అన్వేషించండి

Cough and Cold in Kids : చలికాలంలో పిల్లలకు దగ్గు, జలుబు వచ్చాయా? ఉపశమనం కోసం ఈ చిట్కాలు ఫాలో అవ్వండి

Winter Cough in Children : శీతాకాలంలో పిల్లలకు దగ్గు, జలుబు, గొంతునొప్పి సమస్యలు ఈజీగా వచ్చేస్తాయి. ఈ సమయంలో ఉపశమనం కోసం ఎలాంటి ఇంటి చిట్కాలు ఫాలో అవ్వాలో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • శ్వాస ఇబ్బందులు, జ్వరం ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Home Remedies for Kids Cough : చల్లని వాతావరణంలో పిల్లలకు తరచుగా దగ్గు, జలుబు, కఫం వస్తుంటాయి. ఆ సమయంలో చిన్న పిల్లల సంరక్షణ విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. చలికాలంలో దగ్గు, జలుబు వంటి సమస్యలు చాలా ఈజీగా రావడం.. వాటి నుంచి పిల్లలు కాలక్రమేణా కోలుకోవడం జరుగుతుంది. ఈ సమయంలో కొన్ని సాధారణ చిట్కాలు ఫాలో అయితే.. వాటినుంచి ఉపశమనం పొందడం ఈజీ కావచ్చు. మరి అవేంటో.. వాటిని ఫాలో అవ్వడం వల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం. 

తేనె, గోరువెచ్చని లిక్విడ్స్

మీ పిల్లలకు సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉంటే.. వారికి కొద్దిగా తేనె ఇవ్వడం మంచిది. ఇది దగ్గును తగ్గించడంలో సహాయపడుతుంది. తేనె గొంతుకు ఉపశమనం కలిగించి.. రాత్రిపూట వచ్చే దగ్గును తగ్గిస్తుంది. అయితే ఏడాదిలోపు పిల్లలకు తేనె ఇవ్వకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది వారిలో తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చని చెప్తున్నారు. 

Also Read : డాక్టర్ దగ్గరకు వెళ్లకుండా దగ్గు, జలుబు మందులు వాడుతున్నారా? ప్రాణాలకే ముప్పు!

వయస్సుకు తగినట్లుగా నీరు, సూప్ లేదా ఇతర గోరువెచ్చని ద్రవపదార్థాలు ఇస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఇవి డీహైడ్రేషన్‌ను నివారించి, గొంతుకు ఉపశమనం కలిగించడంలో సహాయపడుతాయి. బేబి ప్రస్తుతం తల్లిపాలు తాగుతున్నట్లయితే.. వారికి తల్లిపాలు ఇవ్వడం కంటిన్యూ చేయాలి. ఇవి వారికి ఇమ్యూనిటీ పెంచడంలో హెల్ప్ చేస్తాయి. 

ముక్కు దిబ్బడ ఉంటే..

పిల్లలకు జలుబు చేసినప్పుడు వారి ముక్కు మూసుకుపోతుంది. ముక్కు దిబ్బడ వల్ల శ్వాస తీసుకోవడానికి, నీళ్లు తాగడానికి కూడా ఇబ్బంది పడతారు. ఈ సమయంలో సెలైన్ నాసల్ డ్రాప్స్, లేదా సాల్ట్ వాటర్ డ్రాప్స్ చుక్కల మందు ఉపయోగిస్తే.. ముక్కులోని శ్లేష్మాన్ని వదులు చేయడానికి సహాయపడతాయి. చిన్న పిల్లల కోసం.. డాక్టర్ లేదా ఆరోగ్య నిపుణుల సలహా తీసుకుని నాసల్ డీకంజెస్టెంట్ వాడాలి.

