అన్వేషించండి

MS Dhoni Fitness Secrets : ధోని ఫిట్​నెస్​ సీక్రెట్స్ ఇవే.. సింగిల్​ హ్యాండ్​తో సిక్స్​ కొట్టడం అందుకే సాధ్యమైంది

MS Dhoni Diet Secrets : నలభైల్లో ఒంటి చేత్తో సిక్సర్​ కొట్టి తన అభిమానులనే కాదు.. యావత్తు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు ధోని. ఈ వయసులో కూడా అంతటి ఫిట్​నెస్​ ధోనికి ఎలా సాధ్యమైంది?

MS Dhoni Fitness at the age of 42 : సీఎస్కే(CSK) ఓడిపోయినా ఏ అభిమాని బాధపడలేదంటే దానికి కారణం ధోని(MS Dhoni) ఆటనే. ఎంతకాలంగానో ధోని బ్యాటింగ్ చూడాలన్నా కోరికతో ఎదురుచూస్తున్న అభిమానులకు తల మంచి ఐ ఫీస్ట్​ ఇచ్చాడు.  ఓ నాలుగు ఫోర్లు.. మూడు సిక్సర్లతో స్టేడియాన్ని దద్దరిల్లేలా చేశాడు. తన ఫిట్​నెస్​ మీద తనకి కాస్త డౌట్​ ఉన్నా.. ఫ్యాన్స్​ కోసమే నెక్స్ట్ ఐపీఎల్ ఆడతానని మాట ఇచ్చి.. ఆ మాటను నిలబెట్టుకున్నాడు తల. ఐపీఎల్(IPL 2024) మొదలయ్యాక రెండు మ్యాచ్​లు ఆడినా.. ధోని బ్యాటింగ్ దర్శనం మాత్రం కనిపించలేదు. కానీ వైజాగ్​లో జరిగిన మ్యాచ్​లో వింటేజ్ ధోనిని చూసే భాగ్యం దక్కిందని.. ప్రతి అభిమాని ఎమోషనల్ అయ్యాడు. 

ధోని ఫిట్​నెస్ సీక్రెట్స్

క్రికెటర్స్ అందరూ ఫిట్​గానే ఉంటారు కదా.. దానిలో ధోని ప్రత్యేకత ఏముంది? అనుకుంటున్నారేమో.. నలభైల్లో కూడా వికెట్ కీపర్​గా చేస్తూ.. తన బ్యాటింగ్ పవర్ చూపిస్తున్నాడు ధోని. కీపింగ్ చేస్తున్నప్పుడు స్క్వాట్ పొజిషన్​లో గంటల కొద్ది సమయం ఉండాల్సి ఉంటుంది. అది చూసినంత సులభమైతే కాదు. ముఖ్యంగా నిన్న జరిగిన మ్యాచ్​లో సింగిల్​ హ్యాండ్​తో కొట్టిన సిక్స్​ని చూస్తే ధోని ఫిట్​నెస్ ఏ స్థాయి​లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ రేంజ్​ ఫిట్​నెస్​ కోసం ధోని ఎలాంటి ఫుడ్ తీసుకుంటాడు? ఎలాంటి వర్క్​ అవుట్ చేస్తాడు? ఎలాంటి రోటీన్​ ఫాలో అవుతాడు అనే విషయాలపై మనమూ ఓ లుక్కేద్దాం.

ఇంటి భోజనమే మొదటి ప్రాధన్యత.. 

ధోని ఎక్కువగా ఇంటి ఫుడ్ తినడానికి ఇష్టపడతాడు. కార్బ్స్, ఫ్యాట్​ కలిగిన ఆహారాలు ఎక్కువ తీసుకోకుండా.. పోషకాహారంతో నిండిన భోజనం చేస్తాడు. సమతుల్యమైన ఆహారం తీసుకుంటూ ఉంటాడు. రోటీన్​ డైట్​ని మాత్రమే ఫాలో అవ్వకుండా.. హెల్తీగా ఉంటూనే.. ఆహారపు అలవాట్లు మారుస్తూ ఉంటాడు. ధోని క్రికెట్ ఆడడం ప్రారంభించిన మొదట్లో బటర్ చికెన్, నాన్, మిల్క్​షేక్స్, చాక్లెట్లు ఎక్కువగా తీసుకునేవాడు. కానీ క్రమంగా వాటిని తీసుకోవడం తగ్గించి.. హెల్తీ ఫుడ్ తీసుకోవడంపై దృష్టి పెట్టినట్లు ధోని ఓ సందర్భంలో తెలిపాడు. 

