Junnu: జున్ను వయసును దాచేస్తుంది, అప్పుడప్పుడు తినాల్సిందే
జున్నంటే ఎంతో మందికి ఇష్టం, దాన్ని తినని వాళ్లు కూడా ఉన్నారు. తింటే ఎన్ని లాభాలో తెలుసా?
పాల నుంచి తయారయ్యే అద్భుతమైన స్వీట్ జున్ను. దూడను ప్రసవించిన రోజు తల్లి ఆవు లేదా గేదె ఇచ్చే పాలతో జున్నును తయారుచేస్తారు. దీని రుచి మామూలుగా ఉండదు. పంచదార లేదా బెల్లం, యాలకుల పొడి జతచేసి చేసే ఈ వంటకం తెలుగు వారికి హాట్ ఫేవరేట్. రుచిలోనే కాదు,ఆరోగ్యానికి కూడా జున్ను ఎంతో మేలు చేస్తుంది.
రోగినిరోధక శక్తి పెంపు
జున్నులో ఇమ్యునోగ్లోబిన్‌లు సమృద్ధిగా ఉంటాయి, కాబట్టి దీన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇమ్యునోగ్లోబిన్ అనేది సహజమైన టీకా లాంటిది. ఇది శరీరానికి చాలా అవసరం. వ్యాధినిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. ఇది పేగు సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది.
పొట్టను ఆరోగ్యానికి
పొట్టలోనే తిన్న ఆహారం విఛ్చిన్నమై శక్తిగా మారుతుంది. ఆ శక్తి ఇతర అవయవాలకి అందుతుంది. పెద్ద పేగు, చిన్న పేగు కలిసి ఆహారాన్ని శక్తిగా మారుస్తాయి. వ్యర్థాలను మూత్రపిండాల్లోకి పంపిస్తాయి. జున్ను తిన్నప్పుుడు పేగులో కదలికలు చురుగ్గా ఉంటాయి, దీనివల్ల జీర్ణప్రక్రియ మరింత సులభంగా ఉంటుంది. దీని వల్ల పొట్ట కూడా ఆరోగ్యంగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. లేకుంటే పొట్ట పట్టేసినట్టు, ఉబ్బినట్టు, అరగనట్టు ఇలా రకారకాలుగా ఉండొచ్చు.
కండరాలకు ముఖ్యం
ఇతర పాల ఉత్పత్తుల్లాగే జున్ను కూడా కండరాలను పటిష్టం చేస్తుంది. మీ కండలు మరీ సన్నగా ఉన్నట్టయితే జున్ను తింటే మంచి ఫలితం ఉంటుంది. దీని నిండా ప్రొటీన్ ఉంటుంది.
వయసు పెరిగే ప్రక్రియకు చెక్
కొంతమంది చిన్న వయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు. వారిటో ఏజింగ్ ప్రక్రియ ముందే మొదలవ్వడం వల్ల ఇలా జరుగుతుంది. ఏజింగ్ ప్రక్రియను అడ్డుకునే శక్తి జున్నులో ఉంది. చర్మాన్ని మెరిసేలా చేయడం, ముడతలు, నల్లటి వలయాలు, గీతలు కనిపించకుడా నిరోధిస్తుంది. చర్మానికి తేమను కూడా అందిస్తుంది.
జున్నులో కాల్షియం అధికంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల ఎముకలు, దంతాలు బలంగా ఉంటాయి. గర్భిణులు దీన్ని తింటే చాలా మంచిది. శిశువు ఆరోగ్యంగా ఉంటుంది. తల్లిపాలు బాగా వృద్ధి చెందుతాయి. జ్ఞాపకశక్తి ని కూడా పెంచుతుంది కనుక పిల్లలకు తినిపిస్తే మంచిది. విటమిన్ డి లోపం వల్ల ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలు రావచ్చు. అలాంటి వారు జున్ను తింటే మేలు జరుగుతుంది. జున్నులో విటమిన్ డి లభిస్తుంది.
Also read: అలాంటివారికి గుండెపోటు వస్తే బతికే ఛాన్స్ చాలా తక్కువ, కొత్త అధ్యయన ఫలితం
Also read: పెద్దమనసు చాటుకున్న జంట, ఉక్రెయిన్ల కోసం తమ అందమైన దీవిని శరణార్ధుల శిబిరంగా మార్చేశారు