పిల్లలకు తగినంత విశ్రాంతి ఇవ్వాలి. గదిలోని గాలి పొడిగా ఉంటే.. శుభ్రమైన, చల్లని ఆవిరిని వెదజల్లే హ్యూమిడిఫైయర్‌ను ఉపయోగించాలి. దీనిని క్రమం తప్పకుండా శుభ్రపరచడం చాలా అవసరం. అయితే పిల్లలను కూర్చోబెట్టి నేరుగా ఆవిరిని పీల్చేలా చేయకపోవడమే మంచిది. ఎందుకంటే దీనివల్ల వారికి గాయాలు కావచ్చు. 

Also Read : వర్షాల వల్ల జలుబు, దగ్గు వస్తున్నాయా? రోగనిరోధక శక్తి కోసం వీటిని తినమంటోన్న వైద్యులు

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలంటే..

మీ పిల్లలు జలుబు, దగ్గు లేదా గొంతు నొప్పి కారణంగా.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడినా లేదా వేగంగా శ్వాస తీసుకుంటున్నా, పెదవులు నీలి రంగులోకి మారినా, పాలు లేదా నీళ్లు తాగలేకపోయినా.. వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. మీ పిల్లలు చాలా నీరసంగా మారినా లేదా డీహైడ్రేషన్ లక్షణాలు కనిపించినా ఆలస్యం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. 

జ్వరం నాలుగు రోజుల కంటే ఎక్కువ రోజులు కొనసాగినా.. పది రోజుల్లో లక్షణాలు మెరుగుపడకపోయినా.. మెరుగుపడిన తర్వాత మళ్లీ తీవ్రమైనా కూడా వైద్యుడిని సంప్రదించాలి. వైద్యుడిని సంప్రదించకుండా చిన్న పిల్లలకు దగ్గు, జలుబు మందులు ఇవ్వకూడదు. ఎందుకంటే ఆ మందులు హానికరం కావచ్చు. ముఖ్యంగా ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు.. పిల్లల వయస్సు, లక్షణాల ఆధారంగానే చికిత్స అందించాల్సి ఉంటుంది.

Also Read : చలికాలంలో వచ్చే వ్యాధులు దూరం చేసే ఇంటి చిట్కాలు.. వీటితో జలుబు, దగ్గు, కీళ్లనొప్పులు దూరం

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TG Bharath: ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
CM Revanth Reddy: ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Kia Carens Clavis EVని డిటో దింపేసిన కొత్త Hyundai Neira.. ఫీచర్లు, రేంజ్, ఇండియా లాంచ్ వివరాలు
Hyundai Neira MPV ఇంటీరియర్ అదిపోయింది.. 7 సీట్లు, పానోరమిక్‌ సన్‌రూఫ్, Bose సౌండ్ సిస్టమ్
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Bharath: ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
CM Revanth Reddy: ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Kia Carens Clavis EVని డిటో దింపేసిన కొత్త Hyundai Neira.. ఫీచర్లు, రేంజ్, ఇండియా లాంచ్ వివరాలు
Hyundai Neira MPV ఇంటీరియర్ అదిపోయింది.. 7 సీట్లు, పానోరమిక్‌ సన్‌రూఫ్, Bose సౌండ్ సిస్టమ్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Revanth Reddy Love Story: ప్రేమ కోసం బైక్‌పై ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌రెడ్డి.. సీఎం లవర్ బాయ్ మూమెంట్ వైరల్!
ప్రేమ కోసం బైక్‌పై ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌రెడ్డి.. సీఎం లవర్ బాయ్ మూమెంట్ వైరల్!
Bigg Boss Season 10 Today November 20th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: డైరెక్ట్ 13వ వారంలోకి కెప్టెన్ అమన్ మసూద్! ముకేశ్‌ చేష్టలకు ఫాలోవర్స్ అసహనం!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: డైరెక్ట్ 13వ వారంలోకి కెప్టెన్ అమన్ మసూద్! ముకేశ్‌ చేష్టలకు ఫాలోవర్స్ అసహనం!
Embed widget