Sue For Farting: ఛీ కంపు, ఆ ఫుడ్ తిని ఐదేళ్లుగా ‘గ్యాస్’ వదులుతూనే ఉన్నాడు, స్టాల్‌పై రూ.2 కోట్లు దావా!
ఐదేళ్ల కిందట తిన్న ఆహారం వల్ల ఆ వ్యక్తి ఇప్పటికీ పిత్తుతూనే ఉన్నాడు. దీంతో అతడు ఆ ఆహారాన్ని విక్రయించిన సంస్థపై అతడు రూ.2 కోట్లు దావా వేశాడు.
కొన్ని ఆహారాలు కడుపుకు అంత మంచివి కావు. అవి కడుపులో గ్యాస్‌ను క్రియేట్ చేస్తాయి. ఫలితంగా అపానవాయువు (పిత్తులు) వస్తూనే ఉంటాయి. వాటిని కంట్రోల్ చేయడం మనం వల్ల కాదు. ఒక్కోసారి నలుగురిలో కూర్చున్నప్పుడు.. షేమ్.. షేమ్.. పప్పీ షేమ్ అయిపోతాం. అంతా మనల్ని అదోలా చూస్తారు. వారేదో ఎప్పుడూ ఆ గ్యాస్ వదలనట్లు బిల్డప్ ఇస్తారు. అయితే, ఈ సమస్యకు మందులున్నాయి. డాక్టర్ సూచించే మందులు వేసుకుంటే కొద్ది రోజుల్లోనే ఆ సమస్య తగ్గిపోతుంది. కానీ, యూకేకు చెందిన ఓ వ్యక్తికి మాత్రం అలా కాలేదు. ఐదేళ్లు అవుతున్నా.. అతడు గ్యాస్ వదులుతూనే ఉన్నాడు. దీంతో అతడి పక్కన నిలుచోడానికి కుటుంబ సభ్యులు కూడా సిగ్గుపడుతున్నారు. ఈ అవమానాన్ని భరించలేక అతడు ఏకంగా తనకు ఆ ఫుడ్ విక్రయించిన స్టాల్ మీదే దావా వేశాడు.
విల్ట్‌షైర్‌లోని చిప్పెన్‌హామ్‌కు చెందిన వ్యక్తి 2017లో తన భార్య మరియు పిల్లలతో కలిసి బర్మింగ్‌హామ్‌లోని క్రిస్మస్ మార్కెట్‌ను సందర్శించాడు. ఈ సందర్భంగా అతడు హామ్ రోల్ తిన్నాడు. అప్పటి నుంచి అతడు ఆగకుండా గ్యాస్‌ను వదులుతూనే ఉన్నాడు. అది తిన్న కొన్ని గంటల్లోనే తిమ్మిరి, జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడ్డాడు. దీంతో అతడిని వెంటనే హాస్పిటల్‌లో చేర్చారు.
ప్రస్తుతం ఆ బాధితుడికి 46 ఏళ్లు. అతడు ఆ ఫుడ్ తిన్న తర్వాత సుమారు ఐదు వారాలు మంచానికే పరిమితం అయ్యాడు. ఆ తర్వాత ఆరోగ్యం కుదటపడింది.. కానీ, గ్యాస్ సమస్య మాత్రం తగ్గలేదు. పదే పదే పిత్తులు వస్తుండటంతో సిగ్గుతో అల్లాడిపోయాడు. చివరికి నిద్రపోతున్నప్పుడు కూడా అపానవాయువు వస్తూనే ఉంది. దీంతో అతడు నిద్రలేమి సమస్యతో బాధపడ్డాడు. దానివల్ల అతడు చాలా ఇబ్బంది పడ్డాడు. పెద్ద శబ్దంతో వదిలే ఆ గ్యాస్ కుటుంబ సభ్యులకు కూడా సమస్యగా మారింది.
సుదీర్ఘంగా బాధపడుతున్న ఈ సమస్యతో విసుగెత్తిపోయిన బాధితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఆ ఫుడ్‌ను విక్రయించిన స్టాల్‌పై 2 లక్షల పౌండ్లు దావా వేశాడు. అది తిన్న రోజు నుంచి తన క్లయింట్ అలసట, పొత్తికడుపు, అపానవాయువు సమస్యతో బాధపడుతున్నాడని అతడి న్యాయవాది పార్కిన్ తెలిపారు. అతడి పేగు పనితీరు మారిపోవడం వల్లే ఈ సమస్య ఏర్పడినట్లు వైద్యులు చెప్పారని పేర్కొన్నారు. అది తిన్న తర్వాత అతడికి సాల్మొనెల్లా బ్యాక్టీరియా సోకిందని, అందుకే అతడికి ఈ సమస్య ఏర్పడిందన్నారు.
ఈ మేరకు ఆ ఆహారాన్ని విక్రయించిన ఫ్రాంక్‌ఫర్ట్ క్రిస్మస్ మార్కెట్ లిమిటెడ్ నిర్లక్ష్యం వల్లే అతడు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాడని, ఇందుకు పరిహారంగా 200,000 పౌండ్లు (సుమారు రూ.2 కోట్లు) కంటే ఎక్కువ చెల్లించాలని న్యాయవాది వెల్లడించారు. అయితే, ఆ సంస్థ నిందను ఖండించింది. హామ్ హాక్ స్టాల్‌లో సాల్మొనెల్లా బ్యాక్టీరియా లేదని పేర్కొంది. అయితే, ఆ రోజు అక్కడ ఆహారం తిన్న సుమారు 16 మందిలో ఈ లక్షణాలు కనిపించినట్లు ఫిర్యాదులు ఉన్నాయని లాయర్ పార్కిన్ తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుపై వాదోపవాదనలు, వాయిదాలు జరుగుతున్నాయి. ఇంకా తీర్పు వెల్లడికావల్సి ఉంది.
Also Read: ఈ వయస్సు వచ్చాక మగాళ్ల లైంగిక శక్తి మటాష్, ఇలా చేస్తే సేఫ్!
Also Read: ఎలోన్ మస్క్ తండ్రి వీర్యానికి అంత డిమాండా? 76 ఏళ్ల వయస్సులోనూ అదేపని!