International Tea Day : అంతర్జాతీయ టీ దినోత్సవం స్పెషల్.. టీతో కలిగే లాభాలు, తాగడానికి పర్ఫెక్ట్ టైమ్ ఇదే
Tea Day 2025 : అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా టీ తాగితే కలిగే లాభాలు ఏంటో.. టీ తాగడానికి ఏది పర్ఫెక్ట్ టైమ్ వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం.

International Tea Day 2025 : టీ లేనిదే రోజు స్టార్ట్ కాదు కొందరికి. మరికొందరు టీ తాగితే ఎనర్జీ వస్తుందని ఫీల్ అవుతారు. ఫ్రెండ్స్‌తో ముచ్చట్లు పెట్టాలన్నా.. తలనొప్పిని దూరం చేసుకోవాలన్నా చాలామంది ఆశ్రయించేది టీనే. ఆ టీ ప్రత్యేకతను చాటుతూ.. ప్రతి సంవత్సరం మే 21వ తేదీన అంతర్జాతీయ టీ దినోత్సవం నిర్వహిస్తున్నారు. మరి దీని చరిత్ర, ప్రాముఖ్యత, టీ గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
టీ దినోత్సవ చరిత్ర..
భారతదేశం, శ్రీలకం వంటి ఇతర దేశాలు 2005లో టీ దినోత్సవాన్ని పాటించాయి. తేయాకు ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సాహిస్తూ.. 2019లో ఐక్యరాజ్య సమితి మే 21వ తేదీని అంతర్జాతీయ తేయాకు దినోత్సవంగా అధికారికంగా గుర్తించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తేయాకు ఆర్థికంగా, సాంస్కృతికంగా, ఆరోగ్యానికి ఏ విధంగా హెల్ప్ చేస్తుందో.. వాటి ప్రాముఖ్యతను గుర్తించి చెప్పడమే దీని లక్ష్యం.
టీ దినోత్సవ ప్రాముఖ్యత
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రైతులు, కార్మికులు, వినియోగదారులపై టీ వ్యాపారం ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో అవగాహన పెంచుతారు. ప్రపంచవ్యాప్తంగా టీ సాంస్కృతిని, ఆర్థిక ప్రాముఖ్యతను తెలియజేస్తారు.
టీ తాగడం వల్ల కలిగే లాభాలు..
అంతర్జాతీయ టీ దినోత్సవం కేవలం బిజినెస్‌నే కాదు.. ఆరోగ్యాన్ని కూడా సూచిస్తుంది. మరి ఈ స్పెషల్ డే రోజు టీలోని ప్రధాన రకాలు ఏంటి? వాటివల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.
- గ్రీన్ టీ - దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెటబాలీజం పెంచి.. మెదడును యాక్టివ్‌గా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి.
- బ్లాక్ టీ - పాలు, పంచదార లేకుండా చేసే ఈ టీ బీపీని కంట్రోల్ చేస్తుంది. గట్ హెల్త్‌ని ప్రమోట్ చేస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
- వైట్ టీ - దీనిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఏజింగ్ లక్షణాలు కలిగి ఉంటుంది. స్కిన్ హెల్త్‌ని ప్రమోట్ చేస్తుంది.
- ఉలాంగ్ టీ - ఇది బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
- హెర్బల్ టీ - చమోలీ, పెప్పర్మింట్ వంటి హెర్బల్ టీలు మెరుగైన జీర్ణ వ్యవస్థను అందిస్తాయి. ఒత్తిడి నుంచి విముక్తిని ఇచ్చి మెరుగైను నిద్రను అందిస్తాయి.
టీ తాగడానికి మంచి సమయమిదే..
ఉదయం 9 నుంచి 11 మధ్యలో టీ తీసుకోవచ్చు. ఈ సమయంలో మీరు బ్లాక్ టీ లేదా గ్రీన్ టీ తీసుకోవచ్చు. ఇది నిద్రమత్తును తగ్గించి.. పనిపై ఫోకస్‌ను పెంచుతుంది. మెటబాలీజం పెంచి కెలరీలు కరిగేలా చేస్తుంది. మధ్యాహ్నం 1 నుంచి 3 మధ్యలో గ్రీన్ టీ లేదా ఉలాంగ్ టీ తాగొచ్చు. ఇది ఎనర్జీని పెంచుతుంది. సాయంత్రం 6 లోపల హెర్బల్ టీలు తీసుకోవచ్చు.
ఖాళీ కడుపుతో టీ తాగకూడదని గుర్తించుకోండి. అలా తాగడం వల్ల ఎసిడిటీ, కడుపులో ఇబ్బందులు ఏర్పడుతాయి. అలాగే భోజనం చేసిన వెంటనే కూడా టీ తాగకూడదు. ఇది ఫుడ్లోని ఐరన్ శరీరానికి అందకుండా చేస్తుంది. కెఫిన్ సెన్సిటివిటీ ఉన్నవారు టీ తీసుకోకపోవడమే మంచిది. టీని ఎక్కువగా బాయిల్ చేసి తీసుకోకూడదు. గ్రీన్ టీ కోసం నీటిని ఎక్కువగా మరిగించకూడదు. టీలో మీరు పంచదార వేసుకునే అలవాటు ఉంటే దానిని పరిమితం చేయాలి.






















