వీడియో: కళ్లు మొబైల్ వైపు, కాళ్లు ప్రమాదం వైపు, ఫోన్ చూస్తూ మెట్రో రైల్వే ట్రాక్‌పై పడ్డాడు
ఒకప్పుడు సరిగా నడవకపోతే కళ్లు నెత్తి మీద పెట్టుకున్నావా అనేవారు. కానీ, ఇప్పుడు కళ్లు మొబైల్ మీద పెట్టావా అంటున్నారు. కారణం.. ఇలాంటి ఘటనలే.
కొందరు ఫోన్ చూస్తూ.. మైమరచిపోతారు. ఎక్కడ ఉన్నారో.. ఏం చేస్తు్న్నారో కూడా మరిచిపోతారు. కాళ్లకు దారి చూపాల్సిన కళ్లను.. మొబైల్‌పై పెడతారు. పాపం.. కాళ్లు మాత్రం ఏం చేస్తాయి. ఎటు కదిలే అటు వెళ్తాయి. చివరికి ప్రమాదంలోకి నెట్టేస్తాయి. ఈ యువకుడికి అదే జరిగింది. మెట్రో రైల్ స్టేషన్‌లో మొబైల్ ఫోన్ చూస్తూ.. ప్లాట్ ఫామ్ మీద నుంచి ట్రాక్ మీద పడ్డాడు. ఈ ఘటన దేశ రాజధాని నగరం ఢిల్లీలో చోటుచేసుకుంది.
58 ఏళ్ల శైలేంద్ర మెహతా.. సహదరా మెట్రో రైల్వేస్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ మొబైల్ ఫోన్‌లో మెసేజ్‌లు చదువుతూ.. ప్లాట్‌ఫాం మీద ఉన్న సంగతి మరిచిపోయాడు. దీంతో అతడి అడుగు అదుపు తప్పింది. ప్లాట్‌ఫాం మీద నుంచి ట్రాక్ వైపు పడింది. అంతే.. అక్కడి నుంచి నేరుగా మెట్రో ట్రాక్ మీద పడిపోయాడు. లక్కీగా ఆ సమయానికి అటుగా మెట్రో రైలు రాలేదు కాబట్టి సరిపోయింది. అదే సమయానికి అవతలి వైపు ప్లాట్‌ఫాం మీద ఉన్న సీఆర్‌పీఎఫ్ జవాన్లలో ఒకరు ఇది గమనించగానే.. ట్రాక్ మీదకు దూకి మెహతాను రక్షించాడు. ఈ ఘటనలో బాధితుడికి స్వల్ప గాయాలైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై CISF హెడ్ క్వార్టర్స్ ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. సీఐఎస్ఎఫ్ QRT టీమ్‌కు చెందిన కానిస్టేబుల్ రొదశ్ చంద్ర వెంటనే స్పందించి.. మెట్రో రైలు వచ్చే లోపు బాధితుడిని రక్షించాడని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Also Read: చనిపోయినా వదలరు.. మూడేళ్ల తర్వాత సమాధుల నుంచి శవాలను బయటకు తీసి.. అరాచకం కాదు, ఆచారం
CISF పోస్ట్ చేసిన ఆ వీడియోను ఇక్కడ చూడండి:
A passenger namely Mr. Shailender Mehata, R/O Shadhara, slipped and fell down on the metro track @ Shahdara Metro Station, Delhi. Alert CISF personnel promptly acted and helped him out. #PROTECTIONandSECURITY #SavingLives@PMOIndia @HMOIndia @MoHUA_India pic.twitter.com/Rx2fkwe3Lh
— CISF (@CISFHQrs) February 5, 2022
Also Read: మీరు మారరా? చైనీసే కాదు.. ఈ దేశస్తులూ గబ్బిలాలు తినడం ఆపలేదు.. ఎందుకు తింటున్నారో తెలిస్తే షాకే!
Also Read: తలనొప్పని హాస్పిటల్‌కు వెళ్తే.. తలలో తూటా కనిపించింది.. 20 ఏళ్లుగా బుర్రలోనే బుల్లెట్!