అన్వేషించండి

Summer Food: శరీరాన్ని చల్లబరిచే మజ్జిగ చారు రెసిపీ, అప్పట్లో అమ్మమ్మల ఫేవరేట్

మజ్జిగ చారు ఒక్కసారి తినడం మొదలుపెట్టారో, వేసవిలో రోజూ తినాలనిపిస్తుంది.

వేసవిలో స్పెషల్ వంటకం మజ్జిగచారు. గ్రామాల్లో ఇప్పటికీ వేసవి వస్తే కచ్చితంగా ఈ వంటకం కనిపిస్తుంది. దానికి కారణం రుచే కాదు, అది చేసే మేలు కూడా. వేసవి తాపాన్ని తీర్చి, వడదెబ్బ కొట్టకుండా చూస్తుంది, అందుకే ఎండల్లో పొలం పనులు చేసేవారు రసం కన్నా మజ్జిగ చారుకే ప్రాధాన్యతనిచ్చేవారు. ఇప్పుడు కాలం మారింది, పట్టణాల పరిధి పెరిగింది. మజ్జిగచారుని చేసుకునే వారి సంఖ్య తగ్గింది. దీన్ని తయారుచేయడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. కేవలం పదినిమిషాల్లో తయారైపోతుంది. వేసవిలో పెద్దలకు, పిల్లలకు దీన్ని తినిపిస్తే త్వరగా వడదెబ్బ బారిన పడకుండా ఉంటారు. ఎర్రటి ఎండల్లో బయటికి వెళ్లివచ్చిన వారు మజ్జిగచారుతో అన్నాన్ని ముగిస్తే వారిలో చెమటద్వారా బయటికి పోయిన ఎలక్ట్రోలైట్స్ మళ్ళీ శరీరంలో చేరుతాయి. డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడే అద్భుత శక్తి దీనికుంది. కాబట్టి ఇదెలా చేయాలో తెలుసుకోండి. 

కావాల్సిన పదార్థాలు
మజ్జిగ - రెండు కప్పులు
ఉల్లి తరుగు - అరకప్పు
పచ్చిమిర్చి తరుగు - అర స్పూను (కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు)
ఉప్పు  - రుచికి సరిపడా

పోపు కోసం
పసుపు - అర టీస్పూను
ఎండు మిర్చి - రెండు
ఆవాలు - అరటీస్పూను
జీలకర్ర - అరటీస్పూను
కరివేపాకు - గుప్పెడు
కొత్తిమీర తరుగు -  కొద్దిగా
నూనె - ఒక టీస్పూను

తయారీ ఇలా
ఒక గిన్నెలో మజ్జిగ చేసి పోసుకోవాలి. అందులో ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ పై చిన్న కళాయి పెట్టాలి. అది వేడెక్కాక ఒక  స్పూను నూనె వేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు, పసుపు వేసి చిటపటలాడించాలి. ఆ పోపును మజ్జిగ మిశ్రమంలో కలిపేయాలి. పైన కొత్తి మీర తరుగును చల్లుకోవాలి. అంతే మజ్జిగ చారు సిద్ధమైనట్టే. 

అందానికి కూడా...
అన్నట్టు మజ్జిగ చారు ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యానికి కూడా అవసరం. పెరుగు, పాలల్లో ఉండే పోషకాలతో పాటూ ఇతర పోషకాలు కూడా దీన్నుండి లభిస్తాయి. చర్మ ఆరోగ్యాన్ని ఇది కాపాడుతుంది. చుండ్రుని తగ్గిస్తుంది కూడా. వేసవిలో రోగినిరోధక శక్తిని పెంచే దివ్యౌషధం మజ్జిగ చారు. కాల్ఫియం, పొటాషియం, విటమిన్ బి12, మెగ్నిషియం వంటివన్నీ ఇందులో నిండుగా ఉంటాయి. జీర్ణ సమస్యలేవీ దీని వల్ల రావు. 

