Japan Population Crisis : జపాన్‌లో పెరుగుతోన్న వృద్ధులు, తగ్గుతోన్న యువత.. జాబ్ స్ట్రెస్‌తో పెళ్లి, పిల్లలకు దూరం!
Japans Young Population : జపాన్‌లో వృద్ధుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. మరి ఈ దేశంలో యువకులు ఎందుకు తగ్గిపోతున్నారో, కారణాలు ఏంటో.. ఎప్పుడు పూర్తిగా వృద్ధ దేశంగా మారుతుందో తెలుసుకుందాం.

- సంతానోత్పత్తి రేటు 1.14కు పడిపోవడంతో జపాన్‌కు జనాభా సంక్షోభం.
- జపాన్ జనాభాలో 30% మంది 65 ఏళ్లు దాటినవారే ఉన్నారు.
- అధిక పని ఒత్తిడి, పిల్లల పోషణ ఖర్చులు జననాలను తగ్గించాయి.
- 2070 నాటికి జనాభా 87 మిలియన్లకు తగ్గి వృద్ధులు పెరుగుతారు.
Japans Young Population Declining Causes : బర్త్ రేట్ తగ్గడం, పెరుగుతోన్న వయస్సు కారణంగా జపాన్‌లో వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీంతో జపాన్ తీవ్రమైన జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సంతానోత్పత్తి రేటు రికార్డు స్థాయిలో 1.14కు పడిపోవడం, వయోవృద్ధుల జనాభా పెరగడంతో.. జపాన్ అత్యధిక వృద్ధులున్న దేశంగా పయనిస్తోంది. మరి ఈ దేశం పూర్తిగా వృద్ధాశ్రమంగా మారడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో.. బర్త్ రేట్ తగ్గడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం.
జపాన్ అనగానే మంచి లైఫ్‌స్టైల్‌కు, ప్రశాంతతకు చిహ్నంగా చెప్తారు. అయితే వీరు ఎక్కువగా లోన్లీగా కూడా ఉంటారని.. ఒత్తిడి ఎక్కువ తీసుకుంటారని చెప్పే స్టడీలు కూడా ఉన్నాయి. అదే ఇప్పుడు వారి సంతానోత్పత్తి రేటుపై ప్రభావం చూపిస్తుంది. తాజాగా జపాన్ సంతానోత్పత్తి రేటు రికార్డు స్థాయిలో 1.14కు పడిపోయింది. స్థిరమైన జనాభాను కొనసాగించడానికి అవసరమైన 2.1 స్థాయి కంటే ఇది చాలా తక్కువ. ఈ తగ్గుదల వల్ల యువ జనాభాను తగ్గిపోయి.. దీర్ఘకాలిక జనాభాపై ప్రభావం చూపిస్తుంది.
Also Read : రోజుకు 500 పొదుపు చేస్తే 10 ఏళ్లలో 25 లక్షలు.. పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పూర్తి లెక్క ఇదే
65 ఏళ్లు వాళ్లే ఎక్కువ
జపాన్ జనాభాలో దాదాపు 30 శాతం మంది ఇప్పటికే 65 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉన్నారు. దీనితో ఇది ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జనాభా కలిగిన దేశాలలో ఒకటిగా నిలిచింది. మెరుగైన ఆరోగ్య సంరక్షణ, పెరుగుతున్న సగటు వయస్సు వృద్ధ నివాసితుల సంఖ్య పెరుగుదలకు దోహదం చేశాయి.
100 ఏళ్లు దాటిన వారు కూడా ఎక్కువే..
జపాన్‌లో 100 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి సంఖ్య కూడా లక్ష దాటింది. ఇది ఆ దేశంలో కొత్త రికార్డు. వృద్ధుల సంఖ్యలో ఈ పెరుగుదల, సగటు వయస్సు అనేది జపనీస్ సమాజం వేగంగా వృద్ధాప్యం వైపు పయనిస్తున్న తీరును ప్రతిబింబిస్తుంది.
Also Read : డబ్బులు పొదుపు చేయాలనుకుంటే జపనీస్ టెక్నిక్స్ ఫాలో అయిపోండి.. సింపుల్ బట్ ఎఫెక్టివ్
ఉద్యోగాల ఒత్తిడి ప్రధాన కారణం
ఎక్కువ పని గంటలు, పనిలో స్ట్రెస్ వంటివి యువతను సంబంధాలకు, కుటుంబ జీవితానికి దూరం చేస్తుంది. అధిక శ్రమతో కూడిన ఉద్యోగాల ఒత్తిడి వల్ల ఉద్యోగులు వివాహం, పిల్లల కోసం తగినంత సమయం కేటాయించలేకపోతన్నారట. వారికి శక్తి మిగలకపోవడంతో ఒంటరిగా ఉండేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని గుర్తించారు.
పిల్లలతో పాటు ఖర్చు భయం
పిల్లలు ఉంటే బర్డెన్ ఎక్కువ అవుతుందనే భయంతో చాలామంది సంతానానికి దూరమవుతున్నారట. పిల్లల సంరక్షణ, ఉన్నత విద్య ఖర్చులు అధికంగా ఉండటం వల్ల, చాలామంది యువ జంటలు పిల్లలను కనడానికి లేదా పెద్ద కుటుంబాలను ప్రారంభించడానికి సంకోచిస్తున్నారు.
Also Read : 3 నిమిషాలు ఫాస్ట్.. 3 నిమిషాలు స్లో.. ఈ జపనీస్ టెక్నిక్ ఇప్పుడు బాగా ఫేమస్, ఎందుకంటే
కెరీర్‌కి ఓటేస్తున్న మహిళలు
జపాన్ కార్పొరేట్ కల్చర్ మహిళలకు వృత్తి, కుటుంబ బాధ్యతలను సమతుల్యం చేసుకోవడాన్ని కష్టతరం చేస్తుంది. ఫలితంగా పనిలో సౌలభ్యం లేకపోవడంతో కొంతమంది మహిళలు వివాహం లేదా పిల్లలను కనడం కంటే తమ వృత్తి జీవితానికే ప్రాధాన్యత ఇవ్వడం కూడా దీనికి ముఖ్య కారణమే.
2070 నాటికి తగ్గనున్న జనాభా
జపాన్‌లో వలస విధానం ఎక్కువగా ఉండడం, సుమారు మూడు శాతం మంది విదేశీయులు ఉన్నారట. దీంతో జపాన్‌లోని యువతకు జాబ్స్ దొరకడం కష్టంగా మార్చిందని కూడా చెప్తున్నారు. ఈ లోటుపాట్లను భర్తీ చేయడంలో జపాన్ పరిమిత సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ అంశాలే కొనసాగితే 2070 నాటికి జపాన్ జనాభా సుమారు 87 మిలియన్లకు తగ్గవచ్చు. వీరిలో దాదాపు 40% మంది 65 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గలవారే ఉంటారు.
Also Read : ప్రపంచ జనాభా దినోత్సవం 2025.. ఫ్యామిలీ ప్లానింగ్ గురించి భారత్ ఆలోచించాల్సిన సమయమిదే, ఎందుకంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























