News
News
X

సూపర్ మార్కెట్లో రిఫ్రిరేటర్లో పెట్టి అమ్మే ఈ ఆహారాలను కొనకుంటేనే బెటర్

సూపర్ మార్కెట్లో రిఫ్రిజ్‌రేటర్లో పెట్టి కొన్ని రకాల ఆహారాలు అమ్ముతారు. వాటిని కొనకూడదు అంటున్నారు పోషకాహార నిపుణులు

FOLLOW US: 
 
ఫ్రోజెన్ ఫుడ్స్... అంటే రిఫ్రిజెరేటర్లో పెట్టి సూపర్ మార్కెట్లలో అమ్మే ఆహారాలు. చాలా రకాల ఆహారాలు ఇందులో ఉన్నాయి. మాంసాహారం, శాకాహారాల్లో ఎన్నో రకాల ఫ్రోజెన్ ఫుడ్స్ ఉన్నాయి. అయితే కొన్ని రకాల ఆహారాలను మాత్రం రిఫ్రిజరేటర్లలో పెట్టి అమ్మితే కొనవద్దని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఆకర్షణీయమైన ప్యాకింగ్ చేసి రిఫ్రిజరేటర్లో కనిపించగానే చాలా మంది కొనేస్తారు. ఇదే ఆరోగ్యానికి పెద్ద సమస్యలా మారింది. అవసరం లేకపోయినా కొన్ని ఆహారాలను రిఫ్రిజరేటర్లలో పెట్టి అమ్ముతారు. 

బ్రకోలి
ఆకుపచ్చని కూరగాయ బ్రకోలి. దీన్ని సాధరణ కూరగాయల్లా బయటపెట్టి అమ్మవచ్చు. కానీ రిఫ్రిజెరేటర్లలోనే పెడతారు. కారణం వాటి ఖరీదు ఎక్కువ. అందరూ కొనరు. అవి అమ్ముడయ్యే దాకా, వాటి జీవిత కాలం పెంచేందుకు రిఫ్రిజరేటర్లలో పెట్టడం ప్రారంభించారు. వీటిని ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల రుచిని కోల్పోతుంది. 6పోషక విలువలు కూడా తగ్గిపోతాయి. ముఖ్యంగా ఇలా ఎక్కువ కాలం పాలూ ఫ్రి‌జ్‌లో పెట్టిన బ్రకోలీని తినడం వల్ల చిన్న చిన్న గడ్డల్లాంటివి ఏర్పడే అవకాశం ఉంది. 

స్ట్రాబెర్రీలు
స్ట్రాబెర్రీలు ఏడాది పొడవునా సూపర్ మార్కెట్లో లభిస్తూనే ఉంటాయి. ఫ్రిజ్‌లో పెట్టి అమ్ముతుంటారు. అయితే వీటిని వాటి సీజన్లో మాత్రమే కొనాలని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే ఇవి పోరస్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. అంటే ఇవి నీటితో నిండి ఉంటాయి. వీటిని ఫ్రిజ్లో పెట్టడం వల్ల ఘనీభవిస్తాయి. ఆ ప్రక్రియలో లోపలి పోషకాలు విచ్చిన్నమవుతాయి. ఇది వాటిని రుచిని నాశనం చేస్తుంది. అదనపు ద్రవాన్ని అందులో నింపుతుంది. అలాంటివి తినడం వల్ల ఉపయోగం లేదు. 

కొత్తిమీర, పుదీనా
ఇవి ఔషధ ఆకుకూరల జాతికి చెందుతుంది. ఇవి మంచి సువాసనను కలిగి ఆహారానికి అదనపు రుచిని అందిస్తాయి. అయితే వీటిని కూడా ఫ్రిజ్లలో పెడుతున్నారు. ముఖ్యంగా వీటి ఆకులను తరిగి డబ్బాల్లో వేసి ఫ్రిజ్ల్ లలో పెట్టి అమ్ముతున్నారు. వాటిని కొనుక్కుంటే కత్తిరించే పనిలేకుండా నేరుగా వాడేయచ్చని కొనుగోలు దారుల ఆలోచన. అందుకే కొనేస్తుంటారు. కానీ అవి ఫ్రిజ్లో గడ్డకట్టి రుచిని, పోషకాలను కోల్పోతాయి. వాటిని తిన్నా తినకపోయినా ఒక్కటే. ఇంట్లో కూడా నార్మల్ ఫ్రిజ్లో పెట్టాలి కానీ, డీప్ ఫ్రిజ్ లో పెట్టకూడదు.  

