Pinni Sweet: మొదటి ప్రపంచ యుద్ధంలో ఈ స్వీటు కోసం పట్టుబట్టిన సైనికులు, ఏమిటీ తీపి పదార్థం?
భారతీయ సంప్రదాయాల్లో ఆహారానికి పెద్ద పీట వేస్తారు. ప్రతి ఆహారరం ఆరోగ్యాన్నందించేలా తయారుచేస్తారు.
భారతదేశం అంతటా ఎన్నో కులాలు, మతాలు, సంప్రదాయాలు. పూర్వం నుంచి వచ్చే సంప్రదాయ ఆహారాలు కూడా ఎన్నో. అలా పంజాబీలలో ప్రాచీన కాలం నుంచి ఆనవాయితీగా వస్తున్న తీపి పదార్థం ‘పిన్ని’. దీన్ని కచ్చితంగా వారు తింటారు. ప్రతి పంజాబీ ఇంట్లో ఈ స్వీటు కచ్చితంగా ఉండాల్సిందే. ఈ తీపి పదార్ధానికి, మొదటి ప్రపంచ యుద్ధానికి ఎంతో సంబంధం ఉంది. ఆ బంధాన్ని ఇప్పటికీ పంజాబీలు మర్చిపోరు. ఆ విషయాన్ని పిల్లలకు కథలుగా చెప్పుకుంటారు.
ప్రపంచయుద్ధంలో పిన్ని పాత్ర...
మొదటి ప్రపంచ యుద్ధం 1914లో మొదలై 1918 వరకు సాగింది. చరిత్రలో అత్యంత ఘోరమైన యుద్ధాల్లో ఇదీ ఒకటి. ఎంతో మంది ప్రాణాలను బలిగొన్న మారణ హోమం ఇది. ఈ యుద్ధంలో 30కి పైగా దేశాలు పాల్గొన్నాయి. ఆ సమయంలో మనదేశాన్ని బ్రిటన్ పాలిస్తోంది. బ్రిటిష్ వారు మన దేశం నుంచి సైనికులను యూరోప్‌కు పంపారు.దాదాపు 15 లక్షల మంది భారతీయ సైనికులు యుద్ధానికి తరలి వెళ్లారు. ఐరోపాలోని వివిధ ప్రాంతాల్లో వీరిని యుద్దానికి పంపారు. నెలల తరబడి భారతీయ సైనికులు పోరాడారు. అయితే చల్లని ప్రాంతాల్లో ఉండలేక చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ సైనికుల్లో ఎంతో మంది పంజాబీలు కూడా ఉన్నారు. తాము ఆ చలిని తట్టుకుని యుద్ధం చేయాలంటే తమకు ‘పిన్ని’ స్వీటును పంపించాలని వారు డిమాండ్ చేశారు. చల్లని వాతావరణంలో ఆ స్వీటు తినడం వల్ల శరీరానికి వెచ్చదనం రావడంతో పాటూ, పోరాడే శక్తి కూడా పెరుగుతుంది. దీంతో పిన్ని స్వీటును భారీగా తయారు చేయించి, యూరోప్ దేశాలకు పంపించారు బ్రిటిష్ అధికారులు. వాటిని తినడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకున్నారు ఎంతో మంది సిక్కు సైనికులు. తమ దేశం నుంచి వచ్చిన ఆహారం వారిలో మనోధైర్యాన్ని కూడా నింపింది.
ఏమిటీ స్వీటు?
పిన్ని అనేది ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి చెందిన తీపి వంటకం. పంజాబీ స్వీట్. లడ్డూల రూపంలో ఉంటుంది. గోధుమ పిండి, బొంబాయి రవ్వ, నట్స్, పంచదార, నెయ్యి వేసి దీన్ని తయారుచేస్తారు. పంజాబీలు చలికాలంలో కచ్చితంగా ఈ స్వీటును తింటారు. ఇది చక్కని ఆరోగ్యంతో పాటూ, శరీర ఉష్ణోగ్రతలను కాపాడుతుందని వారి నమ్మకం. అది నిజమని ఇప్పటికే ఎంతో మంది పోషకాహార నిపుణులు చెప్పారు. వీటిలో పోషకాలు కూడా అధికం.
జనవరిలో వచ్చే సంక్రాంతికి ఈ స్వీటు పంజాబీల ఇళ్లల్లో కచ్చితంగా ఉండాల్సిందే. వీటిలో కాల్షియం, ఇనుము, విటమిన్ ఇ, విటమిన్ సి వంటి పోషకాహార విలువలు ఉంటాయి. శరీరానికి రోగనిరోధక శక్తికి అధికంగా అందిస్తాయి. దీన్ని కేవలం గోధుమపిండితోనే చేయాలని లేదు, కొంతమంది శెనగపిండి, మినప పిండి కూడా ఉపయోగిస్తారు.
View this post on Instagram
Also read: చలికాలంలోనే ఎక్కువమంది గుండెపోటుకు గురవుతారు, ఎందుకు?