Skin Care: అమ్మాయిలూ మీరు ఇలా నిద్రపోతే మొటిమలు రావడం ఖాయం
అమ్మాయిలూ ఎక్కువగా ఎదుర్కొనే సమస్య మొటిమలు. అవి మీరు పడుకునే విధానం వల్ల మరింత ఎక్కువ అవుతాయని మీకు తెలుసా?
ఒత్తిడి, కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, కఠినమైన రసాయనాలను ఉపయోగించడం వల్ల మొటిమలు వస్తాయనే అనుకుంటారు. కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే మీరు పడుకునేటప్పుడు చేసే తప్పులు కూడా మొటిమలకు కారణమవుతాయి. ఈ విషయాన్ని చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. కానీ పడుకునే విధానం వల్ల మొటిమలు వస్తాయి. నిద్ర విధానం చర్మం స్థితిని ప్రభావితం చేస్తుంది. చర్మం విశ్రాంతి తీసుకోవడానికి రాత్రివేళ ఉత్తమమైన సమయం. చర్మం పునరుద్ధరించబడుతుంది. కానీ మనం చేసే చిన్న చిన్న తప్పులు చర్మానికి పూర్తిగా హాని కలిగిస్తాయి. ఫలితంగా తెల్లవారే లేచి ముఖం అద్దంలో చూసుకుంటే మొటిమలు కనిపిస్తాయి. అందుకే మీరు ఈ సమస్య నుంచి బయట పడాలంటే ఈ తప్పులు అసలు చేయొద్దు.
దిండు కవర్ మార్చాలి
ఉతికిన శుభ్రమైన దుస్తులు ఎలా ధరిస్తామో అలాగే దిండు కవర్లు కూడా క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. ఎప్పటికప్పుడు పిల్లో కవర్స్ మారుస్తూ ఉండాలి. ఎందుకంటే వాటి మీద దుమ్ము, ధూళి కనిపించకుండా ఉంటుంది. దిండు మీద ముఖం మీద పెట్టుకుని పడుకున్నపుడు అందులోని బ్యాక్టీరియా చర్మంలోకి ప్రవేశిస్తుంది. ఇది మొటిమలను కలిగిస్తుంది. అందుకే కనీసం వారానికి ఒకసారి అయినా మీ దిండు కవర్ మార్చుకోవాలి.
మేకప్ తీసేయాలి
అర్థరాత్రి లేదా ఈవినింగ్ టైమ్ పార్టీకి వెళ్ళి వచ్చిన తర్వాత అలసిపోయి మేకప్ తీయకుండానే పడుకుంటారు. కానీ అసలు అలా చేయొద్దు. మేకప్ వేసుకుని పడుకోవడం వల్ల చర్మానికి హాని కలుగుతుంది. మేకప్ లోని అవశేషాలు రాత్రంతా రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తాయి. దీని వల్ల మొటిమలు వస్తాయి. అందుకే మీరు ఎంత అలసిపోయినా కూడా మేకప్ ని తప్పనిసరిగా రిమూవ్ చేశాక పడుకోండి.
పొట్ట మీద పడుకోవడం
చాలా మందికి బోర్లా పడుకునే అలవాటు ఉంటుంది. దీని వల్ల కూడా మొటిమలు వస్తాయి. పొట్ట మీద పడుకోవడం వల్ల చర్మం నేరుగా దిండు కవర్ మీదే ఉంటుంది. దీని వల్ల చర్మం మీద అధిక ఒత్తిడి పడుతుంది. అలా జరకూడదు అంటే వెల్లకిలా లేదంటే పక్కకి తిరిగి పడుకోవాలి.
రాత్రంతా హెయిర్ ఆయిల్ వాడటం
హెయిర్ ఆయిల్స్ జుట్టుకి మంచిదే, కానీ అవి చర్మంపై దుష్ప్రభావాలను కలిగిస్తాయి. ఆయిల్ స్కిన్ ఉన్నవారు తలకి నూనె పెట్టుకుని నిద్రపోకూడదు. ఎందుకంటే ఆయిల్ రాత్రంతా మొహానికి కారుతుంది. అదనపు సెబమ్ చర్మం మీద మొటిమలు కలిగిస్తుంది. జుట్టుకు పోషణ అందించాలనుకుంటే వేడి నూనెతో మసాజ్ చేసుకోవాలి. షాంపూ చేసుకోవడానికి రెండు గంటల ముందు రాసుకుంటే సరిపోతుంది.
ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి
చర్మం మీద చాలా మురికి ఉంటుంది. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, కాలుష్యం వల్ల రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు కలిగిస్తాయి. అందుకే రాత్రి పడుకునే ముందు ఫేస్ వాష్ ఉపయోగించడం చాలా ముఖ్యం. అలాగే చర్మానికి ఫేస్ వాష్ రాసుకునే ముందు తప్పనిసరిగా చేతులు ముందు శుభ్రం చేసుకోవాలి. మొటిమలు నివారించడంలో డబుల్ కక్లెన్సింగ్ పద్ధతులు చాలా ఉపయోగపడతాయి.
మురికి టవల్ వద్దు
చర్మానికి సరైన క్లెన్సర్ ఉపయోగించాలి. చర్మంపై మురికి టవల్ లేదా వాష్ క్లాత్ ఉపయోగించడం వల్ల మొటిమలు ఏర్పడతాయి. మొటిమలు నివారించడానికి శుభ్రం చేసిన్ టవల్ ఉపయోగించాలి. లేదంటే అవి బ్యాక్టీరియాకి సంతానోత్పత్తి కలిగించే ప్రదేశాలు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: వీటిని నీటిలో వేసుకుని స్నానం చేశారంటే అదృష్టం మీ వెంటే!