అన్వేషించండి

Coconut Laddu Recipe : బెల్లం పాకంతో కొబ్బరి లడ్డూలు.. ఆంధ్రా స్టైల్‌లో ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది

Jaggery Coconut Laddus :స్వీట్స్ అంటే ఇష్టమా? అయితే మీరు చాలా ఈజీగా ఇంట్లో ఏదైనా చేసుకోవాలనుకుంటే బెల్లంతో కొబ్బరి లడ్డూలు చేసుకోవచ్చు. ఓల్డ్ స్టైల్లో వీటిని రుచిగా ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తాజా కొబ్బరిని తేమ తగ్గేలా వేడిచేసి పక్కన పెట్టాలి.
  • బెల్లం పాకం మలినాలు తీసి, ఉండపాకం వచ్చేవరకు ఉడికించాలి.
  • తరువాత కొబ్బరి, యాలకులు, నెయ్యి కలిపి చిక్కబడనివ్వాలి.
  • గోరువెచ్చగా ఉండగా, చిన్న ఉండలుగా లడ్డూలు చుట్టుకోవాలి.

Coconut Laddus with Jaggery Recipe : ఇంట్లో స్వీట్ చేసుకోవాలంటే ఎప్పుడూ పంచదారే ఉపయోగించాల్సిన అవసరం లేదు. బెల్లంతో కూడా ఎన్నో రెసిపీలు చేసుకోవచ్చు. చాలా సింపుల్​గా, త్వరగా, రుచిగా తినాలనుకుంటే కొబ్బరితో, బెల్లం పాకంతో చక్కగా లడ్డూలు చేసుకోవచ్చు. తాజాగా తురిమిన కొబ్బరిని బెల్లం పాకంతో కలిపి బయట కొద్దిగా గట్టిగా.. లోపల మెత్తగా ఉండే రుచికరమైన లడ్డూలు చేసుకోవచ్చు. ఓల్డ్ స్టైల్​లో కొబ్బరి లడ్డూలను ఎలా చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు

కొబ్బరి తురుము - 2 కప్పులు (తాజాగా ఉండేది)

బెల్లం - 1 కప్పు (తురుము)

యాలకుల పొడి - అర టీస్పూన్

నెయ్యి - 1 టీస్పూన్

జీడిపప్పు - 10 పలుకులు

నీరు - పావు కప్పు

Also Read : కస్టర్డ్ పౌడర్, షుగర్ లేకుండా ఫ్రూట్ కస్టర్డ్.. ఇలా చేస్తే టేస్టీగా, హెల్తీగా ఉంటుంది.. రెసిపీ ఇదే

తయారీ విధానం

ముందుగా తాజా కొబ్బరికాయను పగలగొట్టి.. పై తొక్కను తీసి మెత్తగా తురుముకోవాలి. ఇప్పుడు మందపాటి అడుగు ఉన్న పాన్‌ను స్టవ్‌పై పెట్టి కొబ్బరి తురుము వేసుకోవాలి. నీళ్లు లేదా నూనె వేయకుండా తక్కువ మంటపై కొబ్బరిని రెండు మూడు నిమిషాలు కలుపుతూ వేడి చేయాలి. మంచి అరోమా వస్తుంది. కొబ్బరి నుంచి వచ్చే అదనపు తేమ కొద్దిగా తగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొబ్బరిని మరీ ఎక్కువగా వేయించకండి. అలా చేస్తే లడ్డూలు గట్టిగా మారవచ్చు. అలా అని మాడ్చకూడదు కూడా. 

తర్వాత మరో పాన్‌లో బెల్లం, పావు కప్పు నీరు వేసి స్టవ్‌పై పెట్టాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మలినాలు ఉంటే వడకట్టి మళ్లీ పాన్‌లో పోయాలి. ఈ సమయంలోనే మీ రుచికి తగ్గట్టు బెల్లం మరింత పెంచుకోవచ్చు. ఇప్పుడు బెల్లం పాకాన్ని మీడియం మంటపై ఉడికించాలి. పాకం కొద్దిగా చిక్కబడే వరకు కలుపుతూ ఉండాలి. లడ్డూలు బాగా పట్టాలంటే బెల్లం పాకం సరైన దశకు రావడం చాలా ముఖ్యం.

Also Read : ఇంట్లోనే మైసూర్ పాక్ ఇలా చేసుకోండి.. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా టేస్టీగా ఉంటుంది, రెసిపీ ఇదే

పాకం చిక్కబడిన తర్వాత కొద్దిగా పాకాన్ని నీటిలో వేసి చూడాలి. చేతితో తాకగలిగేంత చల్లారిన తర్వాత దాన్ని వేళ్ల మధ్య నలిపితే మెత్తని ఉండలా ఏర్పడితే పాకం సిద్ధమైనట్టే. అలా అని పాకం మరీ గట్టిగా కాకూడదు. ఇప్పుడు బెల్లం పాకంలో ముందుగా వేడి చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము వేసి బాగా కలపాలి. యాలకుల పొడి, నెయ్యి వేసి కలపాలి. జీడిపప్పు పూర్తి ఆప్షనల్. మీకు లడ్డూ రుచి పెంచుకునేందుకు జీడిపప్పు వేసుకోవచ్చు. ఈ మిశ్రమం పాన్‌కు అంటుకోకుండా కొద్దిసేపు తక్కువ మంటపై కలుపుతూ ఉండాలి.

