News
News
X

Millets: ఆహారాలకే అమ్మలాంటివి చిరుధాన్యాలు - వీటిని మెనూలో చేర్చుకుంటే ఎంత ఆరోగ్యమో

బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చిరుధాన్యాలు తినమని చెప్పారు.

FOLLOW US: 
Share:

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ఆరంభంలోనే  ఆరోగ్య అంశాల గురించి మాట్లాడారు. ప్రజలు ఆరోగ్యం కోసం చిరుధాన్యాలను తినడం ప్రారంభించాలని చెప్పారు. భారతదేశాన్ని చిరుధాన్యాలకు గ్లోబల్ హబ్‌గా మార్చాలనుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం, భారతదేశం అతిపెద్ద చిరుధాన్యాల ఉత్పత్తిదారుగా, రెండవ అతిపెద్ద ఎగుమతిదారుగా ఉంది. చిరుధాన్యాలను ‘శ్రీ అన్న’ అని పిలుస్తారని, అంటే అన్ని ఆహారాలకు తల్లిలాంటివి చిరుధాన్యాలు అని ఆమె వివరించారు. 2023ని ‘ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఇయర్’గా ప్రకటించారు. జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు, అరికెలు, సామలు, ఊదలు... వంటివి చిరుధాన్యాలుగా పిలుస్తారు. వీటిని తినేవారి సంఖ్య తక్కువైపోయింది. పూర్వం వీటిని మాత్రమే తినేవారు. ఎప్పుడైతే బియ్యం వాడకం పెరిగిందో... అప్పట్నించి చిరుధాన్యాలు తినడం మానేశారు ప్రజలు. 

పొట్ట ఆరోగ్యానికి...
చిరుధాన్యాల్లో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి.వీటిలో ఉండే ఫైబర్‌ మిమ్మల్ని ఎక్కువసేపు పొట్ట నిండుగా ఉండేలా చేస్తాయి. జీర్ణక్రియను ఎక్కువ సేపు జరిగేలా చేస్తాయి. కాబట్టి ఆకలి త్వరగా వేయదు. 

మెదడుకు...
వీటిలో ఉండే  పొటాషియం మెదడులోని నరాల సిగ్నల్ ట్రాన్స్‌మిషన్‌ను బలోపేతం చేస్తుంది. కండరాల పనితీరుకు కూడా సాయపడుతుంది. 

బరువు తగ్గేందుకు...
చిరుధాన్యాల్లో విటమిన్ ఎ, విటమిన్ బి, ఫాస్పరస్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు, నియాసిన్, కాల్షియం, ఐరన్, ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ మీ శరీరానికి అవసరమైన పోషకాలు. వీటిని తింటూనే బరువు తగ్గొచ్చు.  ఊబకాయం బారిన పడకుండా చిరు ధాన్యాలు కాపాడతాయి. 

డయాబెటిస్
డయాబెటిక్ రోగులకు ఇవి చిరుధాన్యాలు ఎంతో మేలు చేస్తాయి. ఇవి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. ప్రీ డయాబెటిక్ రోగులకు, డయాబెటిస్ బారిన పడిని వారికి ఇవి ఉత్తమ ఆహారం. రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా చూడడంలో ఇవి ముందుంటాయి. 

ఇవే కాదు ఎన్నో మానసిక రోగాలు రాకుండాను ఇవి అడ్డుకుంటాయి. నరాల బలహీనత, మలబద్ధకం, క్యాన్సర్, మైగ్రేన్, రక్తహీనత వంటి సమస్యలు ఉన్న వారు చిరు ధాన్యాలతో వండిన ఆహారాన్ని రోజూ తింటే ఇవన్నీ దూరమవుతాయి. 

