అన్వేషించండి

International Day for Failure : అంతర్జాతీయ ఫెయిల్యూర్స్ డే 2025.. ఈ టిప్స్​తో ఓటమిని అధిగమించేయండి

Failure Day 2025 : సక్సెస్ రుచి అందరికీ దొరక్కపోవచ్చు కానీ.. ఫెయిల్యూర్ అనేది చాలామందికి రుచి చూపిస్తుంది. అలాంటి ఈ ఫెయిల్యూర్​ని ఎలా ఓవర్​కామ్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. 

International Day for Failure 2025 : "గెలిస్తే ప్రపంచానికి నువ్వు తెలుస్తావ్.. కానీ ఓడిపోతే ప్రపంచమంటే ఏంటో నీకు తెలుస్తుంది". ఓటమి గురించి ఓ సినిమాలోని డైలాగ్ ఇది. నిజమే విజయాన్ని సాధించాలంటే ఎంతో కృషి, పట్టుదల ఉండాలి. కానీ ఓటమిలో ఇవేమి కనిపించవు. ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా ఓడిపోతే ప్రపంచం వాటిని పట్టింకోదు. ఓడిపోయినవాడిగానే ముద్ర వేస్తుంది. ఈ ఫేజ్​ని చాలామంది తమ లైఫ్​లో ఫేస్ చేస్తూనే ఉంటారు. అలాంటివారికోసమే ఈ ఇంటర్నేషనల్ ఫెయిల్యూర్​ డే(Failure Day).

ఫెయిల్యూర్​ డే చరిత్ర ఇదే (Failure Day History)

ఓటమిని అంగీకరిస్తూ.. దానితో కృంగిపోకుండా.. తప్పుల నుంచి నేర్చుకుని.. మళ్లీ రీస్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఫిన్లాండ్​లో 2010లో ఇంటర్నేషనల్​ ఫెయిల్యూర్ డే ప్రారంభించారు. ఆల్టో యూనివర్సిటీ విద్యార్థులు స్టార్ట్ చేసిన ఈ స్పెషల్ డే.. తర్వాత ఇతర దేశాలకు కూడా వ్యాపించింది. ఇలా ప్రతి ఏడాది అక్టోబర్ 13వ (October 13) తేదీన అంతర్జాతీయ ఫెయిల్యూర్ డే నిర్వహిస్తున్నారు. Failure వస్తే మనం ఏ విధంగా ఉండాలి? ఎలా దానిని సక్సెస్​గా మలచుకోవాలనేదానిపై అవగాహన కల్పిస్తారు. 

ఓ వ్యక్తి ఓ విషయంలో ఫెయిల్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు అతి దగ్గర్లో ఆగిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. రీజన్స్ తెలిసినా.. చాలామంది ఓటమి గురించి పదే పదే అడిగి ఇబ్బంది పెడుతూ ఉంటారు. కొన్నిసార్లు ఎవరూ ఏమి అడగకున్నా.. మన మీద మనకే డౌట్ వచ్చేస్తుంది. తెలియకుండా మనమే ఎక్కువ ఆలోచించేస్తూ ఉంటాము. దాని నుంచి బయటకు రావడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఫెయిల్ అయినప్పుడు దానిని నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటి? దాని నుంచి ఎలా బయటకు రావాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఓటమిని ఎలా తీసుకోవాలంటే.. (How to take Failure)

ఏదైనా రేసులో అందరూ విజయాన్ని సాధించలేకపోవచ్చు. అలా అని వెనకొచ్చిన వారంతా ఓడిపోయినట్టు కాదు.. వాళ్లు ఎఫర్ట్స్ పెట్టలేదని కాదు. అసలు ఆ రేస్​కు వెళ్లాలనుకోవడమే ఓ సక్సెస్. అయితే విజయాన్ని అందుకోవాలంటే.. మీరు పెట్టిన ఎఫర్ట్స్ ఏంటి? చేసిన తప్పులు ఏంటి? వంటివి తెలుసుకోవడానికి ఫెయిల్యూర్ బాగా ఉపయోగపడుతుంది. ప్రాక్టీస్ టెస్ట్​గా తీసుకుని.. మళ్లీ ట్రే చేయాలి. ఆ సమయంలో చాలామందికి ఎన్నో రకాల ఒత్తిళ్లు ఉంటాయి కానీ.. గివ్ అప్ ఇవ్వకూడదు. 

