అన్వేషించండి

Morning Habits : ఉదయాన్నే అలసటగా ఉంటుందా? కాఫీ, టీ లేకుండా మిమ్మల్ని ఎనర్జీటిక్​గా మార్చే 5 సింపుల్ అలవాట్లు ఇవే

Healthy Morning Routine : నిద్ర లేవగానే అలసటగా ఉందని టీ, కాఫీలు తాగుతున్నారా? అయితే ఇది కచ్చితంగా మీకోసమే. మార్నింగ్​ని ఎనర్జిటిక్​గా స్టార్ట్ చేసేందుకు ఈ 5 చిట్కాలు ట్రై చేయండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఉదయం నిద్రలేవగానే సహజ కాంతికి శరీరాన్ని బహిర్గతం చేయండి.
  • తేలికపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు, ఒక గ్లాసు నీరు తాగండి.
  • కొన్ని నిమిషాల డీప్ బ్రీతింగ్ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.
  • అల్పాహారంలో ప్రోటీన్, పోషకాలు రోజంతా శక్తిని అందిస్తాయి.

Morning Energy Tips : రాత్రి 8 నుంచి 9 గంటలు నిద్రపోయినా.. ఉదయం నిద్రలేవగానే అలసటగా, బద్ధకంగా అనిపిస్తుందా? ఈ అలసటను వదిలించుకోవడానికి కళ్లు తెరిచిన వెంటనే టీ లేదా కాఫీ తాగేస్తున్నారా? నిజానికి ఇలా ఎనర్జీ కోసం టీ, కాఫీ తాగేవారు చాలామంది ఉన్నారు. కానీ ఉదయాన్నే కొన్ని చిన్న అలవాట్లు ఫాలో అయితే కాఫీ, టీపై ఆధారపడకుండా రోజును మరింత ఉత్సాహంగా ప్రారంభించుకోవచ్చు. మరి ఆ అలవాట్లు ఏంటో చూసేద్దాం. 

నిద్రలేవగానే బయటకి..

నిద్ర లేవగానే రూమ్​లోనే ఉండకుండా.. కొద్దిసేపు బయటకు వెళ్లి సహజమైన సూర్యరశ్మిలో, ఎండ లేకుండా కాంతిలో ఉండటం మంచిది. ఉదయం వెలుతురు మన శరీరంలోని స్లీప్-వేక్ సైకిల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీంతో మెదడుకు మెలకువ రావడంతో పాటు రోజును మరింత చురుగ్గా ప్రారంభించేందుకు ఉపయోగపడుతుంది.

Also Read : జీవితాన్ని మార్చేసే మార్నింగ్ రొటీన్.. ఉదయాన్నే కేవలం 30 నిమిషాలు కేటాయిస్తే చాలు!

బయటకు వెళ్లడం వీలుకాకపోతే కనీసం కిటికీ దగ్గర నిలబడి కొద్దిసేపు సహజమైన వెలుతురు, గాలిని పొందవచ్చు. ప్రతిరోజూ ఈ అలవాటు పాటించడం వల్ల ఉదయం నిద్రమత్తు తగ్గడంలో మార్పలు మీరే గమనిస్తారు. 

5 నిమిషాలు బాడీ యాక్టివేషన్

నిద్రలో గంటల తరబడి ఒకే విధంగా పడుకోవడం, కదలకపోవడం వల్ల ఉదయం లేవగానే మెడ, భుజాలు, వెన్ను బిగుసుకుపోయినట్లు అనిపించవచ్చు. అందుకే నిద్ర లేవగానే కాస్త స్ట్రెచింగ్ లేదా తేలికపాటి వ్యాయామం చేయండి. చేతులను పైకి చాచడం, మెడను మెల్లగా కదపడం, నడుమును స్ట్రెచ్ చేయడం వంటి సింపుల్ మూవ్‌మెంట్స్ కూడా సరిపోతాయి. శరీరం కదలడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి మరింత యాక్టివ్‌గా ఉన్నట్లు అనిపించవచ్చు.

