అన్వేషించండి

Corona Virus: ఒమిక్రాన్ BF7 - కోవిడ్ వచ్చినవారికి మళ్లీ సోకుతుందా? మాస్క్ పెట్టుకోవల్సిందే!

కరోనా వైరస్ మరో కొత్త వేరియంట్‌తో ప్రపంచ దేశాలని భయపెడుతోంది. ఇండియాలో కూడా కొత్త వేరియంట్ కేసులు వెలుగులోకి వచ్చాయి.

కరోనా కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలని వణికిస్తోంది. చైనాలో కోవిడ్ కోరల్లో చిక్కుకుని విలవిల్లాడిపోతుంది. హాస్పిటల్స్ లో ఎటు చూసినా కోవిడ్ పేషెంట్స్ తో కిక్కిరిసిపోతుంది. ఆ దేశ పరిస్థితి చూసి ఇతర దేశాలు గడగడలాడిపోతున్నాయి. భారత్ లోనూ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ BF.7 కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పరిస్థితి తీవ్రమవకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుత పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షత ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. చైనాలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ విజృంభించడంతో మృతుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది.

భారత్ లో ఒమిక్రాన్ BF.7 కేసులు

చైనాలో ఒమిక్రాన్ కేసులతో పాటు భారత్ లోనూ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదయినట్లు అధికారులు ప్రకటించారు. BF.7 అనేది ఒమిక్రాన్ వేరియంట్ BA.5 ఉప వేరియంట్. ఇప్పటి వరకు ఉన్న నివేదికల ప్రకారం గుజరాత్ లో రెండు, ఒడిసాలో రెండు కేసులు నమోదయ్యాయి.

ఒమిక్రాన్ BF.7 లక్షణాలు

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం కొత్త వేరియంట్ లోని లక్షణాలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్‌ను పోలి ఉంటుంది.

⦿ జ్వరం

⦿ గొంతు మంట

⦿ ముక్కు కారడం

⦿ దగ్గు

⦿ జలుబు, ఫ్లూ

⦿ కొన్ని సందర్భాల్లో కడుపు నొప్పి

⦿ అతిసారం

భారత్ లో ఇప్పటి వరకు ఎక్కువ కేసులు నమోదు కాకపోయినప్పటికి కొత్త ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చాలా వేగంగా ఉండి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇప్పటికే కోవిడ్ సోకిన వారికి వచ్చే అవకాశం ఉంది. అలాగే టీకాలు వేసిన వ్యక్తులకి కూడా సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. సెల్ హోస్ట్ అండ్ మైక్రోబ్ జర్నల్  ప్రచురించిన అధ్యయనం ప్రకారం కోవిడ్ 19 వైరస్ కంటే BF.7 వేరియంట్ 4.4 రెట్లు ఎక్కువ శక్తివంతంగా ఉందని వెల్లడించింది.

కొత్త వేరియంట్ ని అడ్డుకునేందుకు మునుపటి కంటే ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీని RO విలువ 10-18.6 వరకు ఉంది. అంటే వైరస్ సోకిన వ్యక్తి తనతో పాటు 10-18.6 మంది దీని బారిన పడే ప్రమాదం ఉంది. ఇన్ఫెక్షన్ రేటు వేగంగా ఉంది. ఇది RT-PCR పరీక్షలలో గుర్తించడం కష్టంగా ఉందని నిపుణులు పేర్కొన్నారు. టీకాలు వేసుకొని, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్న వాళ్ళు ఈ ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

☀ వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం

☀ బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి

☀ ఇన్ఫెక్షన్స్ రాకుండా చేతులు కడుక్కోవాలి

☀ రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు సమతుల్య ఆహారం తీసుకోవాలి

☀ టీకా, బూస్టర్ డోస్ లు వేయించుకోవాలి

☀ శానిటైజర్లు వాడాలి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు

Also Read: ఈ కరోనా కాలంలో రోగనిరోధక శక్తి పెంచే పవర్ ఫుల్ డికాషన్ ఇదే, ఇలా తయారు చేయండి

టాప్ హెడ్ లైన్స్

Dussehra Navratri Day 7 : అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
Dussehra Navratri Day6 : అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
White Chicken : నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
Beer vs Breezer : బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget