Independence Day Wishes: జయహో ఇండియా, ఈ దేశభక్తి కోట్స్‌తో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పేయండి
భారత దేశ స్వాతంత్ర్య పండుగ పంద్రాగస్టు వచ్చేసింది. మీ ఆప్తులు, స్నేహితులకు ఈ కోట్స్ ద్వారా విషెస్ చెప్పేయండి మరి.
బ్రిటీష్ పాలకుల బానిసత్వం సంకెళ్లు తెంచుకుని.. భారతమాత స్వాతంత్ర్యం పొందిన రోజు ఇది. రెండు వందల ఏళ్ల బ్రిటిష్ పాలకుల బానిసత్వం నుంచి బయటపడిన రోజు ఇది. ఎందరో సమరయోధుల ప్రాణత్యాగాలు.. పోరాటల ఫలితంగా 1947వ సంవత్సరం, ఆగస్టు 15న మనం ఈ స్వాతంత్ర్యాన్ని సాధించుకున్నాం. ఈ నేపథ్యంలో ఆ మహానుభావులను స్మరిస్తూ.. వారికి మనసారా నివాళులు అర్పిస్తూ.. సగర్వంగా ఈ పంద్రాగస్టు వేడుక జరుపుకుందాం. ఈ కింది కోట్స్ ద్వారా మన బంధుమిత్రులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుదాం.
⦿ ఎందరో వీరుల త్యాగఫలం..
మన నేటి స్వేచ్ఛకే మూలబలం.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
⦿ మనం ఈ రోజు వేడుక జరుపుకోవడానికి
వారి ప్రాణాలను త్యాగం చేసిన వారికి
తల వంచి నమస్కరిస్తున్నాను.
హ్యాపీ ఇండిపెండెన్స్ డే.
⦿ దేశభక్తితో మీ హృదయాన్ని నింపుకోవాల్సిన సమయం ఇది.
అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
⦿ మన దేశాన్ని అత్యుత్తమంగా మారుద్దాం.
శాంతికి, దయకు మారుపేరుగా నిలుపుదాం.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
⦿ నింగికెగసిన స్వరాజ్య నినాదం..
భరతమాత చేతిలో..
రెపరెపలాడిన త్రివర్ణ పతాకం
సకల భారతావని ఆనంద సంబరం
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
⦿ అన్ని దేశాల్లో కెల్లా.. భారతదేశం మిన్న అని చాటి చెప్పే దిశగా అడుగులేస్తూ..
జరుపుకుందాం ఈ స్వాతంత్ర్యపు పండుగను మెండుగా కన్నుల పండుగగా..!!
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
⦿ ఆంగ్లేయుల చెర నుంచి భారత్‌ను విడిపించిన వారి కృషి అసాధారణమైనది.
వారి త్యాగాలని స్వాతంత్ర్య వేడుక సందర్భంగా స్మరించుకుందాం.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
⦿ సిరులు పొంగిన జీవగడ్డై..
పాలు పారిన భాగ్యసీమై..
రాలినది ఈ భారతఖండం..
భక్తితో పాడరా సోదరా..
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
⦿ స్వేచ్ఛకు ఉన్న నిజమైన అర్థమేంటో తెలుసుకుందాం.
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
⦿ స్వాతంత్య్రం, స్వేచ్ఛ అంటే ఎంజాయ్ చేయడం కాదు.
దాన్ని అర్థం చేసుకోవాలి. గౌరవించాలి.
ప్రజాస్వామ్యాన్ని సురక్షితంగా ఉంచడమే దేశమాతకు మనమిచ్చే ఘనమైన నివాళి.
స్వాతంత్య్ర సమరయోధులు కలగన్న భారత్‌ను నిర్మించుకుందాం.
⦿ ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. ఏ పీఠమెక్కినా.. ఎవ్వరేమనినా..
పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలుపరా నీ జాతి నిండు గౌరవము..
అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
⦿ భారతీయని బాధ్యతగా ఇచ్చింది నాటి తరం..
భారతీయతని బలంగా మార్చుకుంది నేటి తరం..
మరింత మురవాలి ముందుతరం..
శ్రమిద్దాం నిరంతరం.. వందేమాతరం!
అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
⦿ నేటి మన స్వాతంత్ర్య సంబరం..
ఎందరో సమరయోధుల త్యాగ ఫలం..
భరతమాత దాస్యశృంఖలాలకు విమోచనం శుభదినం..
అమర వీరుల త్యాగ ఫలాన్ని అనుభవిస్తూ..
వారి ఆత్మకు శాంతి అర్పించే నివాళి దినం..
స్వాతంత్ర్య దినోత్సవం.
⦿ భారతీయతను బాధ్యతగా ఇచ్చింది నిన్నటితరం..
భారతీయతను బలంగా మార్చుకుంది నేటి తరం..
భారతీయతని సందేశంగా పంపుదాం మనం.. తరం తరం.
అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
⦿ దేశం మనదే.. తేజం మనదే..
ఎగురుతున్న జెండా మనదే..
నీతి మనదే జాతి మనదే..
ప్రజల అండ దండా మనదే..
ఎన్ని బేధాలున్నా..
మాకెన్ని తేడాలున్నా..
దేశమంటే ఏకమౌతం..
వందేమాతరం అందాం మనమందరం.
⦿ సమరయోధుల పోరాట బలం.. అమర వీరుల త్యాగఫలం.
బ్రిటీష్ పాలకులపై తిరుగులేని విజయం..
మన స్వాతంత్ర్య దినోత్సవం..
సామ్రాజ్యవాదుల సంకెళ్లు తెంచుకుని..
భరతజాతి విముక్తి పొందిన చరిత్రాత్మకమైన రోజు.
- అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
⦿ జగతి సిగలో జాబిలమ్మకు వందనం..
మమతలెరిగిన మాతృభూమికి మంగళం మాతరం..
మగువ శిరస్సున మణులు పొదిగెను హిమగిరి..
కలికి పదములు కడలి కడిగినర కళ ఇది.
అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
⦿ అమరం మన స్వాతంత్ర్య సమరయోధుల జీవితం..
శాశ్వతం మువ్వన్నెల పతాకం..
చరితార్థం మా భారతావని భవితవ్యం..
వందేమాతరం.. వందే మాతరం..
భారతీయతే మా నినాదం!
మిత్రులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
⦿ వందేమాతరం..
భారతీయతే మా నినాదం..
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
⦿ మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం అశువులు బాసిన సమర యోధుల
దీక్షా దక్షతలను స్మరిస్తూ..
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
⦿ మన స్వేచ్ఛ, స్వాతంత్య్ర కోసం అశువులు బాసిన సమరయోధుల దీక్ష, దక్షతలను స్మరిస్తూ..
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
⦿ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
నేటి మన స్వాతంత్ర్య సంభరం..
ఎందరో త్యాగవీరుల త్యాగఫలం.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
⦿ మాతృభూమి కోసం తన ధన, మాన, ప్రాణాలను
త్యాగం చేసిన భరతమాత ముద్దుబిడ్డలకు
వందనం.. అభివందనం.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
మహనీయులు చెప్పిన ఈ సూక్తులను సైతం పంచుకోండి
⦿ ఇంక్విలాబ్ జిందాబాద్
- భగత్ సింగ్
⦿ మనుషులను చంపగలరేమో..
వారి ఆదర్శాలను చంపలేరు.
- భగత్ సింగ్
⦿ దేశం కోసం చనిపోయేవారు ఎల్లకాలం బతికే ఉంటారు.
- భగత్ సింగ్
⦿ విప్లవం కలహాలతో కలవలేదు.
బాంబులు, తుపాకులు విప్లవం చేయలేవు.
విప్లవం అనే కత్తికి మీ ఆలోచనలతో పదును పెట్టండి.
- భగత్ సింగ్
⦿ తిరుగుబాటు విప్లవం కాదు.
అది ముగింపునకు దారి తీయవచ్చు.
- భగత్ సింగ్
⦿ కనికరం లేని విమర్శలు, స్వతంత్ర ఆలోచనలు..
విప్లవానికి అవసరమైన రెండు విశిష్ట లక్షణాలు.
- భగత్ సింగ్
⦿ వారు నన్ను చంపవచ్చు.