మిశ్రమం కొద్దిగా చిక్కగా మారి పాన్‌ను వదిలే దశకు వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. పూర్తిగా చల్లారనివ్వకుండా చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని, గోరువెచ్చగా ఉన్నప్పుడే చిన్న చిన్న ముద్దలు తీసుకుని లడ్డూలుగా చుట్టుకోవాలి. అంతే.. ఆంధ్రా స్టైల్ బెల్లం కొబ్బరి లడ్డూలు రెడీ. కొబ్బరి, బెల్లం పాకంతో వచ్చే రుచి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోగలిగే ఈ రెసిపీని మీరు కూడా కచ్చితంగా ట్రై చేయండి.

Also Read : బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి రెసిపీ.. వేడి వేడి అన్నంలో కలిపి తింటే అదిరిపోతుంది

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lower Back Pain : ప్రపంచాన్ని వేధిస్తున్న నడుము నొప్పి.. 2050 నాటికి బాధితులు 843 మిలియన్లకు చేరే అవకాశం!
ప్రపంచాన్ని వేధిస్తున్న నడుము నొప్పి.. 2050 నాటికి బాధితులు 843 మిలియన్లకు చేరే అవకాశం!
Colorectal Cancer in Men : 50 ఏళ్లలోపు పురుషుల్లోనూ కొలొరెక్టల్ క్యాన్సర్.. మల విసర్జనలో ఈ మార్పులు కనిపిస్తే జాగ్రత్త అంటోన్న వైద్యులు
50 ఏళ్లలోపు పురుషుల్లోనూ కొలొరెక్టల్ క్యాన్సర్.. మల విసర్జనలో ఈ మార్పులు కనిపిస్తే జాగ్రత్త అంటోన్న వైద్యులు
Hair Care Tips : జుట్టు రాలిపోతుందా? పలుచబడుతోందా? హెల్తీగా ఉండాలంటే రోజూ ఈ 5 తప్పులు చేయకండి
జుట్టు రాలిపోతుందా? పలుచబడుతోందా? హెల్తీగా ఉండాలంటే రోజూ ఈ 5 తప్పులు చేయకండి
Infertility With STIs : లైంగిక వ్యాధులకు చికిత్స తీసుకోకుంటే పురుషులు, మహిళల్లో సంతానలేమి సమస్య వస్తుందా? డాక్టర్ ఏమంటున్నారంటే..
లైంగిక వ్యాధులకు చికిత్స తీసుకోకుంటే పురుషులు, మహిళల్లో సంతానలేమి సమస్య వస్తుందా? డాక్టర్ ఏమంటున్నారంటే..
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో విషాదం.. ఏపీకి చెందిన BSF జవాన్ మృతి- సీఎం చంద్రబాబు విచారం
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో విషాదం.. ఏపీకి చెందిన BSF జవాన్ మృతి- సీఎం చంద్రబాబు విచారం
Rare Medical Case: వైద్యశాస్త్రంలో అరుదైన ఘటన.. కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన యువకుడు.. గర్భాశయం తొలగించిన డాక్టర్లు
వైద్యశాస్త్రంలో అరుదైన ఘటన.. కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన యువకుడు.. గర్భాశయం తొలగించిన డాక్టర్లు
Vijayasai Reddy Padayatra: జగన్‌కు పోటాపోటీగా విజయసాయిరెడ్డి పాదయాత్ర - వెన్నుపోటు ఆరోపణలతో ఎటాక్- ఏపీ రాజకీయాల్లో కొత్త సెగ!
జగన్‌కు పోటాపోటీగా విజయసాయిరెడ్డి పాదయాత్ర - వెన్నుపోటు ఆరోపణలతో ఎటాక్- ఏపీ రాజకీయాల్లో కొత్త సెగ!
Kadapa BPT Student: ప్రియుడి చేతిలో మోసపోయిన బీపీటీ విద్యార్థిని.. సోదరి పెళ్లి నగలు తాకట్టు పెట్టడంతో ఆత్మహత్య!
ప్రియుడి చేతిలో మోసపోయిన బీపీటీ విద్యార్థిని.. సోదరి పెళ్లి నగలు తాకట్టు పెట్టడంతో ఆత్మహత్య!
Parliament Session: ఈ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం అడుగులు
ఈ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం అడుగులు
అద్దె ఇంట్లో వాస్తు దోషాలు పురోగతికి అడ్డుపడతాయా? అక్కడ నివాసం ఉండే కుటుంబంపై ప్రభావం చూపుతుందా?
అద్దె ఇంట్లో వాస్తు దోషాలు పురోగతికి అడ్డుపడతాయా? అక్కడ నివాసం ఉండే కుటుంబంపై ప్రభావం చూపుతుందా?
Winter Car AC Tips: చలికాలంలో కారు ఏసీని ఎలా వాడాలి? ఈ గుర్తుల అసలైన అర్ధం తెలిస్తే ఎన్నో ప్రయోజనాలు!
కారు ఏసీపై ఈ గుర్తులు గమనించారా? వాటి అర్థాలు తెలిస్తే చలికాలంలోనూ హ్యాపీ జర్నీ!
Lower Back Pain : ప్రపంచాన్ని వేధిస్తున్న నడుము నొప్పి.. 2050 నాటికి బాధితులు 843 మిలియన్లకు చేరే అవకాశం!
ప్రపంచాన్ని వేధిస్తున్న నడుము నొప్పి.. 2050 నాటికి బాధితులు 843 మిలియన్లకు చేరే అవకాశం!
Embed widget