అన్వేషించండి

Dog Breeds: పిల్లల కోసం శునకాన్ని పెంచాలనుకుంటే ఈ జాతి శునకాలే బెటర్, ప్రేమగా ఉంటాయ్

పెంపుడు కుక్కల సంఖ్య పెరిగిపోతోంది. చాలా మంది ఇళ్లల్లో కుక్కల్ని పెంచుకోవడం ఫ్యాషన్‌గా మారిపోయింది.

కొందరికి పెంపుడు శునకాలను ఇంట్లో పెంచుకోవడం సరదా, మరికొందరికి అవసరం. ఏది ఏమైనా కుక్కలు ఇప్పుడు అధిక ఇళ్లల్లో కనిపిస్తున్నాయి. చాలా మంది తమ పిల్లల కోసమే శునకాలను పెంచుతారు. మనిషి, కుక్కల మధ్య స్నేహం చాలా అందంగా ఉంటుంది. పిల్లలున్న చాలా ఇళ్లల్లో బుజ్జిబుజ్జి శునకాలు కనిపిస్తాయి. అయితే కుక్కల్లో ఎన్నో జాతులు ఉన్నాయి. అన్నీ స్నేహపూర్వకంగా, పిల్లల్ని ప్రేమగా చూడవు. మీ బుజ్జాయిల కోసమే శునకం కావాలనుకుంటే మాత్రం కింద చెప్పిన జాతి పప్పీలను తెచ్చుకోండి. ఇవి ఇంట్లో కలిసిపోతాయి. విశ్వాసంగా, స్నేహంగా ఉంటాయి. మీరు చూపించే కాసింత ప్రేమకే పొంగిపోతాయ్. 

ఇవన్నీ మంచివే...
గోల్డెన్ రిట్రీవర్, బీగల్స్ కాకర్ స్పానియల్ కోలీ, లాబ్రడార్ రిట్రీవర్, పగ్స్, పూడ్లేస్, డాల్మేషియన్స్, జర్మన్ షెపర్డ్స్, సెయింట్ బెర్నార్డ్, కావలీర్ కింగ్ చార్లెస్ స్పానియల్, బార్డర్ కోలీ, న్యూఫౌండ్‌ల్యాండ్, హవానీస్, పాపిలాన్, బెర్నీస్ మౌంటైన్ డాగ్, షియోన్, బిచోన్ వంటి స్నేహపూర్వక కుక్క జాతులుగా చెప్పుకుంటారు. వీటిల్లో కూడా ఇంకా  ప్రేమపూరితంగా ఉండేవి ఏవంటే...

పగ్
కుక్కలలో ఇవి చాలా క్యూట్ గా ఉంటాయి. తెలివైనవి కూడా. చాలా ఉత్సాహంగా ఉంటాయి. చిన్నగా ఉంటాయి కనుక వీటికి ఇంట్లో పెద్ద చోటు కూడా అవసరం ఉండదు. మెరిసే కళ్లతో, ముఖంపై ముడతలతో ఉండే ఇవి యజమానులను బాగా ప్రేమిస్తాయి. ఎక్కువగా మొరగవు. కాబట్టి చిన్న పిల్లలు నిద్రపోయిన సమయంలో కూడా పెద్దగా డిస్ట్రబ్ చేయవు. ఇవి గారాబం చేయాలని కోరుకుంటాయి. పిల్లలతో బాగా ఆడుతాయి. 

పొమేరియన్
పోమెరేనియన్ కుక్కలు చాలా బబ్లీగా ఉంటాయి. అందంగా కనిపిస్తాయి. ఇవి కూడా తెలివైనవే. అంతేకాదు పిల్లలతో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకుంటాయి. వీటికి శిక్షణ ఇవ్వడం కూడా చాలా సులువు. ఆప్యాయతను పంచుతుంది.ఒక్కసారి మీరు ఈ కుక్కలకి అలవాటు పడితే వేరే జాతుల జోలికి వెళ్లరు.

బీగిల్
చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండే శునక జాతి ఇది. వీటిని ఫ్యామిలీ డాగ్స్ అని పిలుచుకోవచ్చు. మనిషి కుటుంబంలో ఇట్టే కలిసిపోతుంది. ఇది శక్తిమంతంగా కూడా ఉంటాయి. అవసరమైనప్పుడు పిల్లలకు రక్షణగా నిలుస్తాయి. ఇవి మంచి ప్లేమేట్స్. ఆగకుండా ఆడుతూనే ఉంటాయి. పిల్లల్ని ఆడించడంలో ముందుంటాయి. అన్నట్టు ఇవి మంచి కాపలా కుక్కలు కూడా. దీనికి ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే యజమానులను హెచ్చరిస్తాయి కూడా. 

