అన్వేషించండి

Smart Kitchen Appliances : స్మార్ట్ కిచెన్ హ్యాక్స్.. వంటగదిలో ఈ పరికరాలు ఉంటే ఈజీగా కుక్ చేసుకోవచ్చు

Kitchen Appliances : వంటగదిలో మనం రోజూ ఉపయోగించే పరికరాలు.. మన పనిని తగ్గించేలా ఉండాలి. అందుకే కిచెన్​లో ఈ 5 పరికరాలు ఉండేలా చూసుకోండి. ఇవి వంటను త్వరగా, ఈజీగా చేయడంలో హెల్ప్ చేస్తాయి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • చిన్న వంటగదిలో కూడా వంట సులభం చేసే పరికరాలు కీలకమైనవి.
  • ఎగ్ బాయిలర్, బ్లెండర్, ఎలక్ట్రిక్ చాపర్ వంట వేగవంతం చేస్తాయి.
  • ఎలక్ట్రిక్ కెటిల్, ఎయిర్ ఫ్రైయర్ వేడి చేయుట, స్నాక్స్ సులభం.
  • టోస్టర్, ఇండక్షన్ కుక్కర్ అదనపు అవసరాలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి.

Must-Have Kitchen Appliances : కిచెన్ చిన్నగా ఉన్నా.. పెద్దగా ఉన్నా కొన్ని పరికరాలు వంటగదిలో పెట్టుకుంటే వంటను చేసుకోవడం సులభం అవుతుంది. సరైన పరికరాలను ఎంచుకోవడం ద్వారా టైమ్, ఎనర్జీని సేవ్ చేసుకోగలుగుతారు. టీ, బ్రేక్​ఫాస్ట్, కూరగాయలు కట్ చేయడం, చిరుతిళ్లు చేయడం వంటి అనేక పనులను సులభంగా చేసేలా కొన్ని పరికరాలు హెల్ప్ చేస్తాయి. ఇవి ఇంట్లో ఉండేవారికే కాదు.. పీజీలు, హాస్టళ్లు, అద్దె ఇళ్లు, స్టూడియో అపార్ట్‌మెంట్లలో ఉండేవారికి కూడా హెల్ప్ అవుతాయి. కాబట్టి రోజూవారీ వంటల్లో ఉపయోగపడేలా.. తక్కువ స్థలం తీసుకునే పరికరాలు ఏంటో.. అవి వంటకి ఎలా హెల్ప్ అవుతాయో ఇప్పుడు చూసేద్దాం. 

ఎగ్ బాయిలర్.. 

కిచెన్లో ఎగ్ బాయిలర్ ఉంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గుడ్లు ఉడకబెట్టడం, మోమోలు లేదా ఇడ్లీలను స్టీమ్ చేయడం, కూరగాయలు వండటం, పిల్లల ఆహారాన్ని తయారు చేయడం వంటి పనులకు దీనిని ఉపయోగించవచ్చు. చాలావరకు మార్కెట్లలో 3-ఇన్-1 మల్టీ-కుక్కర్ ఎగ్ బాయిలర్స్ అందుబాటులో ఉంటాయి. ఇవి 900 నుంచి.. 2,200 రేంజ్లో అందుబాటులో ఉంటాయి. 

Also Read : మీరు వంట బాగా చేస్తారా? అయితే తక్కువ ఖర్చుతో క్లౌడ్ కిచెన్ ప్రారంభించండి.. లక్షల్లో సంపాదించవచ్చు

యాక్టివ్ బ్లెండర్..

మీ కిచెన్లో మిక్సర్, స్మూతీ మేకర్, ట్రావెల్ బాటిల్‌ పెట్టేందుకు స్థలం లేకపోతే.. యాక్టివ్ బ్లెండర్ తీసుకోవచ్చు. దీనిని స్మూతీలు, ప్రోటీన్ షేక్‌లు, మ్యాంగో లస్సీ, గ్రీన్ జ్యూస్, చట్నీలు, మసాలా పేస్ట్‌లు, కాఫీ పొడిని తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. యాక్టివ్ బ్లెండర్ రెండు ఫుడ్-గ్రేడ్ జార్‌లు, ప్రత్యేక బ్లేడ్‌లతో వస్తుంది. వీటి ధర 1,995 నుంచి మొదలై.. 2,747 వరకు అందుబాటులో ఉంటాయి.

ఎలక్ట్రిక్ చాపర్..

