అన్వేషించండి

Darker Mehndi Colour : మెహందీ డిజైన్స్ ఎర్రగా పండాలా? అయితే ఫాలో అవ్వాల్సిన సింపుల్ చిట్కాలు, చేయకూడని తప్పులు ఇవే

Dark Mehndi : పండుగ, ఫంక్షన్ సందర్భంగా మెహందీ పెట్టుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ చిన్న జాగ్రత్తలు పాటించి మీ చేతులకు అందమైన, సహజమైన మెహందీ రంగును పొందండి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మెహందీ కోసం చేతులు శుభ్రం చేసి, నాణ్యమైన హెన్నా వాడండి.
  • మెహందీ వెంటనే తీయకుండా, గంటల పాటు ఆరనివ్వడం ముఖ్యం.
  • నిమ్మరసం-చక్కెర మిశ్రమం వాడి, వెంటనే సబ్బుతో కడగవద్దు.

Dark Mehndi Colour Tips : పెళ్లిళ్లు, పండుగలు వంటి ప్రత్యేక సందర్భాల్లో చాలామంది అమ్మాయిలు, మహిళలు చేతులకు మెహందీ పెట్టుకుంటారు. దీపావళి సమయంలో కూడా చాలామంది రకరకాల మెహందీ డిజైన్స్ వేసుకుంటారు. అందమైన డిజైన్‌తో పాటు మెహందీ రంగు ముదురు మెరూన్ లేదా గోధుమ రంగులో వస్తే చేతులు మరింత అందంగా కనిపిస్తాయి. మరి మెహందీ రంగు ముదురుగా రావాలంటే ఏలాంటి చిట్కాలు ఫాలో అవ్వాలో చూసేద్దాం.

మెహందీ పెట్టుకునే ముందు 

మెహందీ పెట్టుకునే ముందు చేతులపై ఉన్న మురికి, నూనె, క్రీములను పూర్తిగా తొలగించడం మంచిది. చేతులను శుభ్రంగా కడుక్కొని, బాగా ఆరిన తర్వాత మెహందీ పెట్టుకోండి. చేతులపై లోషన్ లేదా నూనె ఉంటే హెన్నా రంగు చర్మానికి సరిగ్గా పండకపోవచ్చు.

Also Read : మెహందీ పెట్టుకుంటున్నారా? రంగు ముదురుగా మారి ఎర్రగా పండాలంటే ఈ చిట్కాలు పాటించండి

తాజా, నాణ్యమైన హెన్నా

మెహందీ రంగు ఎలా వస్తుందనేది ఉపయోగించే హెన్నా నాణ్యతపై కూడా ఆధారపడి ఉంటుంది. సాధ్యమైనంత వరకు తాజా, స్వచ్ఛమైన హెన్నా పౌడర్‌ను ఉపయోగించండి. పాత హెన్నా లేదా ఎక్కువ కెమికల్స్ కలిపిన ఉత్పత్తులు మంచి రంగును ఇవ్వకపోవచ్చు.
చాలా ముదురు లేదా నల్లగా కనిపించే బ్లాక్ హెన్నాలో కొన్ని రకాల రసాయనాలు ఉండే అవకాశం ఉంది. ఇవి కొందరిలో స్కిన్ అలర్జీ లేదా ఇతర సమస్యలకు కారణం కావచ్చు. కాబట్టి మెహందీ కొనే ముందు మంచిది చెక్ చేసుకోవాలి.

వెంటనే తీసేయకండి

మెహందీ పెట్టుకుని.. వెంటనే తీసేయడం వల్ల రంగు సరిగ్గా పట్టకపోవచ్చు. పేస్ట్ పూర్తిగా ఆరే వరకు, వీలైతే కొన్ని గంటల పాటు చేతులపై అలాగే ఉంచడం మంచిది. ఆరిపోయిన తర్వాత నీటితో కడగకుండా మెల్లగా గీకి తీస్తే బెటర్.

Also Read : జుట్టుకు హెన్నా అప్లై చేయకూడదా? నిపుణులు ఎందుకు నో చెప్తున్నారు.. బ్లాక్ హెన్నాతో కలిగే ఇబ్బందులు ఇవే

నిమ్మరసం, షుగర్​తో..

మెహందీ కొద్దిగా ఆరిన తర్వాత కొందరు నిమ్మరసం-చక్కెర మిశ్రమాన్ని తేలికగా అప్లై చేస్తుంటారు. ఇది మెహందీ పేస్ట్ కొంతసేపు చేతులకు అంటుకుని ఉండటానికి సహాయపడుతుంది. దీనివల్ల రంగు ముదురుగా రావచ్చు. 

వెంటనే చేతులు కడగకండి..

మెహందీని గీకి తీసిన వెంటనే సబ్బుతో చేతులు కడుక్కోవడం కంటే కొంత సమయం నీటికి దూరంగా ఉంచడం మంచిది. హెన్నా రంగు వెంటనే పూర్తిగా ముదురుగా కనిపించకపోవచ్చు. సాధారణంగా రంగు కొన్ని గంటల్లో మరింత ముదురుతుంది.

