అన్వేషించండి

Karthika Pournami 2024 : కార్తీక పౌర్ణమి స్పెషల్ చలిమిడి రెసిపీ.. నైవేద్యంగా చేసుకునేప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వాలి

Chalimidi Recipe : కార్తీక పౌర్ణమి రోజు చేసుకునే నైవెద్యాల్లో చలిమిడి ప్రధానంగా ఉంటుంది. దీనిని సరైన పద్ధతిలో ఎలా చేసుకోవాలో.. ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

Chalimidi Recipe for Karthika Pournami 2024 : కార్తీక పౌర్ణమి పూజ చేసుకున్నా.. వ్రతం చేసుకున్నా.. కచ్చితంగా నైవేద్యంగా చలిమిడిని పెడతారు. దీనిని తయారు చేసుకోవడ చాలా సులభం. కానీ కాస్త ఓపికగా ఉండాలి. నైవేద్యంగానే కాకుండా.. ఇది ఒక టేస్టీ డిజర్ట్​గా కూడా చేసుకోవచ్చు. అయితే ఈ చలిమిడిని చేసేప్పుడు ఏ టిప్స్ ఫాలో అవ్వాలి? ఎలా తయారు చేసుకుంటే చలిమిడి రుచి బాగుంటుంది వంటి విషయాలు.. కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు

బియ్యం - పాకానికి తగ్గట్లు నానబెట్టుకోవాలి

కొబ్బరి - అరకప్పు

బెల్లం - 250 గ్రాములు

పంచదార - రెండు టేబుల్ స్పూన్లు

నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు

జీడిపప్పు - పిడికెడు

గసగసాలు - 1 టేబుల్ స్పూన్

యాలకుల పొడి - పావు టీస్పూన్ 

తయారీ విధానం

కార్తీక పౌర్ణమి రోజు చలిమిడి చేసుకోవాలనుకుంటే.. ముందురోజు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. లేదంటే ఉదయాన్నే కూడా బియ్యాన్ని నానబెట్టుకోవచ్చు. ఎందుకంటే కార్తీక పూర్ణిమ పూజను సాయంత్రమే చేసుకుంటారు కాబట్టి.. ఉదయాన్నే బియ్యం నానబెట్టుకున్నా పర్లేదు. అయితే ముడి బియ్యాన్ని లేదా రేషన్ బియ్యాన్ని చలిమిడికి ఉపయోగిస్తే రుచి బాగుంటుంది. అలాగే బియ్యం కనీసం ఆరుగంటలు నానబెట్టుకోవాలని గుర్తించుకుని.. మీరు వంట చేసుకునే సమయం బట్టి వాటిని ప్రిపేర్ చేసుకోవాలి. 

బియ్యం నానిన తర్వాత.. బియ్యంలోని తడి పోయేలా.. నీటిని పూర్తిగా వడకట్టి.. వాటిని ఓ వైట్​ క్లాత్​పై పరిచి.. ఆరబెట్టుకోవాలి. తడిపోయే వరకు ఆరితే సరిపోతుంది. పూర్తిగా ఆరాల్సిన అవసరం లేదు. తడి ఆరిన తర్వాతనే వాటిని మిక్సీ వేసుకోవాలి. ఇలా తడి బియ్యం పిండినే చలిమిడికి వాడాలి. పొడి బియ్యప్పిండి చలిమిడికి సెట్ కాదు. కాబట్టి మంచి రుచి కావాలనుకున్నప్పుడు కాస్త ఓపికగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవాలి. బియ్యం పిండి సిద్ధమైన తర్వాత మిగిలిన ప్రోసెస్ ఈజీగానే ఉంటుంది. 

స్టౌవ్ వెలిగించి.. దానిపై మందపాటి కడాయి పెట్టాలి. దానిలో బెల్లం తురుము, కాస్త పంచదార వేసి.. దానిలో నీళ్లు పోసి.. బెల్లాన్ని కరగనివ్వాలి. ఇలా బెల్లంతో పాటు పంచదార వేసుకోవడం వల్ల రుచి మరింత పెరుగుతుంది. ఇప్పుడు బెల్లం పాకంలో నురగ వస్తుంది. ఇప్పుడు కాస్త పాకాన్ని తీసుకుని నీటిలో వేసుకోవాలి. అది గడ్డకడితే పాకం సిద్ధమని గుర్తించుకోవాలి. ఇలా సిద్ధమైన పాకంలో కాస్త యాలకుల పొడి వేసి తిప్పి.. స్టౌవ్​ మంటని తగ్గించి.. బియ్యం పిండిని కొద్దికొద్దిగా వేస్తూ కలపాలి. 

పిండి ఉండలు లేకుండా.. పాకంలో పూర్తిగా కలిసేలా కలుపుతూనే ఉండాలి. పిండిని ఎంత బాగా కలిపితే చలిమిడి అంత బాగా వస్తుందని గుర్తించుకోవాలి. కాస్త లూజ్​గా ఉన్నప్పుడే పిండి వేయడం ఆపేసి.. స్టౌవ్​ని కూడా ఆపాలి. అప్పుడు చలిమిడి కాస్త గట్టి పడుతుంది. లూజ్​గా లేకుండా చేసుకుంటే చలిమిడి గట్టిగా అవుతుంది. 

ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై చిన్న కడాయి పెట్టుకోవాలి. దానిలో నెయ్యి వేసి.. జీడిపప్పు పలుకులు వేయించుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్. కానీ దీనిలో కొబ్బరి ముక్కలను కచ్చితంగా వేయాలి. పచ్చి కొబ్బరి ముదరగా ఉండేది చూసుకుని దానిని చిన్న చిన్న ముక్కలుగా కోసి వేయించుకోవాలి. వీటిని చలిమిడిలో వేసి కలుపుకుంటే టేస్టీ చలిమిడి రెడీ. దీనిలో గసగసాలు కూడా వేసుకోవచ్చు. ఇది కూడా పూర్తిగా ఆప్షనల్. దీనిని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు చేసుకునే రెసిపీల్లో ఇది కూడా ఒకటి. 

Also Read : కార్తీకమాసంలో వారు ఉపవాసం చేయకపోవడమే మంచిదట, కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Digital Real Estate: 'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!
'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!
Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
MBBS Student Dies: పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Daaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desamఆర్టీసీ బస్సులో పంచారామాలు, ఒక్క రోజులో వెయ్యి కిలో మీటర్లుPamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Digital Real Estate: 'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!
'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!
Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
MBBS Student Dies: పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Thaman On Pushpa 2: 'పుష్ప 2' బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో తమన్ క్లారిటీ... బన్నీ మూవీకి ఆయన ఇచ్చిన రివ్యూ ఏమిటంటే?
'పుష్ప 2' బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో తమన్ క్లారిటీ... బన్నీ మూవీకి ఆయన ఇచ్చిన రివ్యూ ఏమిటంటే?
SBI Loan: లోన్‌ తీసుకున్నవాళ్లకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ - ఈ రోజు నుంచి EMIలు పెంపు
లోన్‌ తీసుకున్నవాళ్లకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ - ఈ రోజు నుంచి EMIలు పెంపు
Allu Arjun: వీడు పెద్దైతే ఎలా ఉంటాడో అని భయపడ్డాం... అల్లు అర్జున్ మదర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
వీడు పెద్దైతే ఎలా ఉంటాడో అని భయపడ్డాం... అల్లు అర్జున్ మదర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Embed widget