ప్రతిరోజూ ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, కూరగాయలను తరగడం పెద్ద పనిగా ఉంటుంది. కానీ ఎలక్ట్రిక్ చాపర్ ఈ పనిని క్షణాల్లో పూర్తి చేయగలదు. ఎలక్ట్రిక్ వెజిటబుల్ చాపర్లో స్టెయిన్‌లెస్ స్టీల్ బ్లేడ్, ఒక విస్కింగ్ డిస్క్, 0.4 లీటర్ల గిన్నె ఉంటాయి. ఇవి తరగడమే కాకుండా.. చట్నీ బేస్‌లను తయారు చేయడానికి, కూరగాయలను తరగడానికి, గుడ్లు లేదా క్రీమ్‌ను గిలకొట్టడానికి హెల్ప్ చేస్తాయి. 

Also Read : కిచెన్ క్లీనింగ్ టిప్స్.. పండుగల సీజన్లో వంటగదిని మెరిసేలా చేసే 7 చిట్కాలివే

ఎలక్ట్రిక్ కెటిల్ 

టీ, కాఫీ, నూడుల్స్, ఇన్‌స్టంట్ సూప్ లేదా వేడి నీటి కోసం ఎలక్ట్రిక్ కెటిల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గ్లాస్ కెటిల్‌కు 1.8-లీటర్ల సామర్థ్యం ఉంటుంది. దీనిని ఉపయోగించి మరిగించడం, ఆవిరి మీద ఉడికించడం, వండటం వంటి ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.

మినీ ఎయిర్ ఫ్రైయర్

మినీ ఎయిర్ ఫ్రైయర్‌ను ఉపయోగించి సమోసాలు, పకోడీలు, కట్‌లెట్‌లు, పనీర్ టిక్కా, ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్, మఖానా వంటి స్నాక్స్‌ను తయారు చేసుకోవచ్చు. ఈ స్నాక్స్‌ను తక్కువ నూనెతో లేదా నూనె లేకుండా తయారు చేసుకోవచ్చు. మినీ ఎయిర్ ఫ్రైయర్‌లో 180 నుంచి 200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత సెట్టింగ్, 30 నిమిషాల టైమర్తో హాయిగా కుక్ చేసుకోవచ్చు. 

Also Read : ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం.. కిచెన్​లో ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవు

మరిన్ని పరికరాలు..

బ్రెడ్ టోస్ట్ చేయడానికి, శాండ్‌విచ్‌లను వేడి చేయడానికి, తక్కువ పరిమాణంలో కుకీలు లేదా కప్‌కేక్‌లు తయారు చేయడానికి, చీజ్ లేదా చికెన్‌ను గ్రిల్ చేయడానికి ఒక చిన్న టోస్టర్ గ్రిల్లర్ తీసుకోవచ్చు. గ్యాస్ కనెక్షన్ లేకపోయినా లేదా అదనపు బర్నర్ అవసరమైనా, పోర్టబుల్ ఇండక్షన్ కుక్కర్ కూడా ఒక ప్రత్యామ్నాయం. దీనిని అన్నం, పప్పు, కూరగాయలు, తడ్కా వండటానికి మరియు పాలను వేడి చేయడానికి ఉపయోగించవచ్చు. ఇలాంటి ఎలక్ట్రిక్ వస్తువులను కిచెన్లో పెట్టుకుంటే.. వంట వేగంగా, సులభంగా చేసుకోగలుగుతారు.  

Also Read : కిచెన్​లో సింక్​తో ప్రాబ్లమా? ప్లంబర్ అవసరం లేకుండా ముసుకుపోయిన సింక్ డ్రెయిన్ ఇలా క్లీన్ చేసేయండి

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Darker Mehndi Colour : మెహందీ డిజైన్స్ ఎర్రగా పండాలా? అయితే ఫాలో అవ్వాల్సిన సింపుల్ చిట్కాలు, చేయకూడని తప్పులు ఇవే
మెహందీ డిజైన్స్ ఎర్రగా పండాలా? అయితే ఫాలో అవ్వాల్సిన సింపుల్ చిట్కాలు, చేయకూడని తప్పులు ఇవే
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
Besan Ladoo : దీపావళి స్పెషల్ బేసిన్ లడ్డూలు.. మార్కెట్ స్టైల్ రుచితో ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా, రెసిపీ ఇదే
దీపావళి స్పెషల్ బేసిన్ లడ్డూలు.. మార్కెట్ స్టైల్ రుచితో ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా, రెసిపీ ఇదే
Hair Growth Foods : జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే ఇవి తినండి.. కుదుళ్ల నుంచి పోషణ అందుతోందంటోన్న పరిశోధనలు
జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే ఇవి తినండి.. కుదుళ్ల నుంచి పోషణ అందుతోందంటోన్న పరిశోధనలు
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP ZPTC MPTC Elections: నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
Virat Kohli  Storm: అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
Ongole Mayor Result: కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
RTC Conductor Dies: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
Medical College Ragging: కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
Embed widget