Also Read : రోజంతా యాక్టివ్​గా, పాజిటివ్​గా ఉండాలా? అయితే ఈ 10 మార్నింగ్ హ్యాబిట్స్ ఫాలో అయిపోండి

గ్లాసు నీరు తాగండి

రాత్రంతా నీరు తాగకుండా ఉండటం వల్ల ఉదయం శరీరానికి ద్రవాలు అవసరమవుతాయి. అందుకే నిద్ర లేవగానే ఒక గ్లాసు నీరు తాగడం మంచి అలవాటు. గోరువెచ్చని నీరు అయితే మరీ మంచిది. దాహం, నోరు పొడిబారడం వంటి సమస్యలు ఉంటే శరీరానికి నీరు అవసరమైందనే సంకేతం కావచ్చు. కాబట్టి ఓ గ్లాసు నీరు తాగండి. హైడ్రేషన్ బాడీని యాక్టివ్​గా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది.

డీప్ బ్రీతింగ్ 

ఉదయం కళ్లు తెరిచిన వెంటనే పని, ఆఫీస్, టెన్షన్ల గురించి ఆలోచించడం మొదలుపెడతారా? ఇలా చేస్తే రోజంతా మానసికంగా అలసిపోయినట్లు అనిపించవచ్చు. దీనికి బదులుగా కొన్ని నిమిషాలు నెమ్మదిగా, లోతుగా శ్వాస తీసుకోవడానికి ప్రయత్నించండి.
నెమ్మదిగా శ్వాస తీసుకుని, కాసేపు ఆపి మెల్లగా వదలడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండవచ్చు. ఉదయం కొద్దిసేపు ఇలా చేయడం వల్ల మెంటల్ ఫాగ్ తగ్గి పనిపై ఏకాగ్రత పెరగవచ్చు.

Also Read : 6-6-6 వాకింగ్ రూల్ అంటే ఇదే.. ఈ రొటీన్ ఫాలో అయితే బరువు తగ్గడంతో పాటు మరెన్నో బెనిఫిట్స్

బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్ 

ఉదయం ఏమీ తినకుండా ఉండటం లేదా కేవలం తీపి పదార్థాలు తినడం వల్ల కొద్దిసేపటికే మళ్లీ ఆకలి, నీరసం రావచ్చు. అందుకే బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్‌తో పాటు ఇతర పోషకాలు ఉండేలా చూసుకోవడం మంచిది. గుడ్లు, పెరుగు, పప్పులు, నట్స్ వంటి ఆహారాలను మీ అవసరాలకు అనుగుణంగా తీసుకోవచ్చు. సమతుల్యమైన అల్పాహారం ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్ ఇచ్చి ఇతర స్నాక్స్ జోలికి వెళ్లకుండా చేస్తుంది. 

టీ, కాఫీ తాగకుండానే..

ఉదయాన్నే ఈ సింపుల్ చిట్కాల ఫాలో అయితే మీరు ఎలాంటి టీ, కాఫీ లేకుండా ఎనర్జీటిక్​గా ఉంటారు. సరైన నిద్ర, ఉదయం సహజమైన వెలుతురు, కొద్దిపాటి స్ట్రెచింగ్, తగినంత నీరు, పోషకమైన ఆహారం మిమ్మల్ని రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. అయితే ఇవి ఫాలో అయినా మీకు అలసటగా ఉంటున్నట్లు అనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుని సంప్రదించాల్సి ఉంటుంది. 

Also Read : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Darker Mehndi Colour : మెహందీ డిజైన్స్ ఎర్రగా పండాలా? అయితే ఫాలో అవ్వాల్సిన సింపుల్ చిట్కాలు, చేయకూడని తప్పులు ఇవే
మెహందీ డిజైన్స్ ఎర్రగా పండాలా? అయితే ఫాలో అవ్వాల్సిన సింపుల్ చిట్కాలు, చేయకూడని తప్పులు ఇవే
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
Besan Ladoo : దీపావళి స్పెషల్ బేసిన్ లడ్డూలు.. మార్కెట్ స్టైల్ రుచితో ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా, రెసిపీ ఇదే
దీపావళి స్పెషల్ బేసిన్ లడ్డూలు.. మార్కెట్ స్టైల్ రుచితో ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా, రెసిపీ ఇదే
Hair Growth Foods : జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే ఇవి తినండి.. కుదుళ్ల నుంచి పోషణ అందుతోందంటోన్న పరిశోధనలు
జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే ఇవి తినండి.. కుదుళ్ల నుంచి పోషణ అందుతోందంటోన్న పరిశోధనలు
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP ZPTC MPTC Elections: నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
Virat Kohli  Storm: అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
Ongole Mayor Result: కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
RTC Conductor Dies: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
Medical College Ragging: కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
Embed widget