అన్వేషించండి

ఓ మై గాడ్.. ‘కోకా కోలా’ రంగులో సరస్సు, అలా ఎందుకు మారిందంటే..

ఈ సరస్సు ఏమిటీ కోకా కోలా రంగులో ఉందని ఆశ్చర్యపోతున్నారా? అయితే తప్పకుండా మీరు దాని గురించి తెలుసుకోవల్సిందే.

మీకు ‘కోకా కోలా’లో స్నానం చేయాలని ఉందా? అయితే మీరు తప్పకుండా బ్రెజిల్‌కు వెళ్లాల్సిందే. అక్కడ ఓ సరస్సు పూర్తిగా కోకా కోలా రంగులోకి మారిపోయింది. దాన్ని చూసేందుకు ఎక్కెడక్కడి నుంచో సందర్శకులు వెళ్తున్నారు. ముఖ్యంగా పిల్లలు ఆ సరస్సులో జలకాలాడుతూ.. కోకా కోలాలోనే స్నానం చేస్తున్నట్లుగా ఫీలవుతున్నారు. ఇంతకీ ఆ సరస్సు ఎందుకు కోకాకోలా రంగులోకి మారింది. కారణం ఏమిటీ?

ఎర్ర సముద్రం, నల్ల సముద్రం గురించి విన్నప్పుడు అవి పూర్తిగా ఆ రంగులోనే ఉంటాయని భావిస్తాం. కానీ, అవి అక్కడి భౌగోళిక పరిస్థితులను బట్టి ఆయా రంగుల్లో కనిపిస్తాయి. అంతేగాక.. ఆ రంగులు దిక్కులను కూడా సూచిస్తాయట. ‘డెడ్ సీ’ విషయానికి వస్తే.. ఆ సముద్రంలో లవణ శాతం ఎక్కువగా ఉండటం వల్ల మనుషులు ఆ నీటిపై తేలుతారు. అలాగే బ్రెజిల్‌లో ఉన్న ‘కోకా కోలా’ సరస్సుకు కూడా ఓ ప్రత్యేకత ఉంది. 

‘రియో గ్రాండే డో నార్టే’లో  ఈ సరస్సును చూస్తే ‘కోకా కోలా’ డ్రింకు మొత్తాన్ని అందులోనే పోశారా అనిపిస్తుంది. వాస్తవానికి అది డ్రింక్ కాదు. పైగా అది కార్బోనేషన్‌కు కూడా గురికాలేదు. ఏ మిశ్రమం కలవకుండానే ఆ సరస్సు ఆ రంగులో కనిపిస్తుంది. ఆ సరస్సు ఆ రంగులో మారడానికి కారణం.. ఆ ప్రాంతంలోని ఖనిజ సంపదే. అయోడిన్, ఐరన్ కేంద్రీకరణ వల్ల ఆ సరస్సులో నీరు ఆ రంగులోకి మారుతోందని పరిశోధకులు తెలిపారు. 

రియో గ్రాండే డో నార్టే రాజధాని నాటల్‌కు సుమారు 100 కిలోమీటర్ల దూరంలోనే ఈ సరస్సు ఉంది. నిత్యం సందర్శకులతో ఈ ప్రాంతం కిటకిటలాడుతూ ఉంటుంది. వేసవి కాలంలో ఈ సరస్సులో నీరు చాలా వేడిగా ఉంటుంది. దీంతో స్థానికులు ఇక్కడ స్నానాలు చేయడానికి వస్తుంటారు. అయితే, ఈ నీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవట. పైగా ఆరోగ్యానికి కూడా మంచిదేనట. ఈ వైరస్ ముగిసిన తర్వాత మీరు బ్రెజిల్‌కు టూర్ వేస్తే తప్పకుండా ఈ సరస్సును సందర్శించండి. 

Also Read: ‘ఫస్ట్‌ నైట్’ బెడ్‌ను రోజా పూలతోనే అలంకరించాలట.. ఎందుకో తెలుసా?

ఖనిజాల వల్ల రంగులు మారే సరస్సులే కాదు.. జలపాతాలు కూడా ఉన్నాయి. అంటార్కిటికాలోని ఓ జలపాతం చిక్కని రక్తం రంగులో కనిపిస్తుంది. దీంతో ఎంతోమంది పరిశోధకులు ఆ జలపాతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. కానీ దాని వెనుక ఉన్న రహస్యాన్ని మాత్రం తెలుసుకోలేకపోయారు. 1911 నుంచి దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత జరిపిన పరిశోధనల్లో కీలక విషయాలు తెలిశాయి. ‘కోకా కోలా’ సరస్సు తరహాలోనే ఇనుప ఖనిజంతో మిళితమైన ఉప్పు నీటిని ఇక్కడ కనుగొన్నారు. ఆ నీరు ఆక్సికరణకు గురికావడం వల్ల అది ఎర్రని రక్తం రంగులోకి మారుతోందని తెలుసుకున్నారు.

Also Read: విచిత్రం.. ఇతడికి కడుపు లేదు, పేగుల్లేవు.. అయినా బతికేస్తున్నాడు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Government Banned OTT Apps: 18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Embed widget