Kabaddi Player Dies with Dog Bite : కుక్కకాటుతో ప్రాణాలు కోల్పోయిన 22 ఏళ్ల కబడ్డీ ప్లేయర్.. ఆ చిన్న మిస్టేక్ వల్లే
Dog Bite : కుక్కు కాటుతో 22 ఏళ్ల కబడ్డీ ప్లేయర్ రీసెంట్గా ప్రాణాలు కోల్పోయాడు. చిన్న మిస్టేక్ చేయడం వల్లే చనిపోయినట్లు తేలింది. అసలు కారణమేంటో ఇప్పుడు చూసేద్దాం.

Brijesh Solanki Dog Bite Death : తెలిసో తెలియకో చేసే అతి చిన్న మిస్టేక్ వల్ల ప్రాణాలే పోతాయనే దానికి నిదర్శనం ఈ ఘటన. 2026 ప్రో కబడ్డీ లీగ్ కోసం సిద్ధమవుతున్న ఓ కబడ్డీ ప్లేయర్ మరణం దేశాన్నే దిగ్భ్రాంతికి గురిచేసింది. రాష్ట్ర ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన ఓ ఆటగాడు.. ఒక్క చిన్న తప్పిదం వల్ల ప్రాణాలు కోల్పోయాడు. అసలు ఏమైంది? ఎవరు ఆ కబడ్డీ ప్లేయర్?
ఉత్తరప్రదేశ్‌కి చెందిన బ్రిజేష్ సోలంకికి 22 ఏళ్లు. రాష్ట్ర స్థాయిలో కబడ్డీ ప్లేయర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం కూడా సాధించాడు. ఇతను కొన్ని వారాల క్రితం ఓ కుక్కపిల్లను రెస్క్యూ చేశాడు. ఆ సమయంలో కుక్క కాటుకు గురయ్యాడు. చిన్న గాటే కాదా.. ఏమవుతుందిలే అని లైట్ తీసుకున్నాడు. కట్ చేస్తే అదే ఆ ప్లేయర్ ప్రాణాన్ని తీసుకుంది.
కుక్కగాటు తర్వాత బ్రిజేష్ అది పెద్ద హాని చేయదులే అనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే యాంటీ రేబిస్ టీకాను తీసుకోవడం మానేశాడు. ఇప్పుడు అదే అతని మరణానికి దారితీసిందని.. రేబిస్ సంబంధిత వైద్యులు చెప్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో చూస్తే.. ఎవరైనా బాధపడాల్సిందే. 22 ఏళ్ల యువకుడు, ఆటగాడు అలా చనిపోవడం అందరి హృదయాలను కలచి వేస్తుంది.
View this post on Instagram
కుక్కగాటు ఎంత ప్రమాదమంటే..
ఎడిన్బర్గ్ యూనివర్సిటీ పరిశోధకుల ప్రకారం రేబిస్ అనేది ప్రపంచ వ్యాప్తంగా అంటువ్యాధులకు ప్రధాన కారణంగా చెప్తున్నారు. అంటువ్యాధుల వల్ల సంభవించే మరణాల్లో రేబిస్ 10వ స్థానంలో ఉందట. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 వేల నుంచి 60 వేల మంది రేబిస్ కారణంగా మరణిస్తున్నారని.. తాజా అధ్యయనం నివేదించింది.
ఇండియాలో రేబిస్ వ్యాప్తి
ఇండియాలో ప్రతి సంవత్సరం రేబిస్ కారణంగా సంభవించే మరణాలు 36 శాతంగా ఉన్నాయి. వీటిలో 95 నుంచి 97 శాతం కుక్కగాటు వల్లే జరుగుతున్నాయట. “భారతదేశంలో ఏటా సుమారు 17.4 మిలియన్ల కుక్క కాటుల కేసులు నమోదవుతున్నాయి. దీనివల్ల సంవత్సరానికి 18,000–20,000 మందికి రేబిస్ నమోదవుతుంది” అని ఆ అధ్యయనం చెబుతోంది. పౌర, వైద్య, ప్రభుత్వం నివారణ చర్యలను అమలు చేయడంలో జోక్యం చేసుకోకపోవడం వల్లే ప్రపంచవ్యాప్తంగా రేబిస్ మరణాలలో భారతదేశం అతిపెద్ద వాటాను కలిగి ఉన్నట్లు తెలుస్తుంది.
కాబ్టటి చిన్న గాటే కదా అని కుక్క కాటును విస్మరిస్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి వీలైనంత త్వరగా వైద్యసహాయం తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. అలాగే కేవలం కుక్కనే కాదు.. ఇతర జంతువుల వల్ల ఎలాంటి కాటు లేదా గాటు వంటివి పడినా.. మందుగా వైద్యుల సలహాలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్తున్నారు. అలాగే ఈ తరహా కేసులు వచ్చినప్పుడు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు వాటిపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.






















