అన్వేషించండి

Matcha Tea : మాచా టీ ఎలా తయారు చేయాలి? రోజూ తాగితే మంచిదేనా? ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే

Matcha Green Tea Benefits : మాచా టీ గురించి ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. గ్రీన్ టీకి దీనికి ఉన్న వ్యత్యాసం ఏంటి.. దీనిని ఎలా తయారు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మాచా టీ యాంటీఆక్సిడెంట్లు కలిగిన గ్రీన్ టీ ఆకుల పొడి.
  • ఏకాగ్రత పెంచి, గుండెకు మేలు, మితంగా వాడాలి.
  • బరువు తగ్గడానికి తోడ్పడినా, రాత్రి తీసుకోవడం నిద్రకు ఆటంకం.

Matcha Tea For Health : టీ, కాఫీలకు ప్రత్యామ్నాయంగా ఈ మధ్యకాలంలో చాలామంది మాచా టీని తాగుతున్నారు. సోషల్ మీడియాలో కూడా మాచా టీకి సంబంధించిన వీడియోలు, రెసిపీలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. సాధారణ గ్రీన్ టీ ఆకులను వేడి నీటిలో నానబెట్టి తాగితే.. మాచాను మాత్రం మెత్తగా పొడి చేసి నీటిలోనే కలుపుకుని తాగుతారు. అందుకే ఇందులోని కొన్ని సహజ సమ్మేళనాలు నేరుగా శరీరంలోకి చేరుతాయి. ఇంతకీ మాచా టీని ఎలా తయారు చేసుకోవాలి? దీనివల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏంటో చూసేద్దాం.

మాచా టీ

మాచా అనేది ప్రత్యేకంగా పెంచి, ప్రాసెస్ చేసిన గ్రీన్ టీ ఆకులను మెత్తగా పొడిగా చేయడమే. ఇందులో కాటెచిన్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యంగా EGCG, కెఫీన్ సమ్మేళనాలు ఉంటాయి. అయితే మాచాలో కెఫీన్ ఉంటుంది కాబట్టి దీనిని కూడా మితంగా తీసుకోవడం మంచిది. 

Also Read : టీ ఎక్కువగా తాగుతున్నారా? నిద్రలేమి, రక్తహీనతతో పాటు ఈ సమస్యలు రావొచ్చంటున్న వైద్యులు

మాచా టీ తయారీ విధానం

ఒక కప్పు మాచా టీ తయారు చేసుకోవడానికి ఒక టీస్పూన్‌ కంటే తక్కువ.. సుమారు 1 నుంచి 2 గ్రాముల మ్యాచా పొడిని తీసుకోవచ్చు. ముందుగా ఒక కప్పు నీటిని వేడి చేసుకోవాలి. ఒక చిన్న గిన్నెలో మ్యాచా పొడి వేసి కొద్దిగా వేడి నీరు పోయాలి. ఉండలు లేకుండా నీటిని బాగా కలపాలి. ఆ తర్వాత మిగిలిన నీటిని పోసి కలిపితే మాచా టీ రెడీ. కావాలంటే రుచికోసం కొద్దిగా తేనె లేదా నిమ్మరసం కలుపుకోవచ్చు.

మాచా టీ వల్ల కలిగే లాభాలు

మాచాలో కాటెచిన్స్ వంటి పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. శరీరంలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. దీనిలో కెఫీన్‌తో పాటు L-theanine కూడా ఉంటుంది. ఇది ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడవచ్చని పరిశోధనలు చెప్తున్నాయి. అలాగే మరికొన్ని పరిశోధనల్లో గుండె ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని సానుకూల ప్రభావాలు కనిపించాయి. అందుకే సమతుల్య ఆహారం, వ్యాయామంతో పాటు తీసుకుంటే మంచి ఫలితాలు చూడవచ్చు. 

Also Read : టీ తాగిన వెంటనే నీళ్లు తాగకూడదా? ముందు తాగితే మంచిదా? నిపుణులు చెప్పిన నిజాలు ఇవే

బరువు తగ్గుతారా?

గ్రీన్ టీ, కాటెచిన్స్, కెఫీన్‌పై జరిగిన కొన్ని అధ్యయనాలు శరీర శక్తి వినియోగం, కొవ్వు ఆక్సీకరణపై స్వల్ప ప్రభావం ఉండవచ్చని సూచిస్తున్నాయి. అయితే మాచా తాగితేనే బరువు తగ్గిపోతామని అనుకోకూడదు. బరువు తగ్గడానికి ఆహారం, శారీరక శ్రమ, నిద్ర వంటి అనేక అంశాలు హెల్ప్ చేస్తాయి.  అలాగే మాచాను నీటితో మాత్రమే తీసుకుంటే అదనపు చక్కెర ఉండదు. కాబట్టి తక్కువ కేలరీ డ్రింక్స్​లో భాగంగా దీనిని తీసుకోవచ్చు. 

మాచా ఎప్పుడు తీసుకోవాలి..

కెఫీన్ ఎక్కువగా ఉంది కాబట్టి.. ఎక్కువగా తాగడం మంచిది కాదు. అలాగే దీనిని ఉదయం లేదా మధ్యాహ్నం తీసుకోవచ్చు. కానీ సాయంత్రం, రాత్రుళ్లు తీసుకుంటే దీనిలోని కెఫిన్ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. 

Also Read : ప్రతిరోజూ గ్రీన్ టీ తాగుతున్నారా? ఆరోగ్యానికి మేలా.. కీడా? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Munagaku Pakodi : మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
HIV and Pregnancy : HIV ఉన్నా తల్లి కావచ్చు.. బిడ్డకు వైరస్ సోకకుండా ఉండాలంటే ఏం చేయాలి? పూర్తి ప్రాసెస్ ఇదే
HIV ఉన్నా తల్లి కావచ్చు.. బిడ్డకు వైరస్ సోకకుండా ఉండాలంటే ఏం చేయాలి? పూర్తి ప్రాసెస్ ఇదే
Aloe Vera Benefits : చర్మం, జుట్టు సంరక్షణకు కలబంద.. ఇంట్లోనే ఈ DIY చిట్కాలు ఫాలో అవుతూ ఉపయోగించండి
చర్మం, జుట్టు సంరక్షణకు కలబంద.. ఇంట్లోనే ఈ DIY చిట్కాలు ఫాలో అవుతూ ఉపయోగించండి
HIV Emergency Treatment : హెచ్ఐవీ వస్తుందని డౌట్ ఉందా? 72 గంటల్లో ఈ చికిత్స తీసుకుంటే ఇన్ఫెక్షన్‌ను అడ్డుకోవచ్చా? PEP అంటే ఏమిటి?
హెచ్ఐవీ వస్తుందని డౌట్ ఉందా? 72 గంటల్లో ఈ చికిత్స తీసుకుంటే ఇన్ఫెక్షన్‌ను అడ్డుకోవచ్చా? PEP అంటే ఏమిటి?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
Union Cabinet Decisions: ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
Telangana Congress Politics: తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
Dog Kills Leopard Cub: కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
Ekalavya Series OTT : AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
MyTDP App: 10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
Munagaku Pakodi : మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
Actor Venkatesh: డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
Embed widget