అన్వేషించండి

Post Office RD : రోజుకు 500 పొదుపు చేస్తే 10 ఏళ్లలో 25 లక్షలు.. పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పూర్తి లెక్క ఇదే

Post Office RD Scheme : ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ పథకాలపై భద్రతతో పాటు బలమైన వడ్డీ రేట్లను కూడా అందిస్తుంది. రోజుకు 500 పొదుపు చేస్తే.. 10 ఏళ్లకు 25.62 లక్షలు ఎలా అవుతుందో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ సురక్షిత ప్రభుత్వ పొదుపు పథకం.
  • కనీసం ₹100తో ఖాతా ప్రారంభించి, 6.7% వడ్డీ లభిస్తుంది.
  • రోజుకు ₹500 పొదుపు చేస్తే పదేళ్లలో ₹25 లక్షలవుతుంది.
  • మెచ్యూరిటీ ఐదేళ్లు, మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు.

Post Office RD Calculation : చిన్న మొత్తాలను క్రమం తప్పకుండా పొదుపు చేస్తే భవిష్యత్తులో మంచి నిధిని సమకూర్చుకోవచ్చు. రిస్క్ తక్కువగా ఉండే ప్రభుత్వ పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఒక ఆప్షన్‌గా ఉంటుంది. రోజుకు 500 చొప్పున పక్కన పెడుతూ.. దాన్ని క్రమం తప్పకుండా పెట్టుబడిగా మార్చితే 10 ఏళ్లలో 25 లక్షలకు పైగా నిధి సమకూరే అవకాశం ఉందని తెలుసా?

పోస్ట్ ఆఫీస్ ఆర్డీ..

పోస్ట్ ఆఫీస్ ద్వారా అందించే చిన్న పొదుపు పథకాలలో రికరింగ్ డిపాజిట్ ఒకటి. ఇందులో ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు పెట్టాల్సిన అవసరం ఉండదు. ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని క్రమం తప్పకుండా డిపాజిట్ చేస్తూ వెళ్లవచ్చు.
ప్రస్తుతం ఈ పథకానికి 6.7 శాతం వార్షిక వడ్డీ రేటు వర్తిస్తుంది. అయితే వడ్డీ రేట్లు ప్రభుత్వం నిర్ణయిస్తుంది కాబట్టి.. పెట్టుబడి చేసే సమయంలో తాజా రేటును తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది. 

Also Read : డబ్బులు పొదుపు చేయాలనుకుంటే జపనీస్ టెక్నిక్స్ ఫాలో అయిపోండి.. సింపుల్ బట్ ఎఫెక్టివ్

కేవలం 100తో ఖాతా స్టార్ట్ చేయవచ్చు

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఖాతాను సమీపంలోని పోస్ట్ ఆఫీస్‌లో ప్రారంభించవచ్చు. ఈ ఖాతాను కనీసం 100 డిపాజిట్‌తో ప్రారంభించే అవకాశం ఉంది. అర్హత నిబంధనలకు అనుగుణంగా వ్యక్తిగత ఖాతాతో పాటు జాయింట్ అకౌంట్‌ను కూడా తెరవవచ్చు.

5 ఏళ్ల మెచ్యూరిటీ

పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పథకం సాధారణంగా 5 సంవత్సరాల మెచ్యూరిటీ కాలాన్ని కలిగి ఉంటుంది. మెచ్యూరిటీ పూర్తైన తర్వాత నిబంధనలకు అనుగుణంగా ఖాతాను మరో 5 సంవత్సరాల పాటు కొనసాగించుకోవచ్చు. అంటే పెట్టుబడిదారులు కోరుకుంటే 5 సంవత్సరాల తర్వాత కూడా తమ పొదుపును కొనసాగిస్తూ దీర్ఘకాలంలో పెద్ద మొత్తాన్ని సమకూర్చుకునే ప్రయత్నం చేయవచ్చు.

రోజుకు 500 పొదుపు చేస్తే

రోజుకు 500 చొప్పున పక్కన పెడితే నెలకు సుమారు 15,000 అవుతుంది. ఈ మొత్తాన్ని ప్రతి నెలా రికరింగ్ డిపాజిట్‌లో పెట్టుబడిగా పెడితే.. నెలవారీ పెట్టుబడి 15,000.. ఇది 5 ఏళ్లలో పెట్టుబడి 9 లక్షలు అవుతుంది. ఈ లెక్క ప్రకారం 5 ఏళ్లలో వడ్డీ 1,70,492 అవుతుంది. మొత్తం అంటే సుమారు 10.70 లక్షలు పొందవచ్చు.

