అన్వేషించండి

Leftover Rice Dosa : రాత్రి అన్నం మిగిలిపోయిందా? పారేయకండి.. ఉదయాన్నే ఇలా దోశలు వేసుకోండి

Leftover Rice Recipe : రాత్రి అన్నం మిగిలిపోయిందా? అయితే దానిని పారేయనవసరం లేదు.. చక్కగా ఉదయాన్నే బ్రేక్​ఫాస్ట్​గా దోశలు వేసుకుని తినేయవచ్చు. ఎలా చేయాలో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మిగిలిన అన్నంతో రుచికరమైన, మెత్తటి దోశలు తయారుచేయవచ్చు.
  • బియ్యం, అటుకులు నానబెట్టి అన్నం, పెరుగుతో మెత్తగా రుబ్బాలి.
  • రుచి, మెత్తదనం కోసం పిండిని కనీసం ఆరు గంటలు పులియబెట్టాలి.
  • వేడి దోశలు చట్నీతో ఆస్వాదించి అన్నం వృథాను నివారించండి.

Soft and Crispy Dosas With Leftover Rice : మీకు చద్దన్నం తినడం ఇష్టం లేదా? అలాగే ఉదయాన్నే మిగిలిన రైస్ తినే మూడ్ లేదా అయితే మీరు రాత్రి అన్నాన్ని ఉదయం పారేయాల్సిన అవసరం లేదు. దానితోనే చక్కగా.. టేస్టీగా, మెత్తగా ఉండే దోశలు తయారు చేసుకోవచ్చు. రాత్రి మిగిలిన అన్నం ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కి కానీ, ఉదయం వండిన అన్నం సాయంత్రం స్నాక్‌గా కానీ దోశలు చేసుకోవచ్చు. అసలు మిగిలిపోయిన అన్నంతో దోశలు ఎలా తయారు చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

మిగిలిపోయిన అన్నం - 1 కప్పు

బియ్యం - 1 కప్పు

అటుకులు - అర కప్పు

పెరుగు - అర కప్పు

ఉప్పు - తగినంత

నీరు - అవసరమైనంత

నూనె - దోశలు వేసేందుకు

Also Read : కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే

తయారీ విధానం

ముందుగా బియ్యాన్ని, అటుకులను శుభ్రంగా కడిగి 4 నుంచి 5 గంటలు నీటిలో నానబెట్టుకోవాలి. తర్వాత నానబెట్టిన బియ్యం, అటుకులతో పాటు మిగిలిపోయిన అన్నం, పెరుగు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని అవసరమైనంత నీరు పోసి దోశ పిండిలా కలుపుకోవాలి. ఉప్పు వేసి కనీసం 6 గంటలు లేదా వీలైతే రాత్రంతా ఫెర్మెంట్ చేసుకోవాలి.

ఫెర్మెంట్ అయిన తర్వాత పిండిని ఒకసారి బాగా కలిపి.. దోశ పెనంపై కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తర్వాత ఒక గరిటె పిండిని తీసుకుని పలుచగా దోశలా పరిచి.. చుట్టూ కొద్దిగా నూనె వేయాలి. దోశ కింద భాగం బంగారు రంగులోకి మారి, అంచులు క్రిస్పీగా కనిపించినప్పుడు తిప్పి మరోవైపు కూడా కాల్చుకోవాలి. అంతే.. వేడి వేడి అన్నం దోశలు రెడీ.

Also Read : ఆనియన్ సమోసా రెసిపీ.. ఇంట్లోనే క్రిస్పీగా, టేస్టీగా ఇలా చేసుకోండి

సమయం తక్కువగా ఉంటే పిండిని ఎక్కువసేపు ఫెర్మెంట్ చేయకుండా కూడా దోశలు వేసుకోవచ్చు. అయితే ఫెర్మెంట్ చేసిన పిండితో వచ్చే రుచి, టెక్స్చర్ కొంత భిన్నంగా ఉంటుంది. ఫెర్మెంట్ చేసినప్పుడు దోశలు మరింత మెత్తగా రావడంతో పాటు కాస్త పుల్లటి రుచితో టేస్టీగా వస్తాయి. 

ఈ దోశలను మీరు కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, అల్లం చట్నీ లేదా టమాటా చట్నీతో ఆస్వాదిస్తే రుచి రెట్టింపు అవుతుంది. స్పైసీగా ఇష్టపడేవారు కారం చట్నీతో కూడా ట్రై చేయొచ్చు. అయితే మిగిలిన అన్నం వాడేప్పుడు అది పాడైనది కాకుండా చూసుకోవాలి. ఫ్రెష్​గా ఉండే అన్నాన్నే దోశల కోసం ఉపయోగించాలి.

మిగిలిన అన్నం ఉంటే చిత్రాన్నం, ఫ్రైడ్ రైస్, పులిహోర తాళింపు వేసుకుని కూడా చేసుకోవచ్చు. కానీ ఉదయాన్నే అన్నం తినాలని లేనప్పుడు.. అలాగే అన్నం మిగిలిపోయిన సందర్భాల్లో అన్నం పడేయకుండా ఉపయోగించుకునేందుకు ఈ దోశలు బెస్ట్ ఆప్షన్. కాబట్టి మీరు కూడా ఇంట్లో ఈ దోశలు ట్రై చేసేయండి.

Also Read : బెల్లం పాకంతో కొబ్బరి లడ్డూలు.. ఆంధ్రా స్టైల్‌లో ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

White Chicken : నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
Beer vs Breezer : బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
Sesame Seeds Benefits : నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
Andhra Style Tomato Pappu : ఆంధ్రా స్టైల్ టమాటా పప్పు రెసిపీ.. రుచి పెంచే టిప్స్ ఇవే
ఆంధ్రా స్టైల్ టమాటా పప్పు రెసిపీ.. రుచి పెంచే టిప్స్ ఇవే
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Chandrababu Vijay River Interlinking: చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
Embed widget