Natural Detox Tips : శరీరాన్ని సహజంగా డిటాక్స్ చేసే టిప్స్ ఇవే.. ఫుడ్ నుంచి నిద్ర వరకు వీటిని ఫాలో అయిపోండి
Home Remedies for Detox : శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపి.. పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలనుకుంటున్నారా? అయితే సహజంగా శరీరాన్ని డీటాక్స్ చేసేందుకు ఈ టిప్స్ ఫాలో అయిపోండి.

Natural Body Cleansing : శరీరాన్ని డీటాక్స్ చేయడమనేది పూర్తి ఆరోగ్యానికి మద్ధతునిస్తుంది. శరీరంలో టాక్సిన్లు ఎక్కువగా పేరుకుంటే అవి ఆరోగ్యానికి నష్టం కలిగిస్తాయి. అవయవాలను దెబ్బతీసి.. పూర్తి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాలు చూపిస్తాయి. అందుకే డీటాక్స్ అనేది పూర్తి ఆరోగ్యానికి చాలా అవసరమని చెప్తున్నారు నిపుణులు. అయితే సహజంగా శరీరాన్ని డీటాక్స్ చేయాలనుకుంటే ఎలా టిప్స్ ఫాలో అవ్వాలో.. వాటి వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
హైడ్రేషన్
శరీరంలోని టాక్సిన్లను బయటకి పంపేందుకు హైడ్రేషన్ చాలా హెల్ప్ చేస్తుంది. ఇది కిడ్నీ హెల్త్‌ని ప్రమోట్ చేస్తుంది. జీర్ణ సమస్యలను కూడా దూరం చేస్తుంది. శరీరాన్ని రిఫ్రెష్ చేసి పొడి బారడం తగ్గించి.. అందానికి, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాబట్టి రోజుకు కనీసం 7 నుంచి 8 గ్లాసుల నీటిని తాగండి.
నిద్ర
మీకు తెలుసా? నిద్ర కూడా శరీరాన్ని డిటాక్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. శరీరానికి విశ్రాంతిని అందించి.. కణాలను రిపైర్ చేస్తుంది. ఈ ప్రక్రియలో శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపడంలో హెల్ప్ చేస్తుంది. మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
యాంటీఆక్సిడెంట్లు
శరీరానికి యాంటీఆక్సిడెంట్లు నిండుగా ఉండే ఫుడ్‌ని అందిస్తే.. ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడడమే కాకుండా సహజంగా శరీరాన్ని డిటాక్స్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. ఆకుపచ్చని కూరలు, బెర్రీలు, నట్స్ వంటి వాటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. టాక్సిన్లను బయటకు పంపి పూర్తి ఆరోగ్యానికి మద్ధతునిస్తాయి.
ప్రోబయోటిక్స్
కేవలం గట్ హెల్త్‌ని మెరుగుపరచడానికే కాదు.. జీర్ణ సమస్యలను దూరం చేసి శరీరాన్ని డిటాక్స్ చేయడంలో కూడా ప్రోబయోటిక్స్ హెల్ప్ చేస్తాయి. శరీరం నుంచి సహజంగా టాక్సిన్లను బయటకు పంపిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచి.. పూర్తి ఆరోగ్యానికి మద్ధతునిస్తాయి.
యాక్టివిటీ
కదలకుండా అలాగే కంప్యూటర్ల ముందు కూర్చుంటే అన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఫిజికల్‌గా ఎంత యాక్టివ్‌గా ఉంటే ఆరోగ్యానికి అంతమంచిది. శరీరంలో రక్త ప్రసరణ పెరిగి.. సహజంగా డిటాక్స్ ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్‌గా వ్యాయామం చేయడాలు.. డెస్క్ జాబ్ చేస్తుంటే కనీసం పది నిమిషాలకోసారి లేచి తిరగడం వంటివి చేస్తూ యాక్టివ్‌గా ఉండాలి. ఇది దీర్ఘకాలిక సమస్యలను కూడా దూరం చేస్తుంది.
నిమ్మరసంతో..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో కాస్త నిమ్మరసం పిండుకొని తాగితే మంచిది. ఇది సహజంగా శరీరాన్ని డీటాక్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. మలాసనంలో కూర్చొని తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. దీనిలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
రిలాక్స్ టెక్నిక్స్..
శరీరాన్ని రిలాక్స్ చేసేందుకు డీప్ బ్రీతింగ్, యోగా, మెడిటేషన్ వంటివి చేయొచ్చు. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. మానసికంగా, శారీరకంగా డీటాక్స్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
వాటికి దూరంగా ఉండాలి..
ఆల్కహాల్‌ని ఎక్కువగా తీసుకుంటే శరీరంలో టాక్సిన్లు పెరుగుతాయి. లివర్ ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునేందుకు ఆల్కహాల్‌ను తీసుకోవడం తగ్గించాలి. స్వీట్స్, ప్రాసెసింగ్ చేసిన ఫుడ్స్ కూడా టాక్సిన్లను పెంచుతాయి. కాబట్టి వీటికి కూడా దూరంగా ఉంటే మంచిది.






