పాలు అంటే అమితమైన ఇష్టం

ధోనికి కేక్స్​ అంటే చాలా ఇష్టం. ఏ సందర్భంలోనైనా ధోనిని కేక్​ని తింటూ దానిపై ప్రేమను చాటుకుంటాడు. కానీ అది కూడా లిమిట్​గానే. ధోని డైట్​ గురించి మాట్లాడితే దానిలో పాలు కచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ధోనికి పాలు అంటే చాలా ఇష్టం. కొందరు ఫిట్​నెస్​ పేరుతో పాలకు దూరంగా ఉంటారు. కానీ ధోని దానికి భిన్నం. ఇదే కాకుండా హైడ్రేటెడ్​గా ఉండేందుకు ఎనర్జీ డ్రింక్స్, ప్రోటీన్ షేక్స్, నీరు తాగుతూ ఉంటాడు. హైడ్రేషన్ అనేది ఎక్కువ కాలం యాక్టివ్​గా ఉండడంలో హెల్ప్ చేస్తుంది. 

జిమ్ పర్సన్ కానే కాదు..

42 ఏళల్లో ఉన్న ధోని శరీరాకృతిని చూసి అసూయపడే వారు.. అడ్మైర్ అయ్యేవారు చాలామందే ఉన్నారు. ఇదేదో జిమ్​కి వెళ్లిపోయి సాధించిన ఫిట్​నెస్ అయితే కాదు. జిమ్​కి వెళ్లి కసరత్తులు చేయడంపై ధోని గతంలో ఓ కామెంట్ చేశాడు. తను జిమ్​ పర్సన్​ కాదని.. గేమ్​ కోసం చేసే ట్రైనింగ్ తనకు బాగా హెల్ప్ అవుతుందని తెలిపాడు. రెగ్యూలర్​గా వ్యాయమం చేస్తూ.. స్టామినా, ఫుట్​వర్క్​ను బలోపేతం చేసే వ్యాయామాలు తనని ఫిట్​గా ఉంచుతాయని తెలిపాడు. కేవలం క్రికెట్​ మాత్రమే కాకుండా ధోని ఫుట్​ బాల్, గోల్ఫ్ కూడా ఆడుతూ ఉంటాడు. ఈ అలవాట్లే తనని ఇప్పటికీ ఫిట్​గా ఉండడంలో హెల్ప్ చేస్తున్నాయి.

మైండ్​ ప్రశాంతంగా ఉండాలి..

మంచి ఆహారం, వ్యాయామం కాకుండా.. ధోని తన మైండ్​ని చాలా కామ్​గా ఉంచుకుంటాడు. ఈ క్వాలిటీనే ఆయనను అభిమానులకు దగ్గర చేసింది. ఏ పరిస్థితిలోనైనా తన కూల్​నెస్​ని పోగొట్టుకోకుండా.. ప్రశాంతంగా ఉండేలా చూసుకుంటాడు. రాత్రుళ్లు 7 నుంచి 8 గంటలు కచ్చితంగా నిద్ర ఉండేలా చూసుకుంటాడు. పైగా ధోని సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటాడు. ఇది తన మైండ్​ని నెగిటివ్​ ఆలోచనల వైపు వెళ్లకుండా చేస్తుందంటూ.. అతి పెద్ద సీక్రెట్ రివిల్ చేశాడు. ఫిట్​నెస్​ అంటే కేవలం ఫుడ్​, వ్యాయామం, గేమ్ మాత్రమే కాదు.. మానసికంగా కూడా ఆరోగ్యంగా, ప్రశాతంగా ఉండాలి అంటున్నాడు ధోని. 

Also Read : ఐపీఎల్ సీజన్ 2024 స్టార్ట్ అవుతోంది.. ఇలా బెట్టింగ్ వేస్తే మోసపోతారు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MohanBabu Attacks Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
MohanBabu Attacks Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Sana Sathish: చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mohan babu Audio on Manchu Manoj | నా గుండెల మీద తన్నావ్ రా మనోజ్ | ABP DesamMohan babu Attack Media | మీడియా ప్రతినిధిని దారుణంగా కొట్టిన మోహన్ బాబు | ABP DesamManchu Mohan babu Attack | కొడుకును, మీడియాను తరిమి కొట్టిన మోహన్ బాబు | ABP Desamముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MohanBabu Attacks Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
MohanBabu Attacks Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Sana Sathish: చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
RCB News: డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
Gautham Krishna - Bigg Boss Telugu: సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
Pushpa 2: ఇండియా అంతటా పూనకాలే... కానీ కేరళలో మాత్రం ఎందుకిలా? 'పుష్ప 2' విషయంలో మల్లు అభిమానం ఏమైంది?
ఇండియా అంతటా పూనకాలే... కానీ కేరళలో మాత్రం ఎందుకిలా? 'పుష్ప 2' విషయంలో మల్లు అభిమానం ఏమైంది?
Embed widget