కానీ నా ఆలోచనలను చంపలేరు.
నా శరీరాన్ని దహించగలరు.
కానీ నా ఆత్మను దహించలేరు.
- భగత్ సింగ్
⦿ జీవితాన్ని ప్రేమిస్తాం,
మరణాన్ని ప్రేమిస్తాం,
మేం మరణించి,
ఎర్రపూల వనంలో పూలై పూస్తాం,
ఉరికంబాన్ని ఎగతాళి చేస్తాం,
నిప్పురవ్వల మీద నిదురిస్తాం.
- భగత్ సింగ్
⦿ నువ్వు నాకు నీ రక్తాన్ని అందివ్వు,
నేను నీకు స్వాతంత్య్రం ఇస్తాను.
- సుభాష్ చంద్ర బోస్
⦿ ఇతరుల మెదళ్లను సైతం పనిచేయించేవాడే మేధావి.
- సుభాష్ చంద్రబోస్
⦿ స్వేచ్ఛలోని ఆనందాన్ని..
స్వాతంత్ర్యపు ప్రశాంతిని కోరుకుంటున్నారా?
వాటికి నువ్వు బాధ, త్యాగం చెల్లించాలి.
- నేతాజీ సుభాష్ చంద్రబోస్
⦿ దేశం కోసం చావడాని సిద్ధంగా లేనివారికి..
దేశంలో బ్రతికే హక్కు ఉండదు!
- నేతాజీ సుభాష్ చంద్రబోస్
⦿ సిద్ధాంతం కోసం ప్రాణాన్ని కోల్పోవచ్చు.
ఆ సిద్ధాంతం.. ఆ వ్యక్తి మరణం తర్వాత ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతుంది.
ఎందరికో మేలు చేస్తుంది.
- నేతాజీ సుభాష్ చంద్రబోస్
⦿ స్వేచ్ఛ నా జన్మహక్కు.
అది నేను తప్పక పొందుతాను.
- బాల గంగాధర్ తిలక్
⦿ సమస్యలు ఎదురయ్యేవి.. వనరులు లేదా సామర్థ్యం లేకపోవడం వల్ల కాదు,
సంకల్పం లేకపోవడం వల్ల.
- బాల గంగాధర్ తిలక్
⦿ దేవుడు అంటరానితనం పాటిస్తే..
నేను అతన్ని దేవుడు అని పిలవను.
- బాల గంగాధర్ తిలక్
⦿ జీవితమంటే పేకాట. సరైన కార్డును ఎంచుకోవడం మన చేతిలో ఉండదు.
కానీ చేతిలో ఉన్న కార్డులతో బాగా ఆడటం మన విజయాన్ని నిర్ణయిస్తుంది.
- బాల గంగాధర్
⦿ విజయం ద్వారా తృప్తి లభించదు.
పూర్తి ప్రయత్నమే సంపూర్ణ విజయం.
- మహాత్మా గాంధీ
⦿ ఎంత గొప్పగా జీవించావనేది నీ చేతులు చెప్పాలి.
ఎంత గొప్పగా మరణించావనేది ఇతరులు చెప్పాలి.
- మహాత్మా గాంధీ
⦿ ఈ ప్రపంచంలో నువ్వు ఆశించే మార్పు.. మొదట నీతోనే మొదలవ్వాలి.
- మహాత్మా గాంధీ
⦿ అహింసకు మించిన ఆయుధం లేదు.
- మహాత్మా గాంధీ
⦿ ఆత్మాభిమానం, గౌరవాల్ని వేరెవరో పరిరక్షించరు.
మనల్ని మనమే వాటిని కాపాడుకోవాలి.
- మహాత్మా గాంధీ
⦿ మేధావులు మాట్లాడుతారు.. మూర్ఖులైతే వాదిస్తారు.
- మహాత్మా గాంధీ
⦿ ప్రజలు చేతిలో ఆయుధాలు.. ఓటు, సత్యాగ్రహం!
- మహాత్మా గాంధీ
⦿ బలహీనులు ఎప్పటికీ క్షమించలేరు.
క్షమించడానికి ఎంతో ధైర్యం కావాలి.
- మహాత్మా గాంధీ