అన్వేషించండి

Worlds Most Beautiful Women : ప్రపంచంలోని అందమైన మహిళలను ఎలా డిసైడ్ చేస్తారో తెలుసా? టాప్​ 10లో ఉన్న ఏకైక ఇండియన్ హీరోయిన్ ఎవరంటే?

Jodie Comer : ప్రపంచంలో అందమైన మహిళ వీరేనంటూ ప్రతిసంవత్సరం లిస్ట్ వస్తుంది. అసలు అందానికి ఎలాంటి లెక్కలు వేస్తారు.. వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Worlds Most Beautiful Womens List 2024 : ప్రపంచ సుందరిలు తెలుసుకానీ.. ప్రపంచంలో అందమైన మహిళలు గురించి తెలుసా? ప్రతి సంవత్సరం ప్రపంచంలో అత్యంత అందమైన మహిళలు గురించి ఈ లిస్ట్​ జాబితా వస్తూ ఉంటుంది. అయితే ఈ సంవత్సరం టాప్ 10 మహిళల్లో ఒక్కరే ఇండియన్ ఉన్నారట. ఇంతకీ ఆమె ఎవరు? అసలు ప్రపంచంలోనే అత్యంత అందమైన వారిని ఏ విధంగా ఎంపిక చేస్తారో ఇప్పుడు చూద్దాం. 

సాధారణంగా హీరోయిన్​లు అందంగా ఉంటారు. వారి అభిమానులకు నచ్చే హీరోయిన్సే ప్రపంచంలో అందరికంటే ఎక్కువ అందంగా కనిపిస్తారు. అలా ప్రతి హీరోయిన్​ ఫ్యాన్స్​ని డిస్సాప్పాయింట్ చేసింది రీసెంట్ లిస్ట్. ఒక్కరిని తప్పా. ఎందుకంటే ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళల్లో టాప్​ 10లో ఇండియన్ నటి ఒక్కరే ఉన్నారు. అది ఎవ్వరో కాదు దీపిక పడుకొనే. అయితే అందమైన హీరోయిన్లను పక్కన పెట్టి.. ఈ భామనే ఈ టాప్​ లిస్ట్​లో ఎలా చేరిందంటే.. 

ప్రపంచంలో అత్యంత అందమైన మహిళల ర్యాంకింగ్ ప్రకారం.. బ్రిటీష్ నటి జోడి కమెర్ మొదటి స్థానంలో ఉంది. గోల్డెన్ రేషియో ఫార్ములా ప్రకారం ఈ హీరోయిన్​ టాప్​ 1లో నిలిచింది. అయితే ఈ గోల్డెన్ రేషియో ఏంటి? దీనిని ఎలా కాలిక్యూలేట్ చేస్తారు. ఫేషియల్ కాస్మోటిక్ సర్జన్స్ ఈ గోల్డెన్ రేషియో గురించి ఎలాంటి లెక్కలు చెప్తారు. వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

గోల్డెన్ రేషియో.. 

గ్రీకుల ప్రకారం.. నిర్దిష్ట నిష్పత్తులు ఉపయోగించి అందాన్ని మెజర్ చేస్తారు. ముఖం పొడవు ఎంత ఉండాలి. వెడల్పు ఏంటి.. ముఖం పొడవను వెడల్పులతో విభజిస్తే ఎంత వస్తుందో.. దానిని బట్టి ఈ రేషియోని ఫిక్స్ చేస్తారు. ఇలా అందమైన మహిళను లెక్కిస్తూ.. 1.618ని ఫైనల్ చేశారు. ఈ రేషియోకి ఎవరు దగ్గరగా ఉంటే.. వారినే అందమైన మహిళగా లెక్కిస్తారు. అయితే ఈ రేషియోకు.. 94.52శాతం దగ్గర్లో ఉన్న జోడీ కమర్ టాప్​ 1 గా నిలిచింది. 

ఎన్నోస్థానంలో నిలిచిందంటే

ఇదే కాకుండా.. పెదవుల ఆకృతి.. కళ్లు ఉండే పొజీషన్, గడ్డం, ముక్కులను కూడా ఈ రేషియోలో భాగంగా లెక్కిస్తారు. ఇలా ఏ రకంగా చూసుకున్నా జోడీ కమర్ టాప్​ 1లో నిలిచింది. టాప్​ 10లో లిస్ట్​లో ఉన్న దీపికా పదుకొణె 91.22 శాతంతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. 2018లో యూకే వార్తాపత్రిక ఆమెకు సెక్సీయెస్ట్ ఏషియన్ ఉమెన్ అనే బిరుదు కూడా వచ్చింది. అందాల రాశి తన హోదాను మరింత పటిష్టం చేసుకుంది. 

ప్రపంచంలోని టాప్​ 10లో నిలిచిన మహిళలు ఈ గోల్డెన్ రేషియోకి ఎంతవరకు వచ్చారో చూద్దాం. అగ్రస్థానంలో ఉన్న నటి జోడి కమెర్ 94.52 శాతం గోల్డెన్ రేషియోకి దగ్గరగా ఉంది. జెండయా 94.37 శాతం, బెల్లా హడిద్ 94.35 శాతం ఉండగా.. బియాన్స్ 92.44 శాతం, అరియానా గ్రాండే 91.81 శాతం ఉన్నారు. టేలర్ స్విప్ట్ 91.64 శాతం, జోర్డాన్ డన్ 91.39 శాతం, కిమ్ కర్దాషియన్ 91.28 శాతం.. దీపికా పదుకొణె 91.22 శాతం, హోయెన జంగ్ 89.93 శాతంగా ఉన్నారు. 

Also Read : 69 మంది పిల్లలను కని గిన్నెస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన మహిళ.. ఈ రికార్డు బ్రేక్ చేయడం కష్టమే గురు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
Embed widget