : ఫ్రిడ్జ్‌లో పాలు, కూరగాయలు, మాంసం ఎక్కడ పెట్టాలి? ఏ అరలో ఏది పెట్టాలో తెలుసా?

రోజూ క్లీన్ చేయాల్సిన రూమ్స్.. 

కిచెన్, బాత్రూమ్​లు త్వరగా తేమ, మురికి, దుర్వాసనలకు గురి అవుతాయి. అందుకే ఈ ప్రదేశాలను ప్రతిరోజూ లేదా రోజు విడిచి రోజు ఫినాయిల్‌తో తుడుచుకోవచ్చు. వర్షాకాలంలో,  తేమ ఎక్కువగా ఉన్నప్పుడు.. ఈ ప్రదేశాల శుభ్రతపై మరింత శ్రద్ధ చూపించాలి. అయితే ఫినాయిల్ పరిమాణాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఫినాయిల్‌ ఎక్కువగా కలపడం వల్ల నేలపై జిగట పొర లేదా దాని అవశేషాలు మిగిలిపోవచ్చు. అలా అని తక్కువ ఫినాయిల్‌ను ఎక్కువ నీటితో కలిపితే శుభ్రపరిచే ప్రభావం తగ్గుతుంది. కాబట్టి రూమ్​, మురికిని బట్టి ఫినాయిల్ వాడాలి. 

బెడ్ రూమ్, హాల్ కోసం.. 

బెడ్​రూమ్, హాల్​లో మురికి తక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే ఈ ప్రదేశాలను వారానికి రెండు నుంచి మూడు సార్లు ఫినాయిల్​తో క్లీన్ చేయవచ్చు. ఒకవేళ ఇల్లు దుమ్ముగా ఉండి.. మీకు పెంపుడు జంతువులు ఉంటే.. అవసరమైనప్పుడు మీరు వాక్యూమ్ చేసుకోవచ్చు. క్రమం తప్పకుండా.. తేలికపాటి శుభ్రత చేయడం వల్ల నేలపై దుమ్ము, మురికి పేరుకుపోకుండా ఉంటుంది. 

ఫినాయిల్‌ను నేరుగా నేలపై పోయవచ్చా?

ఫినాయిల్ నేరుగా నేలపై పోసి తుడువడానికి బదులుగా.. దానిని సరైన మోతాదులో నీటితో కలపడం మంచిది. ఫినాయిల్‌ ఎక్కువగా ఉపయోగిస్తే మెరుగైన శుభ్రత వస్తుందని అనుకోకూడదు. ప్రొడెక్ట్​పై సూచనలు మాత్రమే ఫాలో అవ్వాలి. అలాగే ఫినాయిల్‌ను ఇతర క్లీనర్‌లతో కలపకూడదని గుర్తించుకోవాలి. 

Also Read : ఇంట్లో అద్దాన్ని శుభ్రం చేసే టిప్స్ ఇవే? మచ్చలేని, మెరుపు కోసం వీటిని ఫాలో అయిపోండి

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Health Tests After 30 : బీపీ, షుగర్, కొలెస్ట్రాల్.. 30 తర్వాత ఈ హెల్త్ చెకప్స్ తప్పక చేయించుకోండి
బీపీ, షుగర్, కొలెస్ట్రాల్.. 30 తర్వాత ఈ హెల్త్ చెకప్స్ తప్పక చేయించుకోండి
Egg Maggi Recipe : ఎగ్ మ్యాగీ రెసిపీ.. ఇలా చేస్తే టేస్టీగా, స్పైసీగా ఉంటుంది.. ఇంట్లోనే చేసుకోండిలా
ఎగ్ మ్యాగీ రెసిపీ.. ఇలా చేస్తే టేస్టీగా, స్పైసీగా ఉంటుంది.. ఇంట్లోనే చేసుకోండిలా
High Blood Pressure : హై బీపీ ఉందా? ఈ ఆహారాలను తగ్గించండి.. లేదంటే బీపీ కంట్రోల్‌ కావడం కష్టమే
హై బీపీ ఉందా? ఈ ఆహారాలను తగ్గించండి.. లేదంటే బీపీ కంట్రోల్‌ కావడం కష్టమే
HIV Prevention Injection : హెచ్​ఐవీ నివారణకు 8 వారాలకు ఒకసారి ఇంజెక్షన్.. ఇకపై రోజూ మాత్రలు వేసుకోనవసరం లేదట
హెచ్​ఐవీ నివారణకు 8 వారాలకు ఒకసారి ఇంజెక్షన్.. ఇకపై రోజూ మాత్రలు వేసుకోనవసరం లేదట
Advertisement

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AI analyzes Characters: ఏఐ మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలదా? ఈ ప్రయోగంతో తెలుసుకోవచ్చు!
ఏఐ మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలదా? ఈ ప్రయోగంతో తెలుసుకోవచ్చు!
Amaravathi Lands: అమరావతి గ్రామకంఠం భూములపై సీఆర్డీఏ క్లారిటీ.. మినహాయింపులకు కటాఫ్ తేదీ ఇదే
అమరావతి గ్రామకంఠం భూములపై సీఆర్డీఏ క్లారిటీ.. మినహాయింపులకు కటాఫ్ తేదీ ఇదే
Ex Minister Ambati Rambabu: మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
UPI Subsidy: MDR అమలు చేసినా UPIకి సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక
MDR అమలు చేసినా UPIకి సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక
TTD Online Tickets Booking: రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల గోల్‌మాల్ ఆరోపణలు.. భక్తులకు టీటీడీ క్లారిటీ
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల గోల్‌మాల్ ఆరోపణలు.. భక్తులకు టీటీడీ క్లారిటీ
త్వరలో మార్కెట్లోకి రానున్న New Renault Duster .. లాంచ్ తేదీ, ఫీచర్లు సహా అంచనా ధర వివరాలు
త్వరలో మార్కెట్లోకి రానున్న New Renault Duster .. లాంచ్ తేదీ, ఫీచర్లు సహా అంచనా ధర వివరాలు
Crime News: ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
Khairatabad Byelection: ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో పోటీకి రెడీ.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రకటన
ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో పోటీకి రెడీ.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రకటన
Embed widget