Covid-19: భారత్‌లో విస్తరిస్తున్న JN.1 వేరియంట్ తీవ్రమైనదా? నిపుణులు ఏం చెప్తున్నారంటే..
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరిశోధన విభాగం కార్యదర్శి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, DGHS, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఇతరులతో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి సమీక్షించారు.

No Sign Of More Transmissible Variant of Covid 19 In India | దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. పరిశోధన విభాగం (DHR) కార్యదర్శి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), DGHS, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) ఇతర శాఖల అధికారులతో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ఆదివారం సమీక్షించారు. ముఖ్యంగా JN.1 వేరియంట్ రకం కేసులు బయటపడుతున్న నేపథ్యంలో.. వేరియంట్ తీవ్రత, పరిణామాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై చర్చించారు.
రళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, దిల్లీలో కొవిడ్-19 కేసులు భారీగా నమోదవుతున్న విషయం తెలిసిందే. సింగపూర్, హాంకాంగ్ ఇతర దేశాల్లో కొవిడ్ 19 కేసులు భారీగా బయటపడుతున్నాయి. ఆయా దేశాల్లో గతంలో ప్రబలిన వేరియంట్లతో పోలిస్తే ప్రస్తుతం కోసుకున్న వేరియంట్ల తీవ్రత, వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు ఇప్పటికే పలు నివేదికలు వచ్చాయి. ఈ వేరియంట్ల తీవ్రత అధికంగా ఉంటాయని పేర్కొన్నాయి.
తేలికపాటి లక్షణాలు మాత్రమే..
ఈ నేపథ్యంలోనే భారత్‌లో విస్తరిస్తున్న JN.1 వేరియంట్‌పై అధికారులు రివ్యూ నిర్వహించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాల ప్రకారం.. JN.1 వేరియంట్‌తో ముడిపడి ఉన్న COVID-19 కేసుల గురించి భయపడవద్దని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ వైరస్ తీవ్రమైనది కాదని, సోకిన చాలా మంది రోగుల్లో తేలికపాటి లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఢిల్లీలో ఇటీవల వచ్చిన 23 మంది కొవిడ్-19 రోగులందరూ తేలికపాటి లక్షణాలు మాత్రమే కలిగి ఉన్నారని, వారంతా తమ తమ ఇండ్లలోనే క్వారంటైన్లో ఉన్నారని, ఎవరికీ ఆసుపత్రి అవసరం లేదని న్నట్లు స్పష్టం చేశారు. జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, నీరసం, తలనొప్పితో బాధపడుతూ బాధితులు నాలుగు రోజుల లోపు కోలుకుంటున్నారని పేర్కొన్నారు.
కొవిడ్-19, సహా శ్వాసకోశ వ్యాధుల పర్యవేక్షణకు బలమైన వ్యవస్థ
ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP), ICMR పాన్-ఇండియా రెస్పిరేటరీ వైరస్ సెంటినెల్ సర్వైలెన్స్ నెట్‌వర్క్ ద్వారా కొవిడ్-19, సహా శ్వాసకోశ వ్యాధుల పర్యవేక్షణ కోసం దేశంలో బలమైన వ్యవస్థ ఉందని అధికర వర్గాలు తెలిపాయి. నమోదవుతున్న చాలా కేసుల్లో తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని, బాధితులంతా గృహ సంరక్షణలో ఉన్నట్లు పేర్కొన్నాయి. ‘కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తంగా ఉంది. బహుళ ఏజెన్సీల ద్వారా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది’ అని అధికార వర్గాలు తెలిపాయి.
బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, టెస్టింగ్ కిట్ల ఏర్పాట్లు
శనివారం దిల్లీలో 23 మందికి వైరస్ సోకింది. ఈ నేపథ్యంలోనే అక్కడి ప్రభుత్వం ఆస్పత్రులకు పలు చూచనలు చేసింది. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అనేక ఆసుపత్రులు బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, టెస్టింగ్ కిట్స్, యాంటీబయాటిక్స్, ఇతర ముఖ్యమైన మందులు, BiPAP (బైలెవెల్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెజర్) యంత్రాలు, టీకాలు, వెంటిలేటర్లు, అదనపు ఐసోలేషన్ పడకలను ఏర్పాటు చేసుకునేందుకు సన్నాహాలు ప్రారంభించాయి.





