చిరుధాన్యాలతో ఉప్మా, ఇడ్లీలు, చపాతీలు, కిచిడీ, లడ్డూలు, చిక్కీలు,సూప్, కేకులు... ఇలా రకరకాల వంటలు చేసుకోవచ్చు. గోధుమలు, బియ్యం పక్కన పెట్టి పూర్తి చిరుధాన్యాలతో నచ్చిన వంటకాలు చేసుకోవచ్చు.  వీటిని తిన్నాక రెండు వారాల్లోనే మీ ఆరోగ్యంలో చాలా మార్పు కనిపిస్తుంంది. అలసట, నీరసం దూరమైపోతాయి. రోజంతా ఉత్సాహంగా, చురుగ్గా ఉంటారు.

Also read: లైంగిక జీవితంపై ఆసక్తి తగ్గిపోయిందా? అయితే మీ పొట్టలో ఇలాంటి సమస్యలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 01 Feb 2023 05:06 PM (IST) Tags: Millets Benefits of Millets Healthy Food Millets

సంబంధిత కథనాలు

Red Food Colour: ఎరుపు రంగు ఫుడ్ కలర్ వాడుతున్నారా? అది దేనితో తయారు చేస్తారో తెలిస్తే షాక్ అవుతారు

Red Food Colour: ఎరుపు రంగు ఫుడ్ కలర్ వాడుతున్నారా? అది దేనితో తయారు చేస్తారో తెలిస్తే షాక్ అవుతారు

worlds Biggest Banana: ఈ అరటిపండు తింటే మధ్యాహ్నం మీల్స్ తిన్నట్టే, ఒక్క పండుకే పొట్ట నిండిపోతుంది

worlds Biggest Banana: ఈ అరటిపండు తింటే మధ్యాహ్నం మీల్స్ తిన్నట్టే, ఒక్క పండుకే పొట్ట నిండిపోతుంది

మన దేశంలో పురాతన గ్రామం ఇది, ఇక్కడ బయట వారు ఏం తాకినా ఫైన్ కట్టాల్సిందే

మన దేశంలో పురాతన గ్రామం ఇది, ఇక్కడ బయట వారు ఏం తాకినా ఫైన్ కట్టాల్సిందే

మీరు తెలివైన వారైతే ఇక్కడున్న ఇద్దరి స్త్రీలలో ఆ చిన్నారి తల్లి ఎవరో కనిపెట్టండి

మీరు తెలివైన వారైతే ఇక్కడున్న ఇద్దరి స్త్రీలలో ఆ చిన్నారి తల్లి ఎవరో కనిపెట్టండి

ఇడ్లీ మిగిలిపోయిందా? అయితే ఇలా చాట్, పకోడా చేసుకోండి

ఇడ్లీ మిగిలిపోయిందా? అయితే ఇలా చాట్, పకోడా చేసుకోండి

టాప్ స్టోరీస్

BRS PLan : మహారాష్ట్రలో రెండో సభ - ఇతర రాష్ట్రాలను బీఆర్ఎస్ చీఫ్ లైట్ తీసుకుంటున్నారా ?

BRS PLan : మహారాష్ట్రలో రెండో సభ - ఇతర రాష్ట్రాలను బీఆర్ఎస్ చీఫ్ లైట్ తీసుకుంటున్నారా ?

BRS Leaders Fight : ఎల్బీనగర్ బీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు, మంత్రి కేటీఆర్ సమక్షంలోనే ఘర్షణ

BRS Leaders Fight : ఎల్బీనగర్ బీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు, మంత్రి కేటీఆర్ సమక్షంలోనే ఘర్షణ

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

TTD News: ఏడుకొండల్లో పెరిగిన రద్దీ, వీకెండ్ వల్ల 26 కంపార్ట్మెంట్లల్లో భక్తులు - దర్శన సమయం ఎంతంటే

TTD News: ఏడుకొండల్లో పెరిగిన రద్దీ, వీకెండ్ వల్ల 26 కంపార్ట్మెంట్లల్లో భక్తులు - దర్శన సమయం ఎంతంటే