News
News
వీడియోలు ఆటలు
X

Cooking Oil: మీరు వాడే వంట నూనె గుండెకు మంచిదేనా? బెస్ట్ కుకింగ్ ఆయిల్ గురించి ఇలా తెలుసుకోండి

గుండె జబ్బులు రాకుండా చూసుకోవాలంటే వంట నూనె మీద శ్రద్ధ పెట్టాలి. నూనె శరీరానికి చాలా హాని చేస్తుంది. గుండెకి మేలు చేసే నూనె తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.

FOLLOW US: 
Share:

వంటకు వివిధ రకాల నూనెలు ఉపయోగిస్తారు. ఈ నూనె అంతా శరీరానికి సులభంగా చేరిపోతుంది. కానీ ఆ నూనె గుండెను ప్రమాదంలో పడేస్తుందనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఆయిల్ ఎక్కువగా వాడకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఎటువంటి నూనె అయినా కొవ్వుతో తయారవుతుంది. అందుకే దాన్ని మితంగా తీసుకోవడం ఆరోగ్యకరమైన గుండెకు మంచిదని వైద్యులు సూచిస్తారు.

కొన్ని కొవ్వులు మంచివే

కొన్ని కొవ్వులు శరీరానికి మంచివి. మోనోఅన్ శాచురేటెడ్, పాలీఅన్ శాచురేటెడ్ కొవ్వులు కలిగిన నూనెళ్ళు ఆరోగ్యకరమైనవి. ఇక సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్ కొవ్వులు అనారోగ్యకరమైనవి. ఇక వంట నూనె విషయానికి వస్తే నాణ్యత కలిగిన నూనె తక్కువ పరిమాణంలో వాడుకోవడం ముఖ్యం. అధిక నూనె తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్/ట్రైగ్లిజరైడ్స్ పేరుకుపోవచ్చు. గుండె జబ్బులతో సహా అనేక సమస్యలను తీసుకొస్తుంది.

ఏది మంచి వంట నూనె అని ఎలా కనుక్కోవాలి?

గుండెకి మేలు చేసే ఆరోగ్యకరమైన వంట నూనెలో సంతృప్త కొవ్వులు తక్కువగా ఉంటాయి. ప్రతి నూనెకి స్మోకింగ్ పాయింట్ అనేది ఉంటుంది. కొన్ని నూనెలు అధిక వేడికి సరిపోతే కొన్ని తక్కువ వేడి మీద వండుకోవాలి. ఇంకొన్నిటిని వేడి చేయకూడదు. ఎందుకంటే దాని నుంచి వెలువడే విషపూరిత పొగ, ఫ్రీ రాడికల్స్ అనారోగ్యాన్ని కలుగజేస్తాయి. శుద్ధి చేసిన నూనెలకు స్మోకింగ్ పాయింట్లు ఎక్కువ.

ఏ నూనె ఎలా ఉపయోగించాలి?

బాదం, హాజేల నట, పొద్దు తిరుగుడు, శుద్ధి చేసిన ఆలివ్ నుంచి తీసిన నూనెలు అధిక స్మోక్ పాయింట్ నూనెలు. డీప్ ఫ్రై చేయడానికి ఇవి చాలా మంచిది. కనోలా, గ్రేప్ సీడ్ ఆలివ్ ఆయిల్ నూనెలు బేకింగ్, ఓవెన్ వంతలకు ఉత్తమం. మీడియం పొగ పాయింట్లను కలిగి ఉంటాయి. మొక్క జొన్న, గుమ్మడి గింజల నూనె, సోయా బీన్ నూనెలు తక్కువ వేడి బేకింగ్, సాస్ లకు మంచివి. మీడియం స్మోక్ పాయింట్ ను కలిగి ఉంటాయి. ఇక అవిసె గింజల నూనె, వాల్ నట్, గోధుమలు జెర్మ్ ఆయిల్ డ్రెస్సింగ్, డిప్ కు మంచిది. వంట కోసం వీటిని ఉపయోగించకూడదు.

వంటకు ఏది మంచి నూనె?

