By: Geddam Vijaya Madhuri | Updated at : 06 Aug 2025 01:00 PM (IST)
పోస్టాఫీస్‌లో డబ్బులు సేవ్ చేస్తే వచ్చే ప్రయోజనాలివే ( Image Source : Other )
Top Post Office Schemes with High Returns : బ్యాంక్‌లో పెట్టే అమౌంట్ కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్, ఎక్కువ సేఫ్టీని ఇచ్చే వాటిపై ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే మీరు పోస్ట్ఆఫీస్ పథకాలను ట్రై చేయవచ్చు. తక్కువ డబ్బు నుంచి ఎక్కువ మొత్తాన్ని ఫ్యూచర్ కోసం సేవ్ చేయాలనుకుంటే బ్యాంక్ కంటే ఎక్కువ వడ్డీని ఇచ్చే పోస్ట్ఆఫీస్ పథకాలు ఎంచుకుంటే మంచిది.
ఇన్వెస్ట్మెంట్ ఎంత డబ్బుతో స్టార్ట్ చేయాలి? దానికి వచ్చే లాభమెంతా? ఎన్ని సంవత్సరాలు ఉంచి దానిని లాభాలు అందుతాయి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మరి పోస్టాఫీస్‌లో సేవ్ చేసుకోగలిగి.. అధిక ఇంట్రెస్ట్‌ని అందించే పథకాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
పోస్టాఫీస్‌లో కట్టగలిగే ఈ టైమ్ డిపాజిట్ స్కీమ్‌కి మినిమం ఇన్వెస్ట్మెంట్ నెలకి 1000 ఉంటుంది. నెల నెలా మీరు ఈ అమెంట్ కట్టొచ్చు. మీ బడ్జెట్ కాస్త ఎక్కువ ఉంటే.. వెయ్యికి పైగా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇంట్రెస్ట్ రేట్ 6.9 నుంచి 7.5 శాతం ఉంటుంది. ఒక సంవత్సరం పాటు డబ్బు కడితే 6.9 శాతం వడ్డీ, రెండు సంవ్సరాలు అయితే 7.0 శాతం, మూడు సంవత్సరాలు కడితే 7.1 శాతం, 5 సంవత్సరాలు కడితే 7.5 శాతం వడ్డీ వస్తుంది.
పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ పథకం పెట్టుబడిపై హామీతో కూడిన రాబడి అందిస్తుంది. 5 సంవత్సరాలు ఈ డిపాజిట్లు సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపునకు అర్హత పొందుతాయి. దీనిని సంవత్సరం నుంచి 5 సంవత్సరాలు కట్టవచ్చు.
ఇది కూడా పోస్టాఫీస్‌లో కట్టగలిగే మరో పథకం. దీనిలో కూడా మినిమం ఇన్వెస్ట్మెంట్ 1000. 7.7 శాతం వడ్డీ వస్తుంది. టెన్యూర్ 5 సంవత్సరాలు. ఇది భారత ప్రభుత్వంతో చేసుకునే పొదుపు బాండ్ వంటిది. దీనిని ప్రధానంగా చిన్న, పొదుపు, ఆదాయ పన్ను పెట్టుబడుల కోసం ఉపయోగిస్తారు.
పోస్ట్ ఆఫీస్‌లో మంథ్లీ ఇన్కమ్ స్కీమ్ కూడా మంచి రిటర్న్స్ ఇస్తుంది. దీనిలో 1000 రూపాయలు మినిమం ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. అలాగే 9 లక్షల వరకు డబ్బు వేయవచ్చు. జాయింట్ అకౌంట్ ఉన్నవారు 15 లక్షలు కట్టవచ్చు. దీనిలో ఇంట్రెస్ట్ రేట్ 7.4 శాతం ఉంటుంది. టెన్యూర్ 5 సంవత్సరాలు ఉంటుంది.
సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అనేది రిటైర్డ్ వ్యక్తులకు ఆర్థిక భద్రతను, ఆదాయాన్ని అందించే స్కీమ్. ఇది ప్రభుత్వ-మద్దతుతో రూపొందించారు. దీనిలో 1000 నుంచి 30 లక్షలు పెట్టవచ్చు. ఇంట్రెస్ట్ రేట్ 8.2 శాతం ఉంటుంది. 5 సంవత్సరాల టెన్యూర్ ఉంటుంది. అయితే 60 దాటిన వారు మాత్రమే దీనికి అర్హులు.
ఆడపిల్లలు ఉండేవారికి ఈ పథకం చాలా మంచిది. సంవత్సరానికి 250 నుంచి 1.5 లక్షణలు కట్టవచ్చు. దీనికి కూడా ఇంట్రెస్ట్ రేట్ 8.2 గానే ఉంది. అయితే అమ్మాయికి 18 లేదా 21 ఏళ్ల మధ్యలో ఈ డబ్బును తీసుకునేందుకు అర్హులు అవుతారు. పదేళ్లలోపు ఆడపిల్లలు ఉండేవారు ఈ పథకానికి అర్హులు.
ఈ 5 పోస్టాఫీస్ పథకాలు బ్యాంక్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తున్నాయి. అయితే బడ్జెట్ సమయంలో ఈ పథకాల్లో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి చెక్ చేసుకుంటూ ఉండండి. మీ డబ్బును సేఫ్‌గా ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు వీటిని ఫాలో అయిపోతే మంచిది.
Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం
ఈ PPF పథకంలో చేరితే, రూ.4 వేల పెట్టుబడితో లక్షల కార్పస్ మీ సొంతం
Home Loans Interest Rate: అతి తక్కువ వడ్డీకే హోం లోన్ ఇచ్చే టాప్ 5 బ్యాంకులు ఇవే.. పూర్తి జాబితా
Spam Calls: బీమా కంపెనీలు 1600 నంబర్ నుంచే కాల్స్ చేయాలి! స్పామ్ కాల్స్‌పై కఠిన చర్యల దిశగా TRAI
Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
Uttam Kumar Reddy: కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
Champion OTT : 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
iphone 15 Discount: ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
Balakrishna : యంగ్ లుక్‌లో బాలయ్య? - హిస్టారికల్ డ్రామా 'NBK111' కోసం క్రేజీ టైటిల్