ఓటమిని ఎలా అధిగమించాలంటే.. (Overcome Failure)

ఓటమిని అధిగమించడానికి ఎన్నో దారులు ఉన్నాయి. కానీ వాటిని గుర్తించి.. ఫాలో అయితేనే పెద్ద విజయాలు మీ సొంతం అవుతాయి. సక్సెస్ అందరికీ కావాలి. అలా కావాలనుకున్నప్పుడు ఓటమి కూడా దానిలో భాగమేనని గుర్తించాలి. ఇది మీరు మరింత ఎదగడానికి, స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మరి ఓటమిని అధిగమించేందుకు ఏ టిప్స్ ఫాలో అవ్వాలో చూసేద్దాం. 

యాక్సెప్ట్ చేయండి (Accept it)

ఓటమిని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోగలగాలి. అలా తీసుకోకపోతే ఆర్సీబీ 18 సంవత్సరంలో ఐపీఎల్ కప్పు కొట్టేదా? వాళ్లు తమ ఓటమిని అంగీకరించారు కాబట్టే తమ గోల్​ని ఫైనల్​గా రీచ్ అయ్యారు. కాబట్టి మీరు కూడా మీ ఓటమిని యాక్సెప్ట్ చేయండి. దానిని నెగిటివ్​గా తీసుకోవడం కాకుండా.. ఓ పాఠంలా తీసుకోవచ్చు. 

రీజన్ తెలుసుకోవాలిగా.. (Find the Reason)

ఓటమిని యాక్సెప్ట్ చేశారు ఓకే. కానీ ఎందుకు ఓడిపోయారో తెలుసుకోకపోతే మీరు మళ్లీ ఫెయిల్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఓ పని చేయడంలో ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో.. లేదా ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకోవాలి. 

కాన్పిడెన్స్ పెంచుకో.. (Build Confidence)

తప్పు గుర్తించిన తర్వాత దానిపై వర్క్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓటమిని కాన్ఫిడెన్స్​ను దెబ్బతీయొచ్చు. కానీ లెర్నింగ్, ప్రాక్టీస్ అనేది కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుతుంది. దీనివల్ల మీ ప్రయత్నం వృథా కాకుండా ఉంటుంది. 

ప్రశాంతంగా ఉండండి.. (Peace of Mind is Important)

ఓడిపోయనప్పుడు ఎమోషనల్​గా ఇంబ్యాలెన్స్ అవుతారు. ఆ సమయంలో మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకునేందుకు ధ్యానం (Meditation), యోగా, నడక, మ్యూజిక్ లాంటి వాటివి ట్రై చేయవచ్చు. 

గ్యాప్ తీసుకోండి.. (Gap Must)

ఓటమిని చూసిన తర్వాత వెంటనే నిర్ణయాలు తీసుకోవడం మానేయండి. ముందు చేసిన తప్పులు ఏంటి? ఫోకస్ చేయాల్సిన పాయింట్లు.. ప్రాక్టీస్ చేసేందుకు కచ్చితంగా గ్యాప్ తీసుకోవాలి. దీనివల్ల మైండ్ రిఫ్రెష్ అవుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటే.. సబ్జెక్ట్​పై బాగా ఫోకస్ చేయగలుగుతారు. 

ఫ్రెండ్స్, ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. స్క్రాచ్​ నుంచి స్టార్ట్ చేయండి. మీరు చేయగలరనే నమ్మకాన్ని వదలకండి. ఇవన్నీ మీరు సక్సెస్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. అయినా ఓడిపోతే జీవితమే లేదు అనుకోకూడదు. ఓటమి తప్పు కాదు. అందరూ ఏదో అంటున్నారు అని బాధపడకండి. మీ ప్లేస్​లో వారు ఉన్నా జరిగేది ఇదే. కాబట్టి ఓటమితో కృంగిపోకుండా.. అది నేర్పిన అనుభవంతో విజయం వైపు అడుగులు వేయండి. కచ్చితంగా సక్సెస్ అవుతారు. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
Telangana News: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Manaswini Balabommala: శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల

వీడియోలు

Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Ind vs NZ Rohit Sharma Records | మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
Telangana News: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Manaswini Balabommala: శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
World largest Shiva lingam: ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్రతిష్ఠాపన - బీహార్‌లో సనాతన వారసత్వానికి చారిత్రాత్మక ఘట్టం
ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్రతిష్ఠాపన - బీహార్‌లో సనాతన వారసత్వానికి చారిత్రాత్మక ఘట్టం
Tata Punch Facelift ఏ వేరియంట్ మీ మనీకి విలువైన ఎంపిక.. ధర, ఫీచర్లు ఇవే
Tata Punch Facelift ఏ వేరియంట్ మీ మనీకి విలువైన ఎంపిక.. ధర, ఫీచర్లు ఇవే
Sankranti Feast: కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
Rahul Gandhi On Rohit Vemula Act:
"రోహిత్ వేముల చట్టం కోసం ఊరూవాడా, విద్యార్థులంతా కదలాలి" సంచలన ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
Embed widget