(Source: ECI/ABP News/ABP Majha)
Male Fertility: అబ్బాయిలూ, మీరేం పోటుగాళ్లు కాదు- ఇలా చేయకుంటే జీవితంలో తండ్రి కాలేరు!
బిడ్డను కనాలంటే భార్యత పాటూ భర్త కూడా ఆరోగ్యంగా ఉండాలి.
చాలా మంది బిడ్డను కనే విషయానికి వచ్చేసరికి భార్య ఆరోగ్యంగా ఉంటే చాలు అనుకుంటారు. తమ ఆరోగ్యం సంగతి పట్టించుకోరు. తాము సూపర్ పర్‌ఫెక్ట్ అనుకుంటారు. కానీ వారిలో కూడా అనేక సమస్యలు గర్భం రాకుండా అడ్డుకుంటాయని చెబుతున్నారు నిపుణులు. అందులో ఒకటి అజూస్మెర్మియా (Azoospermia). అంటే వీర్యం తక్కువగా ఉండడం లేదా, ఎజాక్యలేషన్ సమయంలో స్పెర్మ్ లేకపోవడం అని అర్థం. ఆ మార్గంలో అవరోధాల వల్ల ఈ సమస్య ఏర్పడవచ్చు. వీర్య కణాల సంఖ్య సరిపడినంత ఉన్నప్పటికీ ఈ అజూస్మెర్మియా వల్ల అవి స్త్రీ గర్భంలోని అండాలను చేరలేవు. దీని వల్ల గర్భం ధరించడం కష్టంగా మారుతుంది. వంద మంది మగవారిలో 30 నుంచి 35 మందిలో సంతానోత్పత్తి సమస్యలు కనిపిస్తున్నాయి. ఇక అజూస్మెర్మియా సమస్య వల్ల పదిశాతం మంది మగవారు సంతానోత్పత్తికి నోచుకోలేకపోతున్నారు. WHO నివేదిక ప్రకారం, ఆరోగ్యకరమైన స్పెర్మ్ కౌంట్ ప్రతి మిల్లీలీటర్‌కు 15 మిలియన్లు ఉండాలి. కానీ అంతకన్నా తక్కువుండే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. వీర్యకణాల సంఖ్య తగ్గకుండా ఉండాలన్నా, అజూస్మెర్మియాలాంటి అవరోధాలు రాకుండా ఉండాలన్నా పురుషులు కొన్ని అలవాట్లు చేసుకోవాలి.
ధూమపానం వదిలేయాలి...
ధూమపానం, మద్యపానం స్మెర్మ్ కౌంట్ పై చాలా ప్రభావం పడుతుంది. అధిక పొగ, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వీర్య కణాల నాణ్యత తగ్గుతుంది. రోజూ ఆల్కహాల్ తాగే మగవారిలో టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గుతాయి. ఇలా తగ్గడం వల్ల అంగస్థంభన వంటి సమస్యలు కలుగుతాయి. అలాగే వీర్యకణాల ఉత్పత్తి కూడా తగ్గుతుంది. అలాగే మధుమేహం, అధికరక్తపోటు, ఊబకాయం వల్ల కూడా స్మెర్మ్ కౌంట్, నాణ్యత తగ్గుతాయి.
ఒత్తిడికి చెక్
ఎలాంటి పరిస్థితుల్లోనూ అధిక ఒత్తిడికి లోనవ్వకూడదు. ఒత్తిడి స్థాయిలు పెరిగితే వీర్య కణాల సంఖ్య తగ్గుతుంది. ముఖ్యంగా లైంగిక జీవితంపై ఆసక్తి తగ్గిపోతుంది. ధ్యానం, యోగా వంటి వాటి ద్వారా ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి.
సరైన బరువు
అధిక బరువు, ఊబకాయం వల్ల మగవారిలో సంతానోత్పత్తి సమస్యలు కలుగుతాయి. అందుకు వారు బరువు తగ్గాలి. వారి ఎత్తుకు తగ్గ బరువును మెయింటేన్ చేయాలి. దీని వల్ల వీర్యకణాలు చురుగ్గా కదులుతాయి. గర్భం దాల్చేందుకు అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహరాన్ని తినడం ద్వారా బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి.
పరిశుభ్రత
మనిషి పరిశుభ్రంగా ఉండడం కూడా చాలా ముఖ్యం. టాయిలెట్ కి వెళ్లాక చేతులు కడుక్కోవడం, జననేంద్రియ ప్రాంతాన్ని శుభ్రపరుచుకోవడం వంటివి చేయాలి.ఎప్పుడూ శుభ్రమైన దుస్తులను ధరించాలి. దుస్తులు వదులుగా, ఊపిరి ఆడేవిధంగా ఉండాలి. మీ చుట్టూ ఉండే పరిసరాలు వ్యాధులు, ఇన్ఫెక్షన్లు ప్రబలే విధంగా ఉండకూడదు. పచ్చగా,ఆహ్లాదంగా ఉండేలా చూసుకోవాలి.
Also read: రాకాసి మిరపకాయ, ప్రపంచంలోనే అత్యంత స్పైసీ మిర్చి, అస్సామీల పళ్లెంలో ఇది ఉండాల్సిందే
Also read: బంగాళాదుంపలు కేవలం కూరకే కాదు, పాత్రల తుప్పును పోగొట్టి, ఆ మరకల్ని మాయం చేస్తాయి