అన్వేషించండి

Injury: అదే పనిగా హస్తప్రయోగం, చావుకు హాయ్ చెప్పి వచ్చాడు, ఇలా మీకూ జరగొచ్చు!

20 ఏళ్ల యువకుడికి ఎదురైన చేదు అనుభవం ఇది. హస్త ప్రయోగం వల్ల ఆస్పత్రిపాలై మూడు రోజులు ఐసీయూలో చికిత్స పొందాల్సి వచ్చింది.

Masturbating Side Effects | స్వయంతృప్తి లేదా హస్త ప్రయోగం ఆరోగ్యానికి మంచిదే. కానీ, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. అది దాటితే మీ శరీరం కూడా మీకు సహకరించదు. చివరికి మరణాన్ని కూడా పరిచయం చేయొచ్చు. నమ్మబుద్ధి కావడం లేదా? అయితే, మీరు స్విట్జర్లాండ్‌కు చెందిన ఓ యువకుడికి ఎదురైన ఆ పరిస్థితి గురించి తెలుసుకోవల్సిందే. 

20 ఏళ్ల యువకుడు ఓ రోజు ఇంట్లో ఎవరూలేని సమయంలో హస్త ప్రయోగం చేస్తూ టైంపాస్ చేశాడు. ఉద్వేగం ఎక్కువైందో ఏమో.. కొద్ది సేపటి తర్వాత అతడు ఊపిరి పీల్చుకోడానికి ఇబ్బందిపడ్డాడు. ఆ తర్వాత ఛాతి నొప్పి వచ్చింది. ఏదో తేడా చేసిందని భావించి వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. వైద్యులు హుటాహుటిన అక్కడికి చేరుకుని అతడికి ప్రథమ చికిత్స అందించారు. కృత్రిమ శ్వాస అందించారు. అనంతరం ఐసీయూలో పెట్టి చికిత్స అందించారు. 

మంచం మీద రిలాక్స్ అవుతూ హస్త ప్రయోగం చేస్తున్న సమయంలో తనకు ఈ సమస్య వచ్చిందని ఆ యువకుడు వైద్యులకు తెలిపాడు. పరీక్షల సమయంలో అతడి ముఖం బాగా వాచిపోవడాన్ని వైద్యులు గుర్తించారు. అతడి ఊపిరితీత్తుల్లో గాయాన్ని గుర్తించారు. సాధారణంగా ఇలాంటి గాయాలు తీవ్రమైన దగ్గు, ఫిట్స్ లేదా కఠినమైన వ్యాయాయం వల్ల వస్తుంది.

అతడు తిరిగి ఊపిరి పీల్చుకోవడానికి మూడు రోజులపాటు ఐసీయూలోనే చికిత్స పొందాల్సి వచ్చింది. అంటే, అతడు దాదాపు చావును చూసొచ్చాడు. అయితే, బాధితుడు ఇదివరకే ‘స్పాంటేనియస్ న్యుమోమెడియాస్టినమ్’ (SPM) ఉన్నట్లు వైద్యులు తెలుసుకున్నారు. ఊపిరితీత్తుల్లోని గాలి పక్కటెముకుల్లోకి చేరడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. పక్కటెముకల్లో చిక్కుకున్న గాలి పుర్రె వరకు వ్యాపించే అవకాశాలున్నాయని రేడియాలజీ కేస్ రిపోర్ట్స్‌ పేర్కొన్నారు. అయితే, ఇతడికి లక్కీగా ఆ పరిస్థితి రాలేదు. 

కానీ, ఎక్స్‌రేలో ఛాతి, ఊపిరితీత్తుల సంచుల మధ్య ఖాళీలో గాలి ఉన్నట్లు కనిపించాయి. అదే ఛాతి నొప్పికి కారణమైనట్లు వైద్యులు తెలుసుకున్నారు. పైగా బాధితుడికి ఆస్తమా కూడా ఉంది. కానీ, ధూమపానం, మాదకద్రవ్యాల అలవాట్లు లేవు. కేవలం హస్త ప్రయోగం వల్లే అతడికి ఈ సమస్య వచ్చింది. ఈ పరిస్థితి ఎక్కువగా 23 ఏళ్ల వయస్సు లోపు యువకులకు వస్తుందని వైద్యులు తెలిపారు. దీనికి సర్జరీతో పని ఉండదని, ఛాతిలోకి ట్యూబ్‌ను పంపడం ద్వారా ప్రాణాలు రక్షించవచ్చని పేర్కొన్నారు. ఈ చికిత్స తర్వాత మళ్లీ ఆ పరిస్థితి వచ్చే అవకాశాలు కేవలం ఒక శాతం మాత్రమేనని నిపుణులు తెలిపారు.

Also Read: అలా ఎలా? మలద్వారంలోకి చొచ్చుకెళ్లిన 2 కేజీల డంబెల్, ఇదేం పాడు అలవాటు భయ్యా!

