Onion Samosa : ఆనియన్ సమోసా రెసిపీ.. ఇంట్లోనే క్రిస్పీగా, టేస్టీగా ఇలా చేసుకోండి
Crispy Onion Samosa Recipe : సమోసా అంటే ఇష్టమా? అందులోనూ ఆనియన్ సమోసా అంటే మరీ ఇష్టమా? అయితే దీనిని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. రెసిపీ ఇదే చూసేద్దాం.

- ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మసాలాలతో సమోసా మిశ్రమాన్ని సిద్ధం చేయాలి.
- మిశ్రమాన్ని సమోసా షీట్లలో నింపి, అంచులను జాగ్రత్తగా సీల్ చేయాలి.
- మధ్యస్థ మంటపై వేడి నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
Crispy Onion Samosa : సాయంత్రం టీతో పాటు ఏదైనా క్రిస్పీగా, స్పైసీగా తినాలనిపిస్తే సమోసా మంచి ఆప్షన్. సాధారణ ఆలూ సమోసాకు బదులుగా ఉల్లిపాయలతో తయారు చేసే ఆనియన్ సమోసాను చాలామంది ఇష్టంగా తింటారు. అయితే వీటిని బయటే కాదు ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. బయట దొరికే సమోసాల్లాగే క్రిస్పీగా, టేస్టీగా రావాలంటే ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
సమోసా షీట్లు - 10
ఉల్లిపాయలు - 3
పచ్చిమిర్చి - 2
కొత్తిమీర - కొద్దిగా
కారం - అర టీస్పూన్
ధనియాల పొడి - అర టీస్పూన్
గరం మసాలా - పావు టీస్పూన్
Also Read : ఎగ్ మ్యాగీ రెసిపీ.. ఇలా చేస్తే టేస్టీగా, స్పైసీగా ఉంటుంది.. ఇంట్లోనే చేసుకోండిలా
చాట్ మసాలా - అర టీస్పూన్
ఉప్పు - తగినంత
నిమ్మరసం - 1 టీస్పూన్
కార్న్‌ఫ్లోర్ - 1 టీస్పూన్
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడేంత
ఆనియన్ సమోసా తయారీ విధానం
ముందుగా ఉల్లిపాయలను సన్నగా పొడవుగా తరిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, కారం, ధనియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో కార్న్‌ఫ్లోర్ వేసి కలపాలి. ఉల్లిపాయల నుంచి నీరు ఎక్కువగా బయటకు రాకుండా సమోసా పెట్టే ముందు మాత్రమే ఉప్పు వేయడం మంచిది. నిమ్మరసం కూడా చివర్లో వేసి కలపాలి.
Also Read : గుడ్డు వెల్లుల్లి కారం రెసిపీ.. అన్నంలో కలుపుకుని తింటే అదిరిపోతుంది
ఇప్పుడు ఒక సమోసా షీట్ తీసుకుని కోన్ ఆకారంలో మడవాలి. అందులో సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని ఒకటి నుంచి రెండు స్పూన్ల వరకు పెట్టాలి. షీట్‌ను చక్కగా మడిచి సమోసా ఆకారంలోకి తీసుకురావాలి. చివరి అంచుకు కొద్దిగా మైదా పిండిని నీటితో కలిపి పేస్ట్‌లా చేసి రాస్తే సమోసా తెరుచుకోకుండా ఉంటుంది. ఇలాగే మిగిలిన సమోసాలను కూడా సిద్ధం చేసుకోవాలి.
స్టౌవ్ వెలిగించి కడాయి పెట్టి.. దానిలో వేయించేందకు సరిపడా నూనె పోసి మీడియం మంటపై వేడి చేయాలి. నూనె మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు. సమోసాలను నూనెలో వేసి మీడియం నుంచి తక్కువ మంటపై నెమ్మదిగా వేయించాలి. రెండు వైపులా బంగారు రంగులోకి మారి క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలి. సమోసాలు వేగిన తర్వాత వాటిని టిష్యూపైకి తీసి అదనపు నూనెను తొలగించాలి. అంతే.. వేడి వేడి క్రిస్పీ ఆనియన్ సమోసాలు రెడీ. వీటిని టొమాటో సాస్, పుదీనా చట్నీ లేదా చాయ్‌తో సర్వ్ చేసుకుంటే రుచి అదిరిపోతుంది.
Also Read : నోరూరించే మునగాకు రోటి పచ్చడి.. పల్లీలు వేసి చేస్తే రుచి అదిరిపోతుంది, రెసిపీ ఇదే ఆంధ్రా స్టైల్ రెసిపీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























