Silent Heart Attack Risk Factors : రాత్రుళ్లు ఆ పనులు చేస్తే సైలెంట్ హార్ట్ ఎటాక్స్ తప్పవట.. ఆ మిస్టేక్స్ అస్సలు చేయొద్దంటోన్న నిపుణులు
Heart Attack Prevention : రాత్రి సమయంలో చేసే కొన్ని పనులు సైలెంట్ హార్ట్ ఎటాక్‌కి కారణమవుతాయి అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ పనులు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
Sleep and Heart Attack Risk : రాత్రి వేళలో చేసే కొన్ని పనుల వల్ల గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువ అవుతోందని చెప్తున్నారు నిపుణులు. అందుకే ఈ మధ్య యూత్‌ని కూడా ఈ సైలెంట్ హార్ట్ ఎటాక్స్ అటాక్ చేస్తున్నాయని చెప్తున్నారు. రాత్రుళ్లు చేసే చిన్న మిస్టేక్స్ వల్ల గుండె సమస్యలు ఎక్కువ అవుతున్నాయని.. వీలైనంత త్వరగా వాటిని మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఏ మిస్టేక్స్ వల్ల ఈ సమస్యలు వస్తున్నాయో.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పగటి వేళ చేసే పనులకంటే.. రాత్రుళ్లు చేసే పనులకే గుండె ఎక్కువ ప్రభావితమవుతుందట. అవి హృదయనాళ వ్యవస్థకు ఇబ్బంది కలిగించి.. ప్రాణాలను హరిస్తున్నాయట. అయితే సైలెంట్ హార్ట్ ఎటాక్స్ ఎలాంటి అలెర్ట్ ఇవ్వకుండా వస్తాయనుకుంటారు కానీ.. కొన్ని సంకేతాలు ఉంటాయి. వాటిని గుర్తించాలంటున్నారు. చెస్ట్‌లో నొప్పి రావడం, బ్రీతింగ్ ఇబ్బంది కలగడం వంటివి సైలెంట్ హార్ట్ ఎటాక్‌కి సంకేతాలు. మరి ఈ సమస్యను ప్రేరెపించే పనులు ఏంటి..?
నిద్ర నాణ్యత
కొందరికి మంచి నిద్ర ఉంటుంది. మరికొందరికి నిద్ర సమస్యలు ఉంటాయి. తరచూ మేల్కొవడం, నిద్ర త్వరగా రాకపోవడం, నిద్ర సమయం తగ్గిపోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడతారు. ఈ సమస్యలు దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడితే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ అవుతుందని పరిశోధనలు చెప్తున్నాయి. స్లీప్ ఆప్నియా ఉంటే నిద్రలో మెలకువ ఎక్కువగా ఉంటుందట. దీనివల్ల బ్రీతింగ్ సమస్యలు వచ్చి ఆక్సిజన్ స్థాయిల్లో హెచ్చు, తగ్గులకు కారణమవుతుంది. ఒత్తిడి హార్మోన్లను పెంచి.. అధిక రక్తపోటు, గుండె జబ్బులను పెంచుతుంది.
టైమ్‌కి పడుకోకుంటే..
ఇప్పటి జెనరేషన్లో చాలామందికి స్లీపింగ్ షెడ్యూల్ ఉండదు. సరైన సమయానికి పడుకోకుండా.. నిద్రలేకపోవడం వల్ల గుండె ఆరోగ్యం దెబ్బతింటుందని మీకు తెలుసా? నిద్ర వేళల్లో మార్పులు.. నిద్ర వ్యవధిలో మార్పులు సైలెంట్ హార్ట్ ఎటాక్‌కి దారి తీస్తాయట. ఇలా చేయడం వల్ల సిర్కాడియన్ రిథమ్ దెబ్బతిని.. మెటబాలీజంను ప్రభావితం చేస్తుంది. ఇది హృదయనాళ ఆరోగ్యంపై ప్రతికూలంగా ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల రక్తపోటు, హార్మోన్ ఇంబ్యాలెన్స్, గుండె జబ్బులు వేగంగా వృద్ధి చెందుతాయి.
మిడ్ నైట్ మీల్స్..
కొందరు సమయం సందర్భం లేకుండా అర్థరాత్రుళ్లు తింటారు. సాయంత్రం 7లోపు డిన్నర్ ముగించడం ఎంత మంచిదో.. అర్థరాత్రుళ్లు తింటే ఆరోగ్యానికి అన్ని నష్టాలున్నాయట. తీసుకున్న ఆహారం జీర్ణం కాక.. శరీరంలో చెడు కొవ్వుగా పేరుకుపోతుంది. బరువు పెరగడం వల్ల స్లీప్ ఆప్నియా మరింత ఎక్కువ అవుతుంది. ఇది గుండె జబ్బులకు దారి తీస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి మధుమేహం తీవ్రమవుతుంది.
మందు తాగితే..
పార్టీలకు వెళ్లి మందు తాగేవారు ఉంటారు. అయితే దీనిని ఎక్కువ స్థాయిలో తీసుకుంటే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది గుండె ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. గుండె సమస్యలను తీవ్రతరం చేస్తుంది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే గుండె జబ్బులు, స్ట్రోక్స్ ప్రమాదం ఎక్కువగా ఉంటాయని ఇప్పటికే పలు పరిశోధనలు తేల్చాయి.
కెఫీన్ వినియోగం..
కెఫిన్ ఎక్కువగా తీసుకుంటే నిద్రకు అంతరాయం కలుగుతుంది. ఇది గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. లేట్ నైట్ ఆలస్యంగా కెఫీన్ తీసుకోవడం వల్ల నిద్ర నాణ్యత తగ్గుతుంది. రక్తపోటును పెంచుతుంది. ఇది కూడా గుండెపై నెగిటివ్ ప్రభావాలు చూపస్తుంది.
ఒత్తిడి
ఒత్తిడి మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెడుతుంది. దీర్ఘకాలికంగా ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటే.. హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి. ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది. రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.
ఈ అలవాట్లు అన్నీ గుండెను సమస్యలకు గురిచేసి సైలెంట్ హార్ట్ ఎటాక్స్‌కి కారణమవుతున్నాయి. అందుకే స్లీపింగ్ షెడ్యూల్‌ని ఫాలో అవ్వాలి. అప్పుడే నిద్ర నాణ్యత పెరుగుతుంది. హెల్తీగా ఉంటారు. మంచి నిద్ర ఉంటే సగం సమస్యలు దూరమవుతాయి. అలాంటి సమస్యల్లో సైలెంట్ హార్ట్ ఎటాక్ కూడా ఒకటి. కాబట్టి నిద్రపోయేముందు ఈ పనులు అస్సలు చేయకుండా.. హాయిగా నిద్రపోమని సూచిస్తున్నారు నిపుణులు.
Also Read : ఈ రెగ్యూలర్ ఫుడ్స్‌తో లైంగిక ఆరోగ్యానికి ఎన్ని లాభాలో.. శృంగార జీవితానికి ఇవి చాలా మంచివట