ఛాతి నొప్పి, శ్వాస సమస్య పరిష్కారం అయ్యే వరకు బాధితుడికి పారాసెటమాల్, ఇతరాత్ర మందులను ఇచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఇలా లైంగిక కార్యకలాపాలకు సంబంధించిన SPM కేసులు చాలా తక్కువన్నారు. SPM అనేది అరుదైన పరిస్థితి, కొందరికి ఇది ప్రాణాపాయం కాదు. దీని లక్షణాలు  అకస్మాత్తుగా వస్తాయి. కానీ, చాలా తీవ్రంగా ఉంటాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ, మెడ నొప్పి, వాంతులు ఏర్పడతాయి. కొందరు మింగడానికి ఇబ్బంది పడతారు. గొంతు బొంగురుపోతుంది. మీకు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి వస్తే తప్పకుండా వైద్యుడిని సంప్రదించండి. 

Also Read: జాగ్రత్త, అంగస్తంభన కోసం ఇలా చేస్తే కళ్లు పోతాయ్! తాజా అధ్యయనం వెల్లడి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Tesla Plant: ఇండియాలో ప్లాంట్ పెట్టాలని టెస్లా నిర్ణయం - తెలంగాణ ప్రయత్నాలు ఫలిస్తాయా ?
ఇండియాలో ప్లాంట్ పెట్టాలని టెస్లా నిర్ణయం - తెలంగాణ ప్రయత్నాలు ఫలిస్తాయా ?
Andhra Pradesh Latest News:విధులకు హాజరుకాని ప్రభుత్వ వైద్యులపై కొరడా- 55 మందిని తొలగించిన సర్కారు
విధులకు హాజరుకాని ప్రభుత్వ వైద్యులపై కొరడా- 55 మందిని తొలగించిన సర్కారు
Maganti Gopinath: జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమం - హఠాత్తుగా ఏమయిందంటే ?
జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమం - హఠాత్తుగా ఏమయిందంటే ?
Bandi Sanjay Kumar Latest News : కాంగ్రెస్‌తో కేసీఆర్ ఒప్పందం- కేసులు లేకుండా కలిసి ప్రయాణం- బండి సంజయ్ సంచలన ఆరోపణలు
కాంగ్రెస్‌తో కేసీఆర్ ఒప్పందం- కేసులు లేకుండా కలిసి ప్రయాణం- బండి సంజయ్ సంచలన ఆరోపణలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PM Modi Shake Hand AP Leaders | ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారంలో ఏపీ లీడర్లకు గౌరవం | ABP DesamBan vs Ind Champions Trophy 2025 | బాగానే ఆడిన బంగ్లా బాబులు..షమీ అన్న మాస్ కమ్ బ్యాక్ | ABP DesamQatar AL Thani Family Wealth | మోదీ ఎయిర్ పోర్ట్ కు వెళ్లారంటే అర్థమవ్వలేదా ఖతార్ అమీర్ రేంజ్ | ABPTrolls on Pawan kalyan Body | కుంభమేళా స్నానంపైనా కుళ్లు ట్రోలింగులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Tesla Plant: ఇండియాలో ప్లాంట్ పెట్టాలని టెస్లా నిర్ణయం - తెలంగాణ ప్రయత్నాలు ఫలిస్తాయా ?
ఇండియాలో ప్లాంట్ పెట్టాలని టెస్లా నిర్ణయం - తెలంగాణ ప్రయత్నాలు ఫలిస్తాయా ?
Andhra Pradesh Latest News:విధులకు హాజరుకాని ప్రభుత్వ వైద్యులపై కొరడా- 55 మందిని తొలగించిన సర్కారు
విధులకు హాజరుకాని ప్రభుత్వ వైద్యులపై కొరడా- 55 మందిని తొలగించిన సర్కారు
Maganti Gopinath: జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమం - హఠాత్తుగా ఏమయిందంటే ?
జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమం - హఠాత్తుగా ఏమయిందంటే ?
Bandi Sanjay Kumar Latest News : కాంగ్రెస్‌తో కేసీఆర్ ఒప్పందం- కేసులు లేకుండా కలిసి ప్రయాణం- బండి సంజయ్ సంచలన ఆరోపణలు
కాంగ్రెస్‌తో కేసీఆర్ ఒప్పందం- కేసులు లేకుండా కలిసి ప్రయాణం- బండి సంజయ్ సంచలన ఆరోపణలు
Kavitha: రెండు మూడేళ్లలో అధికారంలోకి బీఆర్ఎస్ - కవిత కీలక వ్యాఖ్యలు
రెండు మూడేళ్లలో అధికారంలోకి బీఆర్ఎస్ - కవిత కీలక వ్యాఖ్యలు
YS Jagan Tour News: జగన్ టూర్‌లో మెరిసిన ధర్మాన- తత్వం బోధపడిందంటున్న వైసీపీ నేతలు 
జగన్ టూర్‌లో మెరిసిన ధర్మాన- తత్వం బోధపడిందంటున్న వైసీపీ నేతలు
BRS And BJP:  బీజేపీపై విమర్శలకు బీఆర్ఎస్ దూరం - ఎందుకీ మౌనం ?
బీజేపీపై విమర్శలకు బీఆర్ఎస్ దూరం - ఎందుకీ మౌనం ?
Modi And Pawan: పవన్ హిమాలయాలకు వెళ్తున్నారా - మోడీ ప్రశ్నకు పవన్ జవాబు ఏంటంటే ?
పవన్ హిమాలయాలకు వెళ్తున్నారా - మోడీ ప్రశ్నకు పవన్ జవాబు ఏంటంటే ?
Embed widget