Also Read : సేవింగ్స్ చేయడానికి PPF మంచిదా? FD బెటరా? ఎక్కువకాలం పొదుపు చేస్తే ట్యాక్స్, వడ్డీ ఎలా ఉంటాయి?

10 ఏళ్లకు పొడిగిస్తే 25 లక్షలా?

5 ఏళ్ల తర్వాత పెట్టుబడిని మరో 5 సంవత్సరాల పాటు కొనసాగించినట్లయితే మొత్తం 10 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టినట్టవుతుంది. ఈ లెక్క ప్రకారం 10 సంవత్సరాల్లో మీరు పెట్టుబడిగా పెట్టే మొత్తం 18 లక్షలు. దీనికి వడ్డీ కలిపితే మొత్తం నిధి సుమారు 25,62,822కు చేరుతుంది. అంటే వడ్డీ ద్వారా వచ్చిన మొత్తం 7,62,822. ఇలా చూస్తే క్రమం తప్పకుండా పొదుపు చేస్తే దీర్ఘకాలంలో వడ్డీ ద్వారా గణనీయమైన మొత్తాన్ని సంపాదించే అవకాశం ఉంటుంది.

పెట్టుబడి చేసే ముందు గుర్తించుకోవాల్సిన విషయాలు

పోస్ట్ ఆఫీస్ పథకాలు ప్రభుత్వ మద్దతు ఉన్న చిన్న పొదుపు పథకాలుగా ఉన్నప్పటికీ.. రిస్క్ పూర్తిగా సున్నా అని చెప్పడం కంటే ప్రభుత్వ పథకం కావడం వల్ల భద్రత ఎక్కువగా ఉంటుంది. అలాగే వడ్డీ రేట్లు కాలానుగుణంగా మారవచ్చు. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు తాజా వడ్డీ రేటు, మెచ్యూరిటీ నిబంధనలు, పొడిగింపు నిబంధనలు, పన్ను సంబంధిత అంశాలను పోస్ట్ ఆఫీస్ అధికారులతో నిర్ధారించుకోవచ్చు. 

Also Read : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం

ఆర్డీ టైమ్ లిమిట్..

తపాలా కార్యాలయం ద్వారా నిర్వహించే వివిధ ప్రభుత్వ పొదుపు పథకాలు చాలా ప్రజాదరణ పొందాయి. ఎందుకంటే చిన్నదైనా, పెద్దదైనా ఎలాంటి పెట్టుబడికైనా భద్రతకు ప్రభుత్వమే హామీ ఇస్తుంది. అంటే ఇవి పూర్తిగా ప్రమాద రహితం. పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పథకం 6.7 వడ్డీ రేటును కూడా అందిస్తుంది. ఈ పథకాన్ని పోస్ట్ ఆఫీస్ పిగ్గీ బ్యాంక్ అని కూడా పిలుస్తారు. చిన్న పెట్టుబడులతో గణనీయమైన నిధులు పోగుచేసుకోవచ్చు. అయితే పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకంలో పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ అయ్యేందుకు 5 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. 

Also Read : అధిక రాబడితో పాటు భద్రతనిచ్చే పోస్టాఫీస్ పథకాలు.. భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేయాలంటే ఇవే బెస్ట్

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Healthy Skin Diet : ముఖంలో గ్లో రావాలా? సహజమైన మెరుపు కోసం ఈ 5 కూరగాయలు తినండి
ముఖంలో గ్లో రావాలా? సహజమైన మెరుపు కోసం ఈ 5 కూరగాయలు తినండి
Hemorrhoids Risk : యువకుల్లో పెరుగుతోన్న హెమరాయిడ్స్.. ఈ అలవాట్లే మొలలకు ప్రధాన కారణమంటోన్న పరిశోధనలు
యువకుల్లో పెరుగుతోన్న హెమరాయిడ్స్.. ఈ అలవాట్లే మొలలకు ప్రధాన కారణమంటోన్న పరిశోధనలు
Coconut Benefits : కొబ్బరి కేవలం రుచి కోసమే కాదు.. రోజూ తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా? ఇలా తీసుకోండి
కొబ్బరి కేవలం రుచి కోసమే కాదు.. రోజూ తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా? ఇలా తీసుకోండి
Mens Day 2026 Wishes : హ్యాపీ మెన్స్ డే 2026.. మీ జీవితంలోని స్పెషల్ Menకి ఫేస్​బుక్, వాట్సాప్​​లలో ఇలా విషెష్ చెప్పేయండి
హ్యాపీ మెన్స్ డే 2026.. మీ జీవితంలోని స్పెషల్ Menకి ఫేస్​బుక్, వాట్సాప్​​లలో ఇలా విషెష్ చెప్పేయండి
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
YS Avinash Reddy Detained: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
Gautam Gambhir Coach: సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
Embed widget