Viral News: థియేటర్లలో స్నాక్స్ ధర అలా ఉంటే అందరూ ఇలాగే చేస్తారు, నీ తెలివికి హ్యాట్సాఫ్ భయ్యా!
థియేటర్లలో స్నాక్స్ కొనాలంటే దిమ్మతిరిగి బొమ్మ కనపడుతుంది. అందుకే, ఓ కుర్రాడు తెలివిగా బయటి ఫుడ్ లోపలికి తీసుకెళ్లి హాయిగా తింటూ సినిమా ఎంజాయ్ చేశాడు. ప్రస్తుతం వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఈ రోజుల్లో థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడాలంటేనే మధ్య తరగతి జనాలు భయపడే పరిస్థితి నెలకొంది. టికెట్లకు పెట్టే ధరతో పోల్చితే స్నాక్స్ ధర మూడు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. పాప్ కార్న్ ధర రూ. 100. కూల్ డ్రింక్ ధర రూ. 60. చిన్న సమోస ధర రూ. 15. ఇలా చెప్పుకుంటూ పోతే కళ్లు తిరిగి పడిపోవాల్సిందే. ఈ ధరలకు భయపడే చాలా మంది థియేటర్లకు వెళ్లడం మానేశారు అంటే ఆశ్చర్యం కలగకమానదు. సినిమాలు విడుదలయ్యాక రెండు మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అన్ని డబ్బులు పెట్టి థియేటర్ కు వెళ్లి చూడటం కంటే, ఫ్యామిలీ అంతా కూర్చొని ఇంట్లోనే సినిమా చూడటం మంచిదనే ఆలోచన చేస్తున్నారు చాలా మంది ప్రేక్షకులు.
నీ తెలివికి దండం బాబూ!
ఇక తాజాగా అల్పేష్ అనే కుర్రాడు థియేటర్లలో విపరీతమైన స్నాక్స్ ధరల నుంచి బయటపడేందుకు ఓ చక్కటి ఆలోచన చేశాడు. థియేటర్ కు వెళ్లడానికి ముందే రెండు చిప్స్ ప్యాకెట్లు, కొన్ని స్నాక్స్, ఓ కూల్ డ్రింక్ బాటిల్ ను షూ బాక్స్ లో చక్కగా ప్యాక్ చేశాడు. దానికి చక్కగా ప్లాస్టర్ వేసి చక్కగా ఓ బ్యాగులో పెట్టుకుంటాడు. థియేటర్ లోకి వెళ్లే ముందు సెక్యూరిటీ చెకింగ్ పాయింట్ దగ్గర షాపింగ్ కు వెళ్లి వస్తున్నట్లు చెప్తాడు. చెకింగ్ సిబ్బంది కూడా ప్యాక్ చేసి ఉన్న బాక్స్ ను చూసి లోపలికి అనుమతిస్తారు. ఇంకే ఆ కుర్రాడు లోపల చక్కగా స్నాక్స్ తింటూ, కూల్ డ్రింక్ తాగుతూ సినిమాను ఎంజాయ్ చేస్తాడు.
ఇదో జీనియస్ హ్యాక్- అల్పేష్
అక్షయ్ కుమార్ హీరోగా నటింటిన ‘OMG 2’ సినిమా చూసేందుకు వెళ్లిన అల్పేష్ ఇలా బయటి ఫుడ్ ను తెలివిగా లోపలికి తీసుకెళ్లి తింటూ హ్యాపీగా, జాలీగా సినిమా చూశాడు. ఈ వీడియోను తన ఇన్ స్టా ద్వారా నెటిజన్లతో పంచుకున్నాడు. "నేను దీనిని జీనియస్ హ్యాక్ అని పిలుస్తాను" అంటూ వీడియోకు క్యాప్షన్ పెట్టాడు. ఈ వీడియో చూస్తుండగానే తెగ వైరల్ అయ్యింది. ఇప్పటి వరకు ఏకంగా 35 మిలియన్లకు పైగా వ్యూస్ అందుకుంది. రెండు మిలియన్లకు పైగా లైక్స్ సంపాదించింది. ఈ వైరల్ వీడియోపై స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ స్పందించింది. "ఎ సెక్షన్ నుంచి తెలివైన విద్యార్థి" అని కామెంట్ పెట్టింది.
View this post on Instagram
రకరకాలుగా స్పందిస్తున్న నెటిజన్లు
ఇక థియేటర్ లోకి బయటి నుంచి స్నాక్స్ తీసుకెళ్లిన యువకుడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. “ఈ ట్రిక్ బాగుంది. నేను ఇప్పటి వరకు 3సార్లు ప్రయత్నించాను. సక్సెస్ అయ్యాను” అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. "నేను కచ్చితంగా దీన్ని ప్రయత్నిస్తాను" అని మరో వ్యక్తి వ్యాఖ్యానించాడు. “PVR, INOX ఈ రీల్‌ని చూసి అసలు విషయాన్ని తెలుసుకుంటాడు” అని మరోవ్యక్తి కామెంట్ చేశాడు.
Read Also: డిలీటెడ్ సీన్లతో ‘జవాన్’ ఓటీటీ విడుదల, అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పిన దర్శకుడు!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial