Perfect Tea : టీ పర్ఫెక్ట్గా రావాలంటే ముందుగా పాలు వేయాలా? లేదా నీళ్లా? బెస్ట్ టేస్ట్ కోసం ఈ పద్ధతి ట్రై చేయండి
Perfect Tea Recipe : టీ తయారుచేసేటప్పుడు చిన్న పొరపాటు చేసినా దాని రుచి పాడవుతుంది. నీరు, టీ పౌడర్, పాలు, షుగర్ను సరైన క్రమంలో వేస్తే మంచి రుచి, రంగు, సువాసన వస్తుంది.

- ముందుగా నీరు మరిగించి, టీ పొడి మరగనివ్వాలి.
- టీ ఆకులు మరిగాక, గోరువెచ్చని పాలు మాత్రమే కలపాలి.
- పాలు కలిపిన పిదప చక్కెర, మంటను సర్దుబాటు చేయాలి.
Making Tea for Better Taste and Color : ఇండియాలో టీ కేవలం ఒక డ్రింక్ మాత్రమే కాదు. చాలామంది రొటీన్లో ఒక భాగం. ఉదయాన్నే నిద్రలేవగానే లేదా సాయంత్రం సేద తీరడానికి టీ చేసుకుని తాగేవారు కోట్లలో ఉంటారు. టీ రుచి ఎంత బాగుంటే మనసుకు అంత ప్రశాంతత దొరుకుతుందని చెప్తారు ఛాయ్ లవర్స్. టీని తయారు చేసే విధానంలో ఏ చిన్న మార్పు జరిగినా.. అది చప్పగా లేదా మరీ చేదుగా ఉంటుంది. దీనికి కారణం టీ తయారుచేసేటప్పుడు నీళ్లు, పాలు సరైన పద్ధతిలో ఎలా కలపాలో తెలియకపోవడమే.
రుచికోసం ముందుగా ఏమి చేయాలంటే..
టీలో ముందుగా నీళ్లు కలపాలో, పాలు కలపాలో కూడా చాలా మందికి తెలియదు. ఈ చిన్న పొరపాటు టీ మొత్తం రుచిని పాడుచేస్తుంది. అందుకే టీని తయారుచేయడానికి అత్యంత పురాతనమైన పద్ధతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీనిలో భాగంగా ముందుగా నీటిని మరిగించి.. ఆ తర్వాత టీ పౌడర్ వేస్తారు. కావాలనుకుంటే అల్లం, యాలకులను కూడా వేసుకోవచ్చు. టీ పౌడర్ అసలు రంగు, ఘాటు పూర్తిగా వచ్చేలా కొన్ని నిమిషాల పాటు మరగనివ్వాలి. ఇలా చేస్తే టీకి మంచి రుచి అందుతుంది.
Also Read : గ్రీన్ టీ చేదుగా ఉందా? అయితే కాహ్వా గ్రీన్ టీ బెస్ట్ ఆప్షన్.. రోజూ ఒక కప్పు తాగితే ఎన్ని లాభాలో తెలుసా?
పాలు వేసేప్పుడు ఆ తప్పు చేయకండి..
టీ ఆకులు పూర్తిగా మరిగిన తర్వాతే పాలు కలపాలి. ఎప్పుడూ మరుగుతున్న నీటిలోనే పాలు కలపాలి. గోరువెచ్చని పాలు మాత్రమే కలపాలని గుర్తించుకోవాలి. ఎందుకంటే చల్లటి పాలు కలిపితే టీ ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోయి.. దాని రుచి పూర్తిగా తెలియకపోవచ్చు. లేదా విరిగిపోవచ్చు. పాలు కలిపిన తర్వాత.. టీ పౌడర్ సారం బాగా కలిసేలా ఒకటి లేదా రెండు సెకన్లు మళ్లీ మరిగించాలి.
ముందే నీళ్లు ఎందుకు వేయాలంటే..
పాలు పోసి ఆ తర్వాత టీ ఆకులను కలిపితే టీ ఆకుల అసలైన రుచి పూర్తిగా బయటపడదు. అలాగే పాలు నీటి ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. దీనివల్ల టీ ఆకులు తమ రుచిని సరిగ్గా అందించలేవు. ఫలితంగా టీ చప్పగా తయారవుతుంది. అందుకే చాలామంది పాలు కలపడానికి ముందు నీటిని, టీ ఆకులను బాగా మరిగించమని చెప్తారు.
Also Read : మహిళలు రెగ్యులర్గా గ్రీన్ టీ తాగితే కలిగే లాభాలు ఇవే.. నష్టాలు కూడా ఉన్నాయా?
షుగర్ ఎప్పుడు వేయాలంటే..
నీళ్లు, పాలతో పాటు.. టీలో చక్కెరను సరైన సమయంలో కలపడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది దాని పూర్తి రుచిని ప్రభావితం చేస్తుంది. కొందరు ముందుగా చక్కెరను కలుపుతారు. కానీ సరైన పద్ధతి ఏమిటంటే పాలు కలిపిన తర్వాత.. అంటే టీ చివరిసారిగా మరిగేటప్పుడు షుగర్ వేయడం మంచిది. దీనివల్ల చక్కెర పూర్తిగా కరిగి బాగా కలుస్తుంది.
పర్ఫెక్ట్ టీ కోసం..
టీ తయారుచేసేటప్పుడు మంటను చూసుకోవడం కూడా ముఖ్యమే. ముందుగా నీటిని అధిక మంట మీద మరిగించాలి. కానీ పాలు కలిపిన తర్వాత మంటను మీడియం మంట మీద పెట్టుకోవాలి. దీనివల్ల పాలు పొంగిపోకుండా.. టీ నెమ్మదిగా ఉడుకుతుంది. అధిక మంట మీద పాలు కలపడం వల్ల టీ త్వరగా మరిగి.. రుచిలో మార్పు రావచ్చు. ఇలా చిన్న విషయాలపై దృష్టి పెడితే రంగు, రుచి, సువాసనతో కూడిన పర్ఫెక్ట్ టీని ఆస్వాదించవచ్చు.
Also Read : మొటిమలు, జుట్టు రాలడం, నల్లటి వలయాలకు గ్రీన్ టీ పరిష్కారం.. ఇలా అప్లై చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























