అన్వేషించండి

Longevity Diet: శతాధికుల దీర్ఘాయువు రహస్యం ఇదేనట - ఈ డైట్ పాటిస్తే నూరేళ్ళు బతికేయచ్చు

నూరేళ్ళు పండుగ చేసుకుని ప్రపంచ రికార్డులు సృష్టించే వృద్ధుల దీర్ఘాయువు రహస్యం ఏంటో పరిశోధకులు తెలుసుకున్నారు.

మన తాతమ్మలు, అమ్మమ్మలు కాలం వాళ్ళు కొంతమంది వందేళ్లు ఆయుష్హుతో జీవించి ఉన్నారు. ఇప్పటికీ పలు దేశాలలో శతాధిక వృద్ధురాలు, ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించి ఉన్న వ్యక్తుల గురించి వారి రికార్డుల గురించి వార్తల్లో వింటూనే ఉంటున్నాం. సుమారు నూరేళ్ళ కంటే ఎక్కువ జీవించి ఉన్న అనేక మంది జపాన్, కోస్టారికా, ఇటలీ, గ్రీస్, కాలిఫోర్నియాలో జీవిస్తున్నారు. వాళ్ళు ఉండే  ప్రాంతాన్ని బ్లూ జోన్ అని పిలిచారు. ఇక్కడ ఉన్న వాళ్ళు సుమారు సెంచరీ కొట్టకుండ ఉండరు. ఆన్ని సంవత్సరాలు ఎటువంటి సమస్యలు లేకుండా జీవించి ఉండటానికి కారణాలని పరిశోధకులు తెలుసుకున్నారు. వారి జీవన విధానాలు మాత్రమే కాదు ఆహారం వల్ల అన్నేళ్ళు జీవించగలుగుతున్నారు. 11 ఆహార నియమాలు పాటించడం వల్లే బ్లూ జోన్ ప్రజలు ఎక్కువ కాలం జీవించగలుగుతున్నారు. అవి ఏంటో తెలుసా?

మొక్కల ఆధారిత ఆహారం

ఆహారంలో సుమారు 95 నుంచి వంద శాతం వరకు వాళ్ళు తీసుకునే పదార్థాలు మొక్కల ఆధారితమైనవి. బచ్చలికూర, కాలే, బీట్ రూట్, టర్నిప్, కొల్లార్డ్స్ వంటి ఆకుకూరలు ఉత్తమమైన దీర్ఘాయువునిచ్చే ఆహారాలు. కాలానుగుణ పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ గింజలు కూడా తీసుకుంటారు. వెన్నకి బదులుగా ఆలివ్ నూనె ఎంచుకుంటారు.

ఎప్పుడో ఒకసారి మాంసం

మనలో కొంతమందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. కానీ దీర్ఘాయువులు మాత్రం మాంసం ఎప్పుడో ఒకసారి మాత్రమే తింటారు. కాలిఫోర్నియాలోని లోమా లిండాలో నివసిస్తున్న శాఖాహారుల ఆహారపు అలవాట్లు పరిశోధకులు తెలుసుకున్నారు. వాళ్ళు మాంసం తినే వారి కంటే ఎనిమిది సంవత్సరాలు వరకు ఎక్కువ జీవించే అవకాశం ఉంది. మాంసానికి బదులుగా వాళ్ళు  టోఫుని ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు.

అప్పుడప్పుడు చేపలు

బ్లూ జోనర్ వాళ్ళు చేపలు తింటారు. కానీ అది కూడా అప్పుడప్పుడు మాత్రమే. శతాధిక వృద్ధులు వారానికి మూడు చిన్న సేర్విన్గ్స్ చేపలు తింటే సరిపోతుంది. సార్డినెస్ వంటి చిన్న చవకైన చేపలు తినేందుకు ఎంచుకుంటారు. ఇవి పాదరసం, ఇతర రసాయనాలకి తక్కువ గురి అవుతాయి.

పాల ఉత్పత్తులకి దూరం

బ్లూ జోనర్ వాళ్ళు డైరీ ఉత్పత్తులకి దూరంగా ఉంటారు. ఆవు పాలు రొమ్ము, ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని కలిగి ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. అందుకే వాటికి దూరంగా ఉంటారు. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే మేక, గొర్రె పాల ఉత్పత్తులు ఎంచుకుంటారు.

