Eggs: వంద కోట్ల గుడ్లలో ఒక గుడ్డు మాత్రమే ఇలా ఉంటుంది, దీని ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు
అతి అరుదైన గుడ్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కోడిగుడ్లు ఏ ఆకారంలో ఉంటాయి? అని అడిగితే అందరూ చెప్పే సమాధానం ఒక్కటే. ఓవెల్ షేప్ అని. ఏ కోడి గుడ్డు అయినా ఓవెల్ షేప్ లోనే కనిపిస్తుంది. కానీ 100 కోట్ల కోడిగుడ్లలో ఒక గుడ్డు మాత్రం పూర్తి గుండ్రంగా ఉంటుంది. అది ఎప్పుడు, ఎక్కడ కనిపిస్తుందో ఎవరికీ తెలియదు. ఏ కోడి నుంచి వస్తుందో కూడా అంచనా వేయడం కష్టం. అనుకోకుండా ఒక జర్నలిస్టుకు సూపర్ మార్కెట్లో గుండ్రంటీ కోడిగుడ్డు కనిపించింది. ఇలాంటి గుడ్డు 100 కోట్లలో ఒకటే ఉంటుందని తెలుసుకొని, ఆమె ఆశ్చర్యపోయింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అంతే ప్రపంచం మొత్తం వైరల్ అయింది ఈ గుడ్డు. సాధారణంగా గుడ్డు ఖరీదు ఆరు రూపాయలు నుంచి 7 రూపాయలు ఉంటుంది. కానీ పూర్తి గుండ్రంగా ఉన్న ఈ గుడ్డు ఖరీదు మాత్రం 78 వేల రూపాయలు. ఇది వెంటనే అమ్ముడుపోయింది. ఈ గుడ్డును ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌లో ఉన్న సూపర్ మార్కెట్లో కనుగొన్నారు.
ఇన్ స్టాగ్రామ్‌లో పెట్టిన ఈ పోస్టుకు మంచి స్పందన వచ్చింది. నెటిజెన్లంతా అనేక రకాలుగా కామెంట్లు చేశారు. 78,000 పెట్టి గుడ్డు కొనడం అవసరమా అని కొంతమంది కామెంట్ చేస్తే ఇలాంటి గుడ్డు కోసం తాము వెతుకుతామంటూ మరికొందరు కామెంట్లు పెట్టారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే గుడ్డు ఆకారం దాని పోషక విలువలను నిర్ణయించదు. గుడ్డు ఓవెల్ షేప్‌లో ఉన్నా, గుండ్రంగా ఉన్నా ఒకేలాంటి పోషక విలువలను కలిగి ఉంటుంది. గుడ్డు ఆకారానికి లోపల ఉన్న పోషక విలువలకి ఎలాంటి అనుబంధం లేదు.
కొందరికి కొన్ని అనుమానాలు ఉంటాయి. బ్రౌన్ కలర్లో ఉన్న గుడ్లు ఆరోగ్యకరమా లేక తెల్లగా ఉన్న గుడ్లు ఆరోగ్యకరమా అని ఎంతో మందికి సందేహం ఉంది. ఏ గుడ్లు అయినా తినడం వల్ల శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాలు అందుతాయి. గుడ్డు పెంకుల రంగుతో, పోషకాలకు సంబంధించిన లేదని ముందే చెప్పుకున్నాం. అయితే గుడ్డులోని ఉన్న పచ్చ సోన రంగు మాత్రం పోషకాహార విలువలను నిర్ణయిస్తుంది. ముదురు రంగులో ఉంటే దానిలో ఎక్కువ పోషక విలువలు ఉంటాయని అర్థం.
ఒక ఫారమ్ కోడి తన జీవితకాలంలో 300 వరకు గుడ్లను పెడుతుంది. అంటే ఒక నెలలో 25 నుంచి 26 వరకు గుడ్లు పెట్టే అవకాశం ఉంది. ఇక నాటు కోళ్ల సంగతికి వస్తే అవి సంవత్సరానికి 150 నుంచి 200 గుడ్లు పెడతాయి. పౌల్ట్రీ ఫామ్ లో ఉండే కోళ్లకు పెట్టే ఆహారాన్ని బట్టి అవి గుడ్లు పెట్టే సంఖ్య ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు 330 వరకు గుడ్లు పెట్టే అవకాశం ఉంది.
[insta]
View this post on Instagram
Also read: కచ్చితంగా తినాల్సిన పండ్లలో సీతాఫలాలు ఒకటి , ఈ పండ్లతో క్యాన్సర్‌ను అడ్డుకోవచ్చు