అన్వేషించండి

Mysore Pak Recipe : ఇంట్లోనే మైసూర్ పాక్ ఇలా చేసుకోండి.. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా టేస్టీగా ఉంటుంది, రెసిపీ ఇదే

Easy Mysore Pak Recipe : మీకు స్వీట్స్ అంటే ఇష్టముంటే ఇంట్లోనే ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటే.. రుచికరమైన, త్వరగా చేసుకోగలిగే మైసూర్ పాక్ ట్రై చేయవచ్చు. ఎలా చేయాలో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మైసూర్ పాక్ తయారీకి శనగపిండిని నెయ్యిలో వేయించుకోవాలి.
  • పంచదార పాకంలో ఈ మిశ్రమం నెమ్మదిగా కలిపి ఉడికించాలి.
  • చిక్కబడిన మిశ్రమాన్ని ట్రేలో పోసి చల్లార్చి కట్ చేయాలి.

Soft and Delicious Mysore Pak : మైసూర్ పాక్ సౌత్ ఇండియాలో బాగా ప్రజాదరణ పొందిన స్వీట్స్​లలో ఒకటి. దీని రుచి, ఆకృతి దీనిని ఇతర స్వీట్స్ కంటే ప్రత్యేకంగా ఉంటుంది. మార్కెట్లో లభించే మైసూర్ పాక్‌ను చూస్తే.. దానిని ఇంట్లో చేసుకోవడం కష్టమని అనిపించవచ్చు. కానీ చాలా సింపుల్​గా దీనిని ఇంట్లో తయారు చేసుకోవచ్చు. శనగపిండి, పంచదార, నెయ్యి ఉంటే.. ఇంట్లోనే రుచికరంగా వండుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో.. దానిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. 

కావాల్సిన పదార్థాలు

శనగ పిండి - కప్పు

పంచదార -  కప్పు

నెయ్యి - కప్పు

Also Read : కస్టర్డ్ పౌడర్, షుగర్ లేకుండా ఫ్రూట్ కస్టర్డ్.. ఇలా చేస్తే టేస్టీగా, హెల్తీగా ఉంటుంది.. రెసిపీ ఇదే

తయారీ విధానం

మైసూర్ పాక్ తయారు చేయడానికి.. కప్పు శనగపిండిని తీసుకోండి. ఉండలు లేకుండా ఉండేలా జల్లించుకోవాలి. ఇప్పుడు ఒక పాన్​లో కొద్దిగా నెయ్యి వేసి స్టౌవ్ వెలిగించి దానిపై పెట్టాలి. దానిలో శనగపిండిని వేసి తక్కువ మంట మీద వేయించాలి. అడుగున మాడిపోకుండా కలుపుతూనే ఉండాలి. శనగపిండి పచ్చి వాసన పోయి.. తేలికపాటి సువాసన రావడం వస్తున్నప్పుడు మంటను ఆపేయాలి. శనగపిండి రంగు మరీ ముదురుగా లేనప్పుడు.. కరిగించిన నెయ్యిని కొద్దికొద్దిగా వేస్తూ.. ఉండలు రాకుండా బాగా కలపాలి. బాగా కలిపి ముద్దగా మారిన తర్వాత దానిని పక్కన పెట్టాలి. 

పంచదార పాకం కోసం..

ఇప్పుడు మరొ కడాయి​లో కప్పు పంచదార, కొద్దిగా నీరు కలపండి. మీడియం మంట మీద, నిరంతరం కలుపుతూ ఉడికించండి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత.. పాకాన్ని కొన్ని నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడకనివ్వాలి. మైసూర్ పాక్ కోసం.. పాకం మరీ చిక్కగా ఉండనవసరం లేదు. పాకం సిద్ధమైన తర్వాత.. శనగపిండి, నెయ్యి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసి పంచదార పాకంలో పూర్తిగా కలిసేలా, ఉండలు లేకుండా కలపండి. మిగిలిన నెయ్యిని కొద్దికొద్దిగా కలపండి. కొంత సమయం తర్వాత.. పిండి చిక్కబడటం ప్రారంభిస్తుంది. కడాయి అంచుల నుంచి వేరవుతుంది. అప్పటివరకు కలుపుతూనే ఉండాలి. 

Also Read : ఆంధ్రా స్పెషల్ బెల్లం తాళికలు.. పండుగ రోజుల్లో ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది, వినాయకచవితికి చేసేయండి

ఇప్పుడు ఒక ట్రే లేదా కంచం తీసుకుని.. దానికి కొద్దిగా నెయ్యి రాయాలి. సిద్ధం చేసుకున్న మైసూర్ పాక్ మిశ్రమాన్ని అందులో పోసి.. ఒక చెంచాతో సమానంగా పరచండి. దానిని కాసేపు చల్లారనివ్వండి. దీంతో పాకం కొద్దిగా గట్టిపడుతుంది. అప్పుడు మీకు నచ్చిన షేప్​లలో వాటిని కట్ చేసుకోవచ్చు. అంతే నోరూరించే టేస్టీ మైసూర్ పాక్ రెడీ. మైసూర్ పాక్ మృదువుగా ఉండాలంటే.. దానిని ఎక్కువగా ఉడికించకూడదు. ఎక్కువ సేపు ఉడికిస్తే అది గట్టిగా మారిపోతుంది.

ఇంట్లో తయారుచేసుకున్న ఈ స్వీట్​ని శుభ్రమైన, పొడి, గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు. పండుగలు లేదా ప్రత్యేక సందర్భాలలో అతిథులకు కూడా పెట్టవచ్చు. మీకు శనగపిండితో చేసిన స్వీట్స్ ఇష్టమైతే.. ఇంట్లో తప్పకుండా మైసూర్ పాక్ ట్రై చేయండి.

Also Read : ఉడికించిన శనగలతో నోరూరించే బ్రౌనీ చేసేయండిలా.. సింపుల్, టేస్టీ రెసిపీ ఇదే

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Healthy Skin Diet : ముఖంలో గ్లో రావాలా? సహజమైన మెరుపు కోసం ఈ 5 కూరగాయలు తినండి
ముఖంలో గ్లో రావాలా? సహజమైన మెరుపు కోసం ఈ 5 కూరగాయలు తినండి
Hemorrhoids Risk : యువకుల్లో పెరుగుతోన్న హెమరాయిడ్స్.. ఈ అలవాట్లే మొలలకు ప్రధాన కారణమంటోన్న పరిశోధనలు
యువకుల్లో పెరుగుతోన్న హెమరాయిడ్స్.. ఈ అలవాట్లే మొలలకు ప్రధాన కారణమంటోన్న పరిశోధనలు
Coconut Benefits : కొబ్బరి కేవలం రుచి కోసమే కాదు.. రోజూ తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా? ఇలా తీసుకోండి
కొబ్బరి కేవలం రుచి కోసమే కాదు.. రోజూ తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా? ఇలా తీసుకోండి
Mens Day 2026 Wishes : హ్యాపీ మెన్స్ డే 2026.. మీ జీవితంలోని స్పెషల్ Menకి ఫేస్​బుక్, వాట్సాప్​​లలో ఇలా విషెష్ చెప్పేయండి
హ్యాపీ మెన్స్ డే 2026.. మీ జీవితంలోని స్పెషల్ Menకి ఫేస్​బుక్, వాట్సాప్​​లలో ఇలా విషెష్ చెప్పేయండి
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
YS Avinash Reddy Detained: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
Gautam Gambhir Coach: సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
Embed widget