News Reels

నగ్గెట్లు, ప్యాటీలు
వెజ్ నగ్గెట్లు, బర్గర్ ప్యాటీలు, పిజ్జా బేస్‌లు ఫ్రిజ్లో నిల్వ చేసినవి కొనకూడదు. వీటిని ఫ్రిజ్లో పెట్టడం వల్ల ఇందులో ఉండే పిండి పదార్థాలు, ఎమల్సిఫైయర్లు విపరీత ఫలితాలను ఇస్తాయి. ఓవర్ ఫ్రీజింగ్ చేయడం వల్ల రుచి కూడా బాగోదు. వీటిని వేయించుకుని తినడం వల్ల మరింతగా ట్రాన్స్ ఫ్యాట్లు శరీరంలో చేరిపోతాయి.

పుట్టగొడుగులు
పుట్టగొడుగులు బయట పెట్టి అమ్మేవే కొనుక్కోవాలి. కానీ సంతల్లో బయటపెట్టే అమ్ముతారు. కానీ సూపర్ మార్కెట్లో మాత్రం ఫ్రోజెన్ ఫుడ్ గా మార్చేస్తారు. ఆ పుట్టగొడుగులను కొనకూడదు. ఎందుకంటే ఫ్రిజ్లో ఎక్కువ కాలం పెట్టిన పుట్టగొడుగులు చూడటానికి తాజాగా కనిపిస్తాయి. కానీ వాటిని వండే ముందు బయటపెడితే కాసేపటికే మెత్తగా మారిపోతాయి. వండినా కూడా రుచి ఉండవు. 

Also read: మగవారూ జాగ్రత్త, కాలుష్యంతో తగ్గుతున్న సంతానోత్పత్తి సామర్ధ్యం

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Published at : 05 Nov 2022 08:20 AM (IST) Tags: Avoid these foods SuperMarket food Frogen Foods

సంబంధిత కథనాలు

మిరపకాయలకు ఓ హిస్టరీ ఉందన్న విషయం మీకు తెలుసా.? అసలు మిర్చీ ఎందుకు కారంగా ఉంటుంది?

మిరపకాయలకు ఓ హిస్టరీ ఉందన్న విషయం మీకు తెలుసా.? అసలు మిర్చీ ఎందుకు కారంగా ఉంటుంది?

Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా? రోజూ ఈ పిండితో చేసిన రోటీలు తినండి - ఆ నటి డైట్ ఇదేనట!

Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా? రోజూ ఈ పిండితో చేసిన రోటీలు తినండి - ఆ నటి డైట్ ఇదేనట!

Ears Cleaning: ఇయర్ బడ్స్‌తో చెవులు శుభ్రం చేస్తున్నారా? ఈ పొరపాట్లు చేశారంటే వినికిడి లోపం రావొచ్చు

Ears Cleaning: ఇయర్ బడ్స్‌తో చెవులు శుభ్రం చేస్తున్నారా? ఈ పొరపాట్లు చేశారంటే వినికిడి లోపం రావొచ్చు

Cancer: వైన్ ఆరోగ్యానికి మంచిదేనా? క్యాన్సర్ ప్రమాదం ఉందా?

Cancer: వైన్ ఆరోగ్యానికి మంచిదేనా? క్యాన్సర్ ప్రమాదం ఉందా?

Garlic: చలికాలంలో వెల్లులి తింటే జలుబు, దగ్గు దరిచేరవా?

Garlic: చలికాలంలో వెల్లులి తింటే జలుబు, దగ్గు దరిచేరవా?

టాప్ స్టోరీస్

TS Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, దివ్యాంగుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ

TS Govt :  తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, దివ్యాంగుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ

NRI Hospital Godava : ఎన్నారై ఆస్పత్రి డైరక్టర్ల మధ్య గొడవలే కొంప ముంచాయా ? ఈడీ, ఐటీ దాడుల వెనుక అసలేం జరిగింది ?

NRI Hospital Godava : ఎన్నారై ఆస్పత్రి డైరక్టర్ల మధ్య గొడవలే కొంప ముంచాయా ? ఈడీ, ఐటీ దాడుల వెనుక అసలేం జరిగింది ?

Impact Player: ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ - ఒక ఆటగాడిని అదనంగా!

Impact Player: ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ - ఒక ఆటగాడిని అదనంగా!

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?