Also read: జున్ను వయసును దాచేస్తుంది, అప్పుడప్పుడు తినాల్సిందే

Also read: అలాంటివారికి గుండెపోటు వస్తే బతికే ఛాన్స్ చాలా తక్కువ, కొత్త అధ్యయన ఫలితం

టాప్ హెడ్ లైన్స్

10K Step Count : రోజూ 10,000 అడుగులు నడవకపోతే ఆరోగ్యానికి మంచిది కాదా? ఎవరు ఎంత నడిస్తే మంచిది? 5 ఏళ్ల నుంచి 60 ఏళ్లు
రోజూ 10,000 అడుగులు నడవకపోతే ఆరోగ్యానికి మంచిది కాదా? ఎవరు ఎంత నడిస్తే మంచిది? 5 ఏళ్ల నుంచి 60 ఏళ్లు
Makhana Benefits : రోజూ మఖానా తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే.. డైట్‌లో ఇలా చేర్చుకోండి
రోజూ మఖానా తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే.. డైట్‌లో ఇలా చేర్చుకోండి
Weight Loss Recipe : బరువు తగ్గాలనుకునేవారి నోరూరించే టేస్టీ రెసిపీ.. పనీర్, వెజిటెబుల్స్​తో ఈ రైస్ ట్రై చేయండి
బరువు తగ్గాలనుకునేవారి నోరూరించే టేస్టీ రెసిపీ.. పనీర్, వెజిటెబుల్స్​తో ఈ రైస్ ట్రై చేయండి
Scalp Care Tips : చుండ్రు, జిడ్డు తగ్గడం లేదా? స్కాల్ప్ శుభ్రంగా ఉంచుకోవడానికి తలస్నానం చేసేప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
చుండ్రు, జిడ్డు తగ్గడం లేదా? స్కాల్ప్ శుభ్రంగా ఉంచుకోవడానికి తలస్నానం చేసేప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP On Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయవద్దు: క్యాడర్‌కు వైసీపీ అధినేత ఆదేశాలు
పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయవద్దు: క్యాడర్‌కు వైసీపీ అధినేత ఆదేశాలు
KA Paul: నేను ఆ పని చేస్తే వారం రోజుల్లోగా రేవంత్ రెడ్డి సీఎం పదవి పోతుంది: కేఏ పాల్ సంచలనం
నేను ఆ పని చేస్తే వారం రోజుల్లోగా రేవంత్ రెడ్డి సీఎం పదవి పోతుంది: కేఏ పాల్ సంచలనం
Makhana Benefits : రోజూ మఖానా తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే.. డైట్‌లో ఇలా చేర్చుకోండి
రోజూ మఖానా తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే.. డైట్‌లో ఇలా చేర్చుకోండి
Pawan Kalyan Divorce: పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకుల ప్రకటన ఇప్పుడు ఎందుకు చేశారంటే !
పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకుల ప్రకటన ఇప్పుడు ఎందుకు చేశారంటే !
Car Engine Problems: మిస్‌ఫైరింగ్ నుంచి 'చెక్ ఇంజిన్' లైట్ వరకు.. ఇంజిన్‌కు ప్రమాదం తెచ్చే 3 సమస్యలు ఇవే
కారు ఇంజిన్‌లో ఈ 3 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. సర్వీస్ సెంటర్‌కు మాత్రమే వెళ్లండి
Weight Loss Recipe : బరువు తగ్గాలనుకునేవారి నోరూరించే టేస్టీ రెసిపీ.. పనీర్, వెజిటెబుల్స్​తో ఈ రైస్ ట్రై చేయండి
బరువు తగ్గాలనుకునేవారి నోరూరించే టేస్టీ రెసిపీ.. పనీర్, వెజిటెబుల్స్​తో ఈ రైస్ ట్రై చేయండి
Congress Politics: 9 సార్లు ఛాన్స్ ఇచ్చిన కాంగ్రెస్.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా చిన్నారెడ్డి! అసలేం జరుగుతోంది?
9 సార్లు ఛాన్స్ ఇచ్చిన కాంగ్రెస్.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా చిన్నారెడ్డి! అసలేం జరుగుతోంది?
Revanth Reddy KTR Personal Attack : కేసీఆర్ సైలెన్స్ - కేటీఆర్‌నే ఇక ప్రత్యర్థిగా రేవంత్ పరిగణిస్తున్నారా?
కేసీఆర్ సైలెన్స్ - కేటీఆర్‌నే ఇక ప్రత్యర్థిగా రేవంత్ పరిగణిస్తున్నారా?
Embed widget