Blood Sugar Hacks : మధుమేహమున్నవారు అన్నాన్ని అలా తింటే బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ పెరగవట.. న్యూ స్టడీలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే
Prevent Blood Sugar Spikes : డయాబెటిస్ ఉన్నవారు వండిన వెంటనే అన్నం తినడం కన్నా.. చద్దన్నం తింటే ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయంటున్నారు. న్యూ స్టడీలో తేలిన కొత్త విషయాలేంటో ఇప్పుడు చూసేద్దాం.
Benefits of Leftover Rice for Diabetics : మధుమేహంతో ఇబ్బంది పడేవారిని సాధారణంగా వైట్ రైస్ తినొద్దని చెప్తారు డాక్టర్లు. అలాగే బ్రౌన్ రైస్, క్వినోవా, మిల్లెట్స్‌ను అన్నంతో రిప్లేస్ చేయమంటారు. అప్పటివరకు అన్నానికి అలవాటు పడిన ప్రాణం ఒక్కసారిగా వీటికి మారాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కానీ డాక్టర్లు అన్నం తినొద్దని చెప్పడానికి కూడా కారణాలు లేకపోలేదు. అయితే ఇప్పటినుంచి ఆ సమస్య ఉండదు. డయాబెటిస్ ఉన్నవారు కూడా హాయిగా అన్నం తినొచ్చట. కానీ ఆ ఒక్కటి కచ్చితంగా చేయాలి.
మీ డయాబెటిస్ డైట్లో రైస్ చేర్చుకోవాలంటే మీరు ఓ పని చేయాలి. అదేంటంటే.. అన్నాన్ని వండుకోవాలి. దానిని చల్లారనివ్వాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టి.. తర్వాత రోజు దానిని తినాలి. ఇలా ఎందుకు చేయాలి? ఇలా చేయడం వల్ల కలిగే లాభమేంటి? న్యూ స్టడీ ఏమి చెప్పింది? నిపుణులు ఇచ్చే సూచనలు ఏంటి? షుగర్ కంట్రోల్ అవుతుందా? ఇబ్బంది పెడుతుందా వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బియ్యంలో, బంగాళాదుంపల్లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి షుగర్‌ని స్పైక్ చేస్తాయి. అందుకే మధుమేహమున్నవారిని వీటికి వీలైనంత దూరంగా ఉండాలని సూచిస్తారు. కానీ.. వీటిని చల్లార్చి తినడం వల్ల రక్తంలో షుగర్ కంట్రోల్ అవుతుందని పరిశోధనలు తెలిపాయి. ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల గ్లైసామిక్ ఇండెక్స్ తగ్గి.. షుగర్‌ని అదుపులో ఉంచుతుందని చెప్తున్నారు.
ఫ్రిడ్జ్‌లో ఎంతసేపు ఉంచాలంటే..
అన్నం వండిన తర్వాత 24 గంటలు ఫ్రిడ్జ్‌లో ఉంచి.. మళ్లీ వేడి చేసి తినాలట. ఇలా చేయడం వల్ల అన్నంలోని గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుందని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. స్టార్చ్ రెట్రోగ్రేడేషన్ అని ప్రక్రియ ద్వారా.. జీర్ణమయ్య పిండిపదార్థాన్ని రెసిస్టెంట్ స్టార్చ్‌గా మారుస్తుందని నిపుణులు గుర్తించారు. ఇలా మారిన అన్నాన్ని తినడం వల్ల శరీరంలో జీర్ణమయ్యే పిండి పదార్థం.. శరీరంలోని షుగర్‌ను స్పైక్ చేయలేదు. ఫ్రిడ్జ్‌లో ఉంచిన అన్నాన్ని వేడి చేసుకుని తినడం వల్లనే షుగర్ స్పైక్ కాలేదని గుర్తించారు. అలాగే ప్రోబయోటిక్‌గా కూడా పని చేస్తుంది. దీనివల్ల గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నారు.
వేడిగా కూడా తినొచ్చు..
కొందరు పోషకాహార నిపుణులు ఈ ప్రక్రియను ట్రై చేసి.. యూట్యూబ్‌లో, ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తున్నారు. అన్నం వండిన వెంటనే తిన్నప్పుడు శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు ఎలా ఉన్నాయో టెస్ట్ చేశారు. అలాగే ఫ్రిడ్జ్‌లో పెట్టిన అన్నం తిన్నప్పుడు ఎలా ఉందో వీడియోల్లో చూపిస్తున్నారు. వాటిలో కూడా ఫ్రిడ్జ్‌లో ఉంచి తీసిన అన్నం తిన్నప్పుడు శరీరంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నట్లు రిజల్ట్స్ వచ్చాయి. దీంతో ఈ ప్రక్రియకు మద్దతు బాగా లభిస్తుంది. మీకు డయాబెటిస్ ఉండి.. మీకు అన్నం తినడం ఇష్టమైతే.. ఈ ప్రక్రియలో తింటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
Also Read : యువతలో హార్ట్ ఎటాక్ రావడానికి ప్రధాన కారణాలు ఇవే.. వీలైనంత త్వరగా ఆ మార్పులు చేయాలట, లేకుంటే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.