అన్వేషించండి

Glaucoma Risk: మీ వయస్సు ఎంత? జాగ్రత్త, ఈ ఏజ్‌ దాటితే కంటి చూపు మటాష్!

కంటికి సంబంధించిన స్క్రీనింగ్ గురించిన అవగాహన ఉన్న వారు చాలా తక్కువ. కంటి స్క్రీనింగ్ పరీక్షల గురించి నిపుణులు ఏమంటున్నారో ఒకసారి తెలుసుకుందాం.

మీ వయస్సు ఎంత? కొత్తగా డయాబెటిస్, బీపీ, నిద్రలేమి సమస్యలు, ఒత్తిడి వంటి సమస్యలు కనిపిస్తున్నాయా? అయితే, కళ్లు మూసుకొని చెప్పేయొచ్చు.. మీ వయస్సు 40 దాటేసిందని. ఎందుకంటే, ఈ వయస్సులోనే కొత్త కొత్త రోగాలు శరీరానికి పరిచయమవుతాయి. వాటిలో కంటి చూపు సమస్య కూడా ఒకటి. 

యసు 40 దాటగానే ఆరోగ్యం విషయంలో చిన్నచిన్న మార్పులు కనిపిస్తూనే ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన కలిగి ఉండడం అవసరంగా మారుతుంది. వయసు పైబడే కొద్దీ క్షీణించే వాటిలో కంటి చూపు కూడా ఒకటి. 40 దాటాయి ఇక బీపీ, షుగర్లు మానీటర్ చేసుకోవాలి లేదా గుండె భద్రంగా చూసుకోవాలి వంటి మాటలు వినిపిస్తాయి కానీ కంటి చూపు కాపాడుకునేందుకు ఏం చెయ్యాలనే విషయాన్ని ఎవ్వరూ చెప్పారు. అందుకే, ఈ వివరాలు మీ కోసం. 

ఈ 5 లక్షణాలతో జాగ్రత్త

  • కంటి నొప్పి
  • కళ్లు ఎర్రబారడం
  • లైట్ చుట్టూ హాలోస్ కనిపించడం
  • తలనొప్పి
  • వికారం

గ్లకోమాతో బాధపడుతున్న వారిలో పెరీఫెరల్ వ్యూ.. అంటే కంటి చూపు పరిధి నెమ్మదిగా క్షీణిస్తుంది. ప్రాథమిక దశలో లక్షణాలు గుర్తించడం చాలా కష్టం. అందువల్ల గ్లకోమా విషయంలో శాశ్వత నష్టం జరిగే వరకు సమస్యను గుర్తించేవాళ్లు చాలా తక్కువ. కుటుంబ చరిత్రలో గ్లకోమా ఉన్నవారిలో, డయాబెటిస్, బీపీ వంటి సమస్యలు ఉన్నవారిలోనే ఎక్కువ ఈ సమస్య. అంతేకాదు, ఒత్తిడి, తీక్షణమైన సూర్య కాంతి, కంటి మీద పడే డిజిటల్ ప్రెషర్ కూడా చూపు సమస్యలకు కారణం కావచ్చు.

  • గ్లకోమా ప్రమాదాన్ని నివారించేందుకు సులభమైన మార్గాలు ఉన్నాయి. కావల్సిందల్లా అవగాహన మాత్రమే.
  • కంటి ఆరోగ్యాన్ని కాపాడే ఆహారం తప్పకుండా తీసుకోవాలి. క్రాన్ బెర్రీ, బ్లాక్ లేదా గ్రీన్ టీ, అవిసెగింజలు, దానిమ్మ పండ్లు వంటి యాంటీఆక్సిడెంట్లు కలిగిన ఆహారం తీసుకోవడం అవసరం.
  • తప్పనిసరిగా ప్రతిరోజూ వ్యాయామం చెయ్యాలి. గ్లకోమా ప్రమాదం ఉన్నవారు క్రమశిక్షణ కలిగిన జీవన శైలి అలవరుచుకోవాలి.
  • యోగ సాధన గ్లకోమాను నివారించడంలో ముందుంటుంది.
  • గ్లకోమా వల్ల తగ్గిన దృష్టిని మళ్లీ పొందడం సాధ్యం కాదు. కాబట్టి ముందు నుంచే జాగ్రత్తగా ఉండడం అవసరం.
  • కంటి నర్వ్  ప్రెషర్ ఎప్పటికప్పుడు చెక్ చేయించుకొని తగిన మందులు వాడడం ద్వారా ఈ వ్యాధి త్వరగా ముదరకుండా ఆపవచ్చు.
  • అధిక బరువు అన్ని రకాలుగా నష్టమే. కంటి చూపు అందుకు మినహాయింపు కాదు. కనుక శరీర బరువు అదుపులో ఉంచుకోవడానికి కావల్సిన జాగ్రత్తలు పాటించాలి.  
  • పొగతాగడం మానెయ్యాలి, ధ్యానం చెయ్యడం మంచి ఫలితాలను ఇస్తుంది. అంతేకాదు నోటి పరిశుభ్రత మీద దృష్టి పెట్టాలి.
  • నిజానికి జీవన శైలికి సంబంధించిన సమస్యలు, కుటుంబ చరిత్ర కంటి చూపు మీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. వీటిలో గ్లకోమా, శుక్లాలు, డయాబెటిక్ రెటినోపతి వంటి సమస్యలు వీటిలో ముఖ్యమైనవి.
  • కంటి చూపుకు సంబంధించిన సమస్యలు ప్రాథమిక దశలో ఎలాంటి లక్షణాలు చూపవు.
  • స్క్రీనింగ్ పరీక్షలు చెయ్యకపోతే శాశ్వత నష్టం జరగవచ్చు.
  • అవగాహన, రెగ్యులర్ స్క్రీనింగ్ మాత్రమే కంటి చూపు కాపాడే సాధనాలు.
  • ప్రమాదకారకాలను అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం.
  • 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ఏడాదికి ఒక్కసారైనా పూర్తిస్థాయిలో కంటి పరీక్షలు చేయించుకోవాలి.

Also read: తలకాయ కూర మాంసం ఇలా వండితే లొట్టలేసుకుని తింటారు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Pushpa 2 Trailer Launch Live Updates: అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Manipur: మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
Nora Fatehi From Matka: 'మట్కా' ఫ్లాపే కానీ... మూవీలో నోరా ఫతేహి ఎంత ముద్దుగా ఉందో చూశారా?
'మట్కా' ఫ్లాపే కానీ... మూవీలో నోరా ఫతేహి ఎంత ముద్దుగా ఉందో చూశారా?
Embed widget