ఇంట్లో ఇన్ని రకాల నూనెలు నిల్వ చేసుకుని ఉపయోగించడం సాధ్యం కాదు. అందుకే ఆలివ్ నూనె ఉత్తమమైన వాటిలో ఒకటి. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతుంది. భారతీయులు ఆవాల నూనె, నెయ్యి ఎక్కువగా ఉపయోగిస్తారు. నెయ్యిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఇవి మంటను తగ్గించడంలో సహాయపడతాయి. గుండె జబ్బుల నివారణలో కీలక పాత్ర పోషిస్తాయి. రక్తపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నెయ్యి గుండె జబ్బుల ప్రమాదాన్ని మితంగా తగ్గించడంలో సహాయపడుతుంది. కానీ అధికంగా తీసుకుంటే అందులోని సంతృప్త కొవ్వులు కారణంగా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. దీని కారణంగానే నెయ్యి మితంగా తీసుకోవాలి. ఆహారంలో 10 శాతం వరకు నెయ్యి తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆవాల నూనెలో సంతృప్త కొవ్వు తక్కువగా ఉంటుంది. మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (MUFA), పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (PUFA) ఎక్కువగా ఉంటాయి. ఇది మంచి కొలెస్ట్రాల్ (HDL) పెంచి చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గించడంలో సహాయపడుతుంది.

రోజుకి ఎంత వాడాలి?

నూనె లేకుండా కూరలు వండుకోవడం చాలా కష్టం అందుకని మితంగా మాత్రమే తీసుకోవాలి. ఆరోగ్యకరమైన గుండెకు శారీరక శ్రమ ఎంత అవసరమో ఆహారం కూడా అంతే అవసరం.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: కిడ్నీ క్యాన్సర్ ఆడవాళ్ళకి మాత్రమే వస్తుందా? అపోహలు-వాస్తవాలు ఇవే

Published at : 25 Apr 2023 06:00 AM (IST) Tags: Cooking Oil Heart Health Best Oils For Heart Best Cooking Oil

సంబంధిత కథనాలు

Diabetes: మనదేశంలో 10 కోట్ల మందికి పైగా మధుమేహ రోగులు, ఆ రాష్ట్రంలోనే ఎక్కువమంది

Diabetes: మనదేశంలో 10 కోట్ల మందికి పైగా మధుమేహ రోగులు, ఆ రాష్ట్రంలోనే ఎక్కువమంది

Heart Attack: గర్భనిరోధక మాత్రలు అతిగా వాడే మహిళలు గుండెపోటుకు గురయ్యే అవకాశం ఎక్కువ

Heart Attack: గర్భనిరోధక మాత్రలు అతిగా వాడే మహిళలు గుండెపోటుకు గురయ్యే అవకాశం ఎక్కువ

kadaknath: ఈ నల్ల కోడిమాంసాన్ని తింటే మంచి రుచే కాదు, ఎంతో ఆరోగ్యం కూడా

kadaknath: ఈ నల్ల కోడిమాంసాన్ని తింటే మంచి రుచే కాదు, ఎంతో ఆరోగ్యం కూడా

Jaggery: వేసవిలో రోజూ చిన్న బెల్లం ముక్క తినడం వల్ల అలాంటి సమస్యలన్నీ దూరం

Jaggery: వేసవిలో రోజూ చిన్న బెల్లం ముక్క తినడం వల్ల అలాంటి సమస్యలన్నీ దూరం

మద్యం అతిగా తాగితే 33 రకాల జబ్బులు, షాకింగ్ న్యూస్ చెప్పిన కొత్త అధ్యయనం

మద్యం అతిగా తాగితే 33 రకాల జబ్బులు, షాకింగ్ న్యూస్ చెప్పిన కొత్త అధ్యయనం

టాప్ స్టోరీస్

Telangana Poltics : తెలంగాణ చీఫ్‌ను మారుస్తారని మళ్లీ ప్రచారం - బీజేపీ హైకమాండ్ పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దుతుంది ?

Telangana Poltics :  తెలంగాణ చీఫ్‌ను మారుస్తారని మళ్లీ ప్రచారం - బీజేపీ హైకమాండ్ పరిస్థితుల్ని ఎలా  చక్కదిద్దుతుంది ?

Devineni Uma : అహంకారం వల్లే ఓడిపోయాం - దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు !

Devineni Uma : అహంకారం వల్లే ఓడిపోయాం -  దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు !

NBK 109 Movie : మారణాయుధాలతో పాటు మందు బాటిల్ - బాలకృష్ణతో బాబీ ప్లాన్ ఏంటి?

NBK 109 Movie : మారణాయుధాలతో పాటు మందు బాటిల్ - బాలకృష్ణతో బాబీ ప్లాన్ ఏంటి?

Thalaivar 170 : తమిళ సినిమాలో అమితాబ్ బచ్చన్ - 32 ఏళ్ళ తర్వాత రజనీతో!

Thalaivar 170 : తమిళ సినిమాలో అమితాబ్ బచ్చన్ - 32 ఏళ్ళ తర్వాత రజనీతో!