ప్రియురాలి తల్లికి కిడ్నీ దానమిచ్చిన ప్రియుడు.. నెల తర్వాత ఆమె మరో వ్యక్తితో జంప్.. పాపం గుండె పగిలింది!
ఆమె కోసం అతడు ఏకంగా తన కిడ్నీనే దానమిచ్చాడు. ఆమె తల్లి ప్రాణాలు కాపాడాడు. కానీ, ఆమె మాత్రం.. అతడి గుండె పగిలేలా చేసింది.
అతడు.. ఆమెను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తల్లికి సాయం చేయడం ద్వారా ఆమె వద్ద మరిన్ని మంచి మార్కులు కొట్టేద్దాం అనుకున్నాడు. ఏకంగా తన కిడ్నీని ఆమె తల్లికి దానమిచ్చి.. తన ప్రేమలో నిజాయితీని చూపించాడు. కానీ, నెల తిరక్కుండానే.. అతడి ప్రియురాలు.. తన అసలు రూపం చూపించింది. మరో వ్యక్తితో జంపయ్యింది. తన పెళ్లికి రావాలని ఆహ్వానించింది.
కొందరు తమ ప్రేమలోని నిజాయితీని నిరూపించుకొనేందుకు ఎంతకైనా తెగిస్తారు. కానీ, వారి ప్రేమ సక్సెస్ రేట్ చాలా తక్కువ. మెక్సికోలోని ఉజియాల్ మార్టినెజ్ అనే యువకుడి పరిస్థితి కూడా అంతే. ఇటీవల తన ప్రియురాలి నుంచి ఎదురైన చేదు అనుభవాన్ని ‘టిక్ టాక్’ ద్వారా వెల్లడించాడు. టీచర్‌గా పని చేస్తున్న మార్టినెజ్ ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఓ రోజు ఆమె అతడికి తన తల్లి ఎందుర్కొంటున్న అనారోగ్యం గురించి చెప్పింది. ఆమె బతకాలంటే.. కిడ్నీ మార్పిడి చేయించాలని, దాతలు గురించి చూస్తున్నామని తెలిపింది. తల్లంటే తనకు చాలా ఇష్టమంటూ భావోద్వేగానికి గురైంది. ఆమె మాటలు విని మార్టినెజ్ మనసు కరిగిపోయింది. వెంటనే తన కిడ్ని దానిమిస్తానని మాట ఇచ్చేశాడు. అన్నట్లుగానే.. అతడు తన కిడ్నీని ఆమె తల్లికి ఇచ్చాడు.
Also Read: షిఫ్ట్ దిగిపోయా.. విమానం నడపను.. మధ్యదారిలో షాకిచ్చిన పైలట్, చివరికి..
అతడు అలా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి రెండు వారాలు గడిచాయో లేదో.. అతడు ఓ షాకింగ్ న్యూస్ విన్నాడు. ఆమె మరో వ్యక్తిని ప్రేమించి పెళ్లాడిందనే వార్త తెలిసి షాకయ్యాడు. ఈ సారి అతడికి గుండె పగిలినంత పనైంది. తన కోసం కిడ్నీ దానమిచ్చినా సరే.. మోసం చేయడానికి ఆమెకు ఎలా మనసు వచ్చిందంటూ కుమిలిపోయాడు. తన బాధను అతడు నెటిజనులకు టిక్ టాక్ వీడియో ద్వారా వెల్లడించాడు. ఆ వీడియోను సుమారు 14 మిలియన్ మంది పైగా వీక్షించారు. ‘‘నిన్ను దూరం చేసుకోవడం ఆమె దురదృష్టం. నీకు ఆమె కంటే మంచి పార్టనర్ లభిస్తుంది’’ అని నెటిజనులు అతడిని ఓదార్చుతున్నారు. పాపం మందుకొట్టి.. ఆ బాధను మరిచిపోడానికి కూడా అతడికి అవకాశం లేదని.. ఉన్న ఆ ఒక్క కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే, అతడు కిడ్నీ దానమిచ్చినందుకు బాధ పడటం లేదు. తన దానానికి విలువ లేకుండా పోయిందే అనేదే అతడి బాధ. కానీ, ఆమె తల్లి తన వల్ల ప్రాణాలతో ఉండటం సంతోషాన్ని కలిగిస్తోందని అంటున్నాడు.