Mother's Day Wishes 2024 : మదర్స్ డే స్పెషల్ విషెష్.. వాట్సాప్, ఫేస్‌బుక్‌ల్లో ఈ సందేశాలు పంపి మీ ప్రేమను చెప్పేయండి
Mothers Day 2024 : మదర్స్ డే రోజు మీరు చదువు రీత్యా, ఉద్యోగ రీత్యా అమ్మకి దూరంగా ఉన్నారనుకోండి వారికి మంచి లెటర్ లేదా.. వాట్సాప్‌లో సందేశం రాయొచ్చు. అవి అమ్మలకు ఎనలేని సంతోషాలను ఇస్తాయి.
Mothers Day Wishes : తల్లి లేనిదే మనుగడ లేదు. అమ్మ ప్రేమను వివరించగలిగే పదాలు కూడా లేవు. ఆమె ప్రేమను కొలత వేయడానికి జన్మలు సరిపోవు. ప్రపంచంలో మనల్ని ఎవరైనా నిస్వార్థంగా ప్రేమిస్తున్నారు అంటే అది అమ్మ మాత్రమే. అంతటి ప్రేమను ఎవరూ మరొకరి నుంచి పొందలేరు. అలాంటి అమ్మ ప్రేమను సెలబ్రేట్ చేస్తూ.. ఏటా మే నెలలో మదర్స్ డే (Mothers Day 2024) నిర్వహిస్తున్నారు. ఈ స్పెషల్ డేని ప్రతి సంవత్సరం మే రెండవ ఆదివారం రోజు జరుపుకుంటారు. ఈ ఏడాది మే 12వ తేదీన మదర్స్ డే వచ్చింది. ఈ సందర్భంగా మీరు మీ అమ్మకి ప్రత్యేకమైన విషెష్ చెప్పవచ్చు.
ఉద్యోగం వల్లనో.. ఏ ఇతరత్రా కారణాలవల్లనే చాలామంది ఇంటికి దూరంగా ఉంటారు. అలాంటి వారు మదర్స్ డేరోజు అమ్మ పక్కనే ఉండలేకపోవచ్చు. కానీ అమ్మకి ఓ మంచి బహుమతిని కొని పార్సిల్ చేయవచ్చు. లేదంటే ప్రేమతో ఓ మెసెజ్ పంపినా.. అమ్మ ఫుల్ ఖుషి అయిపోతుంది. మేసెజ్‌లు పంపినా.. అమ్మ చదవలేదు అనుకుంటే కొన్ని సందేశాలను వాయిస్ నోట్స్ రూపంలో పంపించండి. ఆ సందేశాలలో మీరు అమ్మని ఎంతగా ప్రేమిస్తున్నారో.. ఆమె మీ జీవితంలో ఎంత విలువైనదో చెప్పేలా చూసుకోండి. వాట్సాప్‌లలో అమ్మకి ఎలాంటి మెసేజ్ చేయాలో చూసేసి.. వాటిని మీ అమ్మకి పంపి.. విషెష్ చెప్పండి.
- అమ్మ నీ నిస్వార్థమైన ప్రేమ.. నువ్వు నాకోసం చేసిన త్యాగాలను.. నాకు నువ్వు ఇచ్చిన మద్ధతును నా ప్రాణమున్నంత వరకు మరువలేను అమ్మ. లవ్ యూ అమ్మ.
- నీవంటూ లేకుంటే.. నేనంటూ ఉండే వాడిని/దానిని కాదు అమ్మ. నన్ను నువ్వు అర్థం చేసుకున్నంతగా ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేదు. చేసుకోలేరు. హ్యాపీ మదర్స్ డే అమ్మ.
- ఎన్ని కష్టాలున్నా.. నీ ఒళ్లో తలవాల్చి పడుకుంటే చాలు అమ్మ.. బాధ అంతటి చిటికెలో మాయం చేసేస్తావు. పెద్ద జాదువి అమ్మ నువ్వు. లవ్ యూ.
- స్వచ్ఛమైన ప్రేమను నేను ఇతరుల్లో వెతికాను కానీ.. నీలాంటి స్వచ్ఛమైన ప్రేమ నాకు ఎక్కడా దొరకలేదు అమ్మ. హ్యాపీ మదర్స్ డే.
- జీవితంలో నన్ను ఎవరు నమ్మినా.. నమ్మకపోయినా.. నువ్వు ఒక్కదానివే నాకు సపోర్ట్ ఇచ్చి.. ముందుకు నడిపించావు. నీ ప్రేమే లేకుంటే ఈరోజు నేను ఇంత దూరం రాకపోయేదానిని అమ్మ. నన్ను ముందుకు నడిపించినందుకు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. నువ్వే నా ప్రాణం అమ్మ.
- బయట అంతా కండీషన్స్‌తో కూడిన లవ్ మాత్రమే ఉంది అమ్మ. ఏ కండీషన్ లేకుండా.. నన్ను ప్రేమతో కట్టిపడేసింది నువ్వు మాత్రమే అమ్మ. హ్యాపీ మదర్స్ డే.
- హ్యాపీ మదర్స్ డే అమ్మ. నీ ప్రేమ, నీ మార్గదర్శకత్వం, మద్దతు నా జీవితంలోని ప్రతి మలుపులోని తోడుగా నిలిచాయి.
- ప్రపంచంలోనే అందరి కంటే బెస్ట్ మామ్‌కి హ్యాపీ మదర్స్ డే. నువ్వు చేసిన త్యాగాలు నేను ఎప్పటికీ మరచిపోలేను మా.
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ సందేశాలతో మీ అమ్మకి విషెష్ చెప్పేయండి.
Also Read : మదర్స్ డే 2024లో ఏ రోజు వచ్చిందో తెలుసా? ఈ స్పెషల్ డేని మనం సెలబ్రేట్ చేసుకోవచ్చా?