Cancer: డయాబెటిస్ ఉన్నవారు అవి తింటే, క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ
డయాబెటిస్ ఉన్న వారి జీవితం కత్తి మీద సాము వంటివి. ఏది ఎక్కువ తింటే ఏ సమస్య వచ్చి పడుతుందో తెలియదు.
డయాబెటిస్ ఉన్న వారికే కాదు, లేని వారికి కూడా ఇది హెచ్చరికే. పంచదార తక్కువ తినాలన్న భావనతో చాలా మంది కృత్రిమ స్వీటెనర్లు తింటుంటారు. కాఫీ, టీలలో చక్కెరకు కృత్రిమ స్వీటెనర్లు కలుపుకునే వాళ్లు అధికమే. ఇవి తినడం వల్ల చక్కెర శరీరంలో అధికంగా చేరదు. అలాగే కేలరీలు కూడా తగ్గుతాయి. అందుకే వాటిని వాడే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. అయితే ఇప్పుడు కృత్రిమ స్వీటెనర్లు వాడడం వల్ల చాలా ప్రమాదమని, భవిష్యత్తులో డయాబెటిస్ వచ్చే అవకాశం పెరుగుతుందని కొత్త అధ్యయనంలో తెలిసింది.ఒక అంతర్జాతీయ మ్యాగజైన్లో ఈ అధ్యయనానికి సంబంధించి కథనం ప్రచురితమైంది. 2009 నుంచి ఈ అధ్యయనాన్ని నిర్వహిస్తూ వచ్చారు. ఇప్పుడు ఫలితాన్ని బయటపెట్టారు. దాదాపు 1,02,865 మంది ఫ్రెంచ్ పెద్దలపై ఈ అధ్యయనం సాగింది. ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు దీన్ని నిర్వహించారు.
అధ్యయనం ఇలా...
ఇది వెబ్ ఆధారంగా నిర్వహించిన పరిశోధన. ఇందులో ఫ్రెంచ్ దేశానికి చెందిన వారు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. వారంతా తమ డేటాను ఎప్పటికప్పుడు అందులో నమోదు చేస్తా ఉంటారు. అంటే తమ మెడికల్ హిస్టరీ, ఆ రోజు ఆహారం ఏం తిన్నారు, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, హెల్త్ డేటా అంతా అందులో రిపోర్ట్ చేస్తారు. వారిలో కృత్రిమ స్వీటెనర్ తీసుకున్న వారి డేటాను వేరు చేశారు పరిశోధకులు. అలా కొన్నాళ్ల పాటూ చేశాక కృత్రిమ స్వీటెనర్, క్యాన్సర్ మధ్య సంబంధాన్ని కనుగొనేందుకు ఆ గణాంకాలను వాడారు. అంటే కృత్రిమ స్వీటెనర్ వాడిన వారిలో ఎంత మంది క్యాన్సర్ బారిన పడ్డారో లెక్క చూశారు. ఇందులో వ్యక్తి వయస్సు, లింగం, శారీరకశ్రమ ఇలా అనేక రకాలను కూడా తెలుసుకున్నారు.
అధికమొత్తంలో కృత్రిమ స్వీటెనర్లు వాడిన వారిలో అధికంగా క్యాన్సర్ కేసులే బయటపడ్డాయి. వాడని వారితో పోలిస్తే వీటిని వాడే వారిలో దాదాపు 1.13 శాతం క్యాన్సర్ వచ్చే రిస్క్ అధికంగా ఉన్నట్టు అంచనా వేశారు. ఆడవాళ్లలో రొమ్ము క్యాన్సర్ వస్తోందని, అలాగే ఊబకాయం వస్తోందని గమనించారు. అయితే ఇది కచ్చితంగా జరుగుతుందని నిర్ధారించడానికి మరింత లోతైన పరిశోధన అవసరమని తెలిపారు శాస్త్రవేత్తలు.
పరిశోధకులు మాట్లాడుతూ ‘మా పరిశోధనను బట్టి ఆహారాల్లో పంచదారకు ప్రత్యామ్నాయంగా కృత్రిమ స్వీటెనర్లు వాడడం మంచిది కాదు. వాటి వల్ల ప్రతికూల ఆరోగ్య ప్రభావాలు పడే అవకాశం ఉంది’ అని వివరించారు.
Also read: రోజుకో చిన్నముక్క పల్లీ చిక్కీ తింటే మహిళలు, పిల్లల్లో ఆ సమస్య దూరం
Also read: ఈ ఆహారాలకు దూరంగా ఉంటే మొటిమలు రావు, ఈ సమస్య ఎంతమందిని వేధిస్తోందో తెలుసా?
Also read: కరోనా టీకా భుజానికే ఎందుకు వేస్తారు? నరాలకు కాకుండా కండరాలకే సూది ఎందుకు గుచ్చుతారు?