గుడ్లు తినరు

ఎక్కువ కాలం జీవించడానికి గుడ్లు తినాల్సిన అవసరం లేదని అంటారు. ఒకవేళ తినాల్సి వస్తే వారానికి మూడు కంటే ఎక్కువ తీసుకోరు. తృణధాన్యాలు, మొక్కల ఆధారిత వంటకానికి ఒక గుడ్డు జత చేసుకుని తీసుకుంటారు. గుండె, రక్త ప్రసరణ సమస్యలు, మధుమేహం ఉన్న వాళ్లయితే గుడ్లు పూర్తిగా విస్మరిస్తారు.

బీన్స్

కాయధాన్యాలు వంటి బీన్స్ ఆహారంలో ఉండేలా చూసుకుంటారు. బ్లాక్ బీన్స్, చిక్ పీస్, వైట్ బీన్స్ తీసుకుంటారు. ప్రతిరోజూ కనీసం అరకప్పు వండిన బీన్స్ తినాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. ఫైబర్, ప్రోటీన్ సమృద్ధిగా ఉండటమే కాకుండా గుండెకి మేలు చేసే ఆహారాలలో ఒకటి ఇవి.

చక్కెర తగ్గించాలి

చక్కెరని పూర్తిగా పక్కన పెట్టేయరు. ప్రతిరోజూ ఏడు టీ స్పూన్ల చక్కెర కంటే ఎక్కువ తినకూడదని అనుకుంటారు. ప్రత్యేక సందర్భాలలో స్వీట్లు, కుకీలు, కేక్ లు ఇష్టంగా తీసుకుంటారు.

నట్స్

చిరుతిండిగా ఆరోగ్యకరమైన నాట్స్ ఎంచుకుంటారు. బాదం, వేరుశెనగ, బ్రెజిల్ నట్స్, జీడిపప్పు, వాల్ నట్స్ తింటారు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. రోజుకి గరిష్టంగా రెండు చిన్న గుప్పెళ్ళ నట్స్ తీసుకుంటారు.

బ్రెడ్ ముట్టుకోరు

ప్రాసెస్ చేసిన బ్రెడ్ కి చాలా దూరంగా ఉంటారు. తృణధాన్యాలతో చేసిన వాటిని ఎంచుకుంటారు. తెల్ల పిండితో చేసిన రొట్టెలకి దూరంగా ఉంటారు. ఇవి త్వరగా చక్కెరగా మారి ఇన్సులిన్ స్థాయిలని పెంచుతాయి.

ప్రాసెస్ చేసిన ఆహారం వద్దు

షుగర్ ఫ్రీ, తక్కువ కొవ్వు, ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవడానికి ఇష్టపడరు. బ్లూ జోనర్ వాసులు విటమిన్లు, సప్లిమెంట్లు కంటే తినే ఆహారం ద్వారానే పోషకాలు పొందటానికి చూస్తారు.

ద్రవపదార్థాలు

ఫిజీ డ్రింక్స్ కి దూరంగా ఉండాలి. రోజుకి కనీసం ఏడు గ్లాసుల నీటిని తాగుతారు. రెడ్ వైన్ మితంగా తీసుకుంటారు. ఆకుపచ్చ లేదా రోజ్మేరీ, సేజ్ వంటి టీలు ఎంచుకుంటారు.  

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: పాలు, తేనె కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమా?

టాప్ హెడ్ లైన్స్

Saddula Bathukamma Naivedyam : సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి
సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి
Fenugreek Water 21 Days : 21 రోజులు మెంతుల నీరు తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే
21 రోజులు మెంతుల నీరు తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే
Infantile Epilepsy : శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
Dondakaya Pachadi : దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే
దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
AP Cabinet Decisions: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం స్పష్టత..! ఏ క్షణమైనా నోటిఫికేషన్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం స్పష్టత..! ఏ క్షణమైనా నోటిఫికేషన్
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
Alias Rukmini Heroine: 'అలియాస్ రుక్మిణి'లో హీరోయిన్ ఈ అమ్మాయే... నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఆఫియా సయ్యద్
'అలియాస్ రుక్మిణి'లో హీరోయిన్ ఈ అమ్మాయే... నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఆఫియా సయ్యద్
Hyderabad Crime News: చెవులు కుట్టించేందుకు వెళితే రెండేళ్ల పాప మృతి- జీడిమెట్లలో విషాదం
చెవులు కుట్టించేందుకు వెళితే రెండేళ్ల పాప మృతి- జీడిమెట్లలో విషాదం
Embed widget