Also Read : జుట్టుకు హెన్నా అప్లై చేసేముందు చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫాలో అవ్వాల్సిన టిప్స్

నూనె రాయండి

మెహందీ తీసిన తర్వాత కొద్దిగా కొబ్బరి నూనె లేదా ఇతర సున్నితమైన నూనెను చేతులకు రాయవచ్చు. ఇది చర్మం పొడిబారకుండా ఉండటానికి సహాయపడుతుంది. అయితే రంగు ముదురుతుందని చెప్పి ఎక్కువగా నూనె రాయాల్సిన అవసరం లేదు.

లవంగాల పొగతో రంగు ముదురుతుందా?

మెహందీ రంగును ముదురుగా చేయడానికి లవంగాల పొగను ఉపయోగించే పద్ధతి కూడా కొందరు ఫాలో అవుతారు. అయితే వేడి బాణలి లేదా పొగకు చేతులను మరీ దగ్గరగా పెట్టడం మంచిది కాదు. దీనివల్ల చర్మం కాలే అవకాశం ఉంటుంది. 

Also Read : ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ అప్లై చేయాలనుకుంటే వీటిని కూడా కలపండి.. ఎన్నో లాభాలు

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
Besan Ladoo : దీపావళి స్పెషల్ బేసిన్ లడ్డూలు.. మార్కెట్ స్టైల్ రుచితో ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా, రెసిపీ ఇదే
దీపావళి స్పెషల్ బేసిన్ లడ్డూలు.. మార్కెట్ స్టైల్ రుచితో ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా, రెసిపీ ఇదే
Hair Growth Foods : జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే ఇవి తినండి.. కుదుళ్ల నుంచి పోషణ అందుతోందంటోన్న పరిశోధనలు
జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే ఇవి తినండి.. కుదుళ్ల నుంచి పోషణ అందుతోందంటోన్న పరిశోధనలు
Foods For Weight Loss : కొవ్వును తగ్గించి, మెటబాలిజాన్ని మెరుగుపరిచే ఫుడ్స్ ఇవే.. బరువు తగ్గాలనుకుంటే తీసుకోవచ్చు
కొవ్వును తగ్గించి, మెటబాలిజాన్ని మెరుగుపరిచే ఫుడ్స్ ఇవే.. బరువు తగ్గాలనుకుంటే తీసుకోవచ్చు
Advertisement

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
KTR Help: మాట నిలబెట్టుకున్న కేటీఆర్.. మస్కట్‌లో చిక్కుకున్న కొడంగల్ మహిళకు సాయం
మాట నిలబెట్టుకున్న కేటీఆర్. మస్కట్‌లో చిక్కుకున్న కొడంగల్ మహిళకు సాయం
Conductor Dies: చిల్లర వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడిన RTC కండక్టర్ మృతి, మంత్రి పొన్నం సంతాపం
చిల్లర వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడిన RTC కండక్టర్ మృతి, మంత్రి పొన్నం సంతాపం
US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు.. రిపబ్లికన్లు వెనుకంజపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. శపిస్తానంటున్న కేఏపాల్
అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు.. రిపబ్లికన్లు వెనుకంజపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. శపిస్తానంటున్న కేఏపాల్
Besan Ladoo : దీపావళి స్పెషల్ బేసిన్ లడ్డూలు.. మార్కెట్ స్టైల్ రుచితో ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా, రెసిపీ ఇదే
దీపావళి స్పెషల్ బేసిన్ లడ్డూలు.. మార్కెట్ స్టైల్ రుచితో ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా, రెసిపీ ఇదే
Norton 450 Urban ఆవిష్కరణ.. 47hp ఇంజిన్, 8-అంగుళాల TFT స్క్రీన్‌తో రెండు వేరియంట్లు
Norton కొత్త బైక్‌లు చూశారా? హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలను తలపించే డిజైన్‌తో 450 Urban
Hyderabad Crime News: ఫ్రెండ్ రూంకు వెళితే బలవంతంగా మద్యం తాగించి, ఇద్దరు బాలికలపై లైంగిక దాడి
ఫ్రెండ్ రూంకు వెళితే బలవంతంగా మద్యం తాగించి, ఇద్దరు బాలికలపై లైంగిక దాడి
Borewell NOC Rules: తెలంగాణపై ఎల్‌నీనో ఎఫెక్ట్.. బోర్‌వెల్స్‌కు ఎన్‌వోసీ తప్పనిసరి.. కొత్త మార్గదర్శకాలు జారీ
తెలంగాణపై ఎల్‌నీనో ఎఫెక్ట్.. బోర్‌వెల్స్‌కు ఎన్‌వోసీ తప్పనిసరి.. కొత్త మార్గదర్శకాలు జారీ
Embed widget