Liver Cirrhosis : కాలేయ సిరోసిస్‌తో క్యాన్సర్ ప్రమాదం.. ఏ దశలో రోగి చనిపోయే ప్రమాదం ఉందో తెలుసా?
Cirrhosis Cancer : కాలేయ సమస్యలపై కొందరికి అవగాహన ఉంటుంది కానీ.. క్యాన్సర్‌కు కారకమయ్యే లివర్ సిరోసిస్ గురించి ఎక్కువమందికి తెలియదు. ఇది ఎందుకు వస్తుందో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూసేద్దాం.

Liver Cirrhosis and Its Stages : లివర్ మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది రక్తాన్ని ఫిల్టర్ చేయడమే కాకుండా.. జీవక్రియ, జీర్ణక్రియ, నిర్విషీకరణ వంటి అనేక పనులను కూడా చేస్తుంది. అయితే మారుతున్న జీవనశైలి కారణంగా కాలేయంపై నెగిటివ్ ప్రబావం ఏర్పడుతుంది. వాటిలో కాలేయ సిర్రోసిస్ ఒకటి. కాలేయానికి నిరంతరం నష్టం జరిగినప్పుడు.. అది నెమ్మదిగా దాని ఆరోగ్యకరమైన కణాలను కోల్పోతుంది. వాటి స్థానంలో మచ్చ కణజాలం ఏర్పడుతుంది. చాలామంది తెలియక దీనిని తేలికగా తీసుకుంటారు. కానీ తరువాత ఇది చాలా సమస్యలను కలిగిస్తుంది. కాలేయ సిర్రోసిస్ ఎంత ప్రమాదకరమో, ఏ దశలో ఇది క్యాన్సర్గా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కాలేయ సిర్రోసిస్ ఎందుకంత ప్రమాదకరం?
కాలేయ సిర్రోసిస్ తేలికగా తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త. ఎందుకంటే కాలేయ సిర్రోసిస్ ఒక దీర్ఘకాలిక వ్యాధి. అంటే ఇది చాలా కాలం పాటు కొనసాగుతూ.. నెమ్మదిగా పెరుగుతుంది. ప్రారంభంలోనే కాలేయం 20 నుంచి 30 శాతం దెబ్బతింటుంది. ఈ సమయంలో మనకు ఎటువంటి సమస్య కనిపించదు. కానీ పెరిగేకొద్దీ దాని అనేక లక్షణాలు కనిపిస్తాయి. అలసట, బలహీనత, ఆకలి తగ్గడం, పొత్తికడుపులో వాపు, పదేపదే ఇన్ఫెక్షన్లు సోకడం, వాంతులు లేదా రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో చికిత్స చేయకపోతే.. అది ప్రాణాంతకం అవుతుంది. అనేక పరిశోధనలు, అమెరికన్ లివర్ ఫౌండేషన్ నివేదికలు కాలేయ క్యాన్సర్ రోగులలో దాదాపు 80 నుంచి 90 శాతం మందికి సిర్రోసిస్ ఉందని చూపిస్తున్నాయి.
ఎప్పుడు తీవ్రంగా మారుతుందంటే..
కాలేయ సిర్రోసిస్ నాలుగు దశలుగా విభజిస్తారు. ప్రతి దశలో క్యాన్సర్ ప్రమాదం భిన్నంగా ఉంటుంది. మొదటి దశ కాంపెన్సేటెడ్ సిర్రోసిస్. రెండవది కాంపెన్సేటెడ్ సిర్రోసిస్ విత్ వేరిసెస్. ఇందులో సిరలపై ఒత్తిడి పెరుగుతుంది. క్యాన్సర్ ప్రమాదం మునుపటి కంటే పెరుగుతుంది. మూడవ దశ డి-కాంపెన్సేటెడ్ సిర్రోసిస్. ఇది కాలేయం పని చేయడంలో ఇబ్బంది పెడుతుంది. తరువాత నాల్గవ దశ. ఎండ్-స్టేజ్ సిర్రోసిస్ వస్తుంది. ఇందులో కాలేయం పూర్తిగా పనిచేయడం మానేస్తుంది. రోగి బతకడం కష్టం అవుతుంది.
ఈ నాలుగు దశలో క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వైద్యుల పరిశోధన ప్రకారం.. ప్రతి సంవత్సరం 1 నుంచి 8 శాతం మంది సిర్రోసిస్ రోగులలో కాలేయ క్యాన్సర్ అభివృద్ధి చెందినట్లు గుర్తించారు. ఈ సిర్రోసిస్ క్యాన్సర్.. హెపటైటిస్ బి లేదా సి కంటే మరింత ప్రమాదకరంగా ఉంటుందని.. అందుకే రోగి బతకడం కష్టం అవుతుందని చెప్తున్నారు. కాలేయ సిర్రోసిస్ అనేది చిన్న వ్యాధి కాదు. ఇది నెమ్మదిగా పెరిగి చివరికి కాలేయ క్యాన్సర్‌గా మారి ప్రాణాలకు ప్రమాదం వాటిల్లుతుంది. కాబట్టి ముందుగానే గుర్తించి చికిత్స తీసుకునేందుకు ప్రయత్నించాలని అంటున్నారు నిపుణులు.






