లాబ్రాడార్
అమెరికాలో అత్యంత ప్రసిద్ధి చెందిన శునకాల జాతి లాబ్రడార్. వీటికి ఓపిక ఎక్కువ. వేటలో, ప్రేమను చూపించడంతో, చెప్పిన మాట వినడంలో ఇవి ముందుంటాయి. ఇవి చాలా చురుకు. పిల్లలకు మంచి స్నేహితులు అవుతాయి. చెప్పిన విషయాన్ని వెంటనే గ్రహిస్తాయి.

గోల్డెన్ రిట్రీవర్ 
గోల్డెన్ రిట్రీవర్లు ప్రపంచ ప్రసిద్ధి చెందని శునక జాతి. అందుకే ఫిబ్రవరి 3న జాతీయ గోల్డెన్ రిట్రీవర్స్ డే గా నిర్వహించుకుంటారు. పిల్లలకు ఇది మంచి ఫ్రెండ్ అవుతుంది. అందుకే ఎక్కువ మంది ఇళ్లల్లో కనిపించే శునకజాతి ఇది. సహనం, ఉల్లాసం, ప్రేమించే గుణం... ఇవన్నీ గోల్డెన్ రిట్రీవర్‌కు ఎక్కువ. చాలా విశ్వాసంగా ఉంటాయి. పిల్లలకు కాపల కాయడంలో, రక్షణగా నిలవడంతో వీటికి సాటి లేదు.  

Also read: ‘గోల్డెన్ హనీ’ రోజుకో స్పూను తాగితే ఆ సమస్యలన్నీ దూరం, దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు

Also read: ఏటా పది లక్షల మరణాలకు కారణం అవుతోన్న దోమ, ఇది ఎన్ని రోగాలను వ్యాపింపజేస్తుందో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Telangana Mother Statue : తెలంగాణ తల్లి విగ్రహం ఫస్ట్ లుక్ -  రేవంత్ తెలంగాణ ప్రజల్ని మెప్పించినట్లేనా ?
తెలంగాణ తల్లి విగ్రహం ఫస్ట్ లుక్ - రేవంత్ తెలంగాణ ప్రజల్ని మెప్పించినట్లేనా ?
Best Earbuds Under Rs 3000: రూ.మూడు వేలలోపు బెస్ట్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ - వన్‌ప్లస్ నుంచి బోట్ వరకు!
రూ.మూడు వేలలోపు బెస్ట్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ - వన్‌ప్లస్ నుంచి బోట్ వరకు!
YSRCP MP: పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమలలో పంచమితీర్థం, అస్సలు మిస్ అవ్వొద్దువిజయవాడలో రెచ్చిపోయిన  గంజాయి, బ్లేడ్ బ్యాచ్రాజ్యసభలో తెలంగాణ ఎంపీ సీట్‌లో నోట్ల కట్టలుఆ డబ్బుతో నాకు సంబంధం లేదు, ఎంపీ అభిషేక్ మనుసింఘ్వీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Telangana Mother Statue : తెలంగాణ తల్లి విగ్రహం ఫస్ట్ లుక్ -  రేవంత్ తెలంగాణ ప్రజల్ని మెప్పించినట్లేనా ?
తెలంగాణ తల్లి విగ్రహం ఫస్ట్ లుక్ - రేవంత్ తెలంగాణ ప్రజల్ని మెప్పించినట్లేనా ?
Best Earbuds Under Rs 3000: రూ.మూడు వేలలోపు బెస్ట్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ - వన్‌ప్లస్ నుంచి బోట్ వరకు!
రూ.మూడు వేలలోపు బెస్ట్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ - వన్‌ప్లస్ నుంచి బోట్ వరకు!
YSRCP MP: పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Pushpa 2: ఫేక్ డైలాగ్స్ షేర్ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటాం - 'పుష్ప 2' ప్రొడక్షన్ హౌస్ వార్నింగ్
ఫేక్ డైలాగ్స్ షేర్ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటాం - 'పుష్ప 2' ప్రొడక్షన్ హౌస్ వార్నింగ్
Anantapuram News: అమ్మా నాన్న క్షమించండి అంటూ ఫోన్ కాల్ - ఎంబీబీఎస్ సీటు రాలేదని రైలు నుంచి దూకి యువతి ఆత్మహత్య
అమ్మా నాన్న క్షమించండి అంటూ ఫోన్ కాల్ - ఎంబీబీఎస్ సీటు రాలేదని రైలు నుంచి దూకి యువతి ఆత్మహత్య
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
Pushpa 2 Collection: ఇండియన్  బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన అల్లు అర్జున్... పుష్ప 2 డే 1 @ 294 కోట్లు
ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన అల్లు అర్జున్... పుష్ప 2 డే 1 @ 294 